Hari Hara Veeramallu: 2021లో ప్రముఖ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి(Krish jagarlamudi) దర్శకత్వంలో పీరియాడికల్ యాక్షన్ డ్రామా హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) మూవీని ప్రకటించారు. ఏ.ఎం.రత్నం (AM Ratnam) భారీ బడ్జెట్ తో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా, నిధి అగర్వాల్(Nidhi Agarwal) హీరోయిన్గా ఈ సినిమా ప్రారంభం అయ్యింది. సినిమా షూటింగ్ ప్రారంభమైన కొన్ని రోజులకే కరోనా లాక్ డౌన్ విధించడంతో సినిమా షూటింగ్ ఆగిపోయింది. దీనికి తోడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా మారిపోవడం వల్ల ఇక్కడ సినిమా షూటింగ్ ఆలస్యం అవ్వడంతో డైరెక్టర్ కూడా తప్పుకున్నారు. ఇక దాదాపు మూడు సంవత్సరాల పాటు పక్కన పడేసిన ఈ సినిమాను మళ్లీ జ్యోతి కృష్ణ (Jyoti Krishna) హ్యాండ్ ఓవర్ చేసుకొని ఎట్టకేలకు షూటింగ్ పూర్తి చేశారు.
హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ బిజినెస్..
జూలై 24వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబంధించి గత కొన్ని రోజులుగా బిజినెస్ కష్టాలు అంటూ కొంతమంది వార్తలు వైరల్ చేసిన విషయం తెలిసిందే.కానీ ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. పవన్ కళ్యాణ్ సినీ కెరియర్ లోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ ఈ మూవీకే జరిగింది అని తెలుస్తోంది. అంతేకాదు ఏరియా వైజ్ ఎన్ని కోట్లకు ఈ సినిమా హక్కులు కొనుగోలు చేశారు అనే విషయం కూడా ఇప్పుడు ఒకసారి చూద్దాం.
ఏరియా వైజ్ ప్రీ రిలీజ్ బిజినెస్..
నైజాం – రూ. 37 కోట్లు
సీడెడ్ – రూ.16.50 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 12 కోట్లు
ఈస్ట్ గోదావరి – రూ.9.50 కోట్లు
వెస్ట్ గోదావరి – రూ. 7 కోట్లు
గుంటూరు – రూ. 9.50 కోట్లు
కృష్ణ – రూ. 7.60 కోట్లు
నెల్లూరు – రూ.4.40 కోట్లు.
ఆంధ్రప్రదేశ్ + తెలంగాణ – రూ. 103.50 కోట్లు
కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా – రూ.12.50 కోట్లు
ఓవర్సీస్ – రూ.10 కోట్లు
బ్రేక్ ఈవెన్ కొట్టాలంటే అన్ని రూ.127 కోట్లురాబట్టాల్సిందే..
ఇక మొత్తం ప్రపంచవ్యాప్తంగా – రూ 126 కోట్లు రాబట్టిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే రూ.127 కోట్లు రాబట్టాల్సి ఉంటుంది. మొత్తానికైతే ఈ సినిమా క్లీన్ హిట్ సొంతం చేసుకోవాలి అంటే రూ.127 కోట్ల షేర్ , రూ.260 కోట్ల గ్రాస్ వసూలు చేస్తే.. ఇక క్లీన్ హిట్ అవుతుందని చెప్పవచ్చు. ఈ బిజినెస్ పవన్ కళ్యాణ్ సినీ కెరియర్ లోనే అత్యధికంగా జరిగింది అని చెప్పవచ్చు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ మూవీకి బిజినెస్ కష్టాలు అని, ముఖ్యంగా నైజాం ఏరియాలో ఈ సినిమాను కొనుగోలు చేయడానికి ఎవరు ముందుకు రాలేదని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ సినిమాకు జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.