BigTV English

Top 5 Battery life Phones: 2025లో భారీ బ్యాటరీ లైఫ్ ఇచ్చే టాప్ 5 బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లు

Top 5 Battery life Phones: 2025లో భారీ బ్యాటరీ లైఫ్ ఇచ్చే టాప్ 5 బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లు

Top 5 Battery life Budget Phones| ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్‌లు మన జీవితంలో అంతర్భాగమైపోయాయి. అందుకే రోజంతా ఫోన్ ఉపయోగించే వారికి బ్యాటరీ లైఫ్ చాలా ముఖ్యం. కానీ అందరికీ పవర్ బ్యాంక్ లు తమతో తీసుకెళ్లే సౌకర్యం లేదా అలవాటు ఉండదు. 2025లో, ₹30,000 లోపు ధరలో శక్తివంతమైన పనితీరు, దీర్ఘకాల బ్యాటరీ జీవితం ఉన్న స్మార్ట్‌ఫోన్‌లను కనుగొనడం కొంచెం కష్టమే. అయితే, డిజిట్ టెస్ట్ ల్యాబ్స్‌లో జరిగిన పనితీరు మరియు బ్యాటరీ టెస్ట్‌ల ఆధారంగా, ఈ ధరలో అత్యుత్తమ బ్యాటరీ లైఫ్ ఉన్న టాప్ 5 స్మార్ట్‌ఫోన్‌ల జాబితాను మీకు అందిస్తున్నాము.


1. పోకో F7 – పవర్‌ఫుల్ బ్యాటరీతోపాటు పవర్‌ఫుల్ పర్‌ఫామెన్స్
హెవీ డ్యూటీ బ్యాటరీ గల ఫోన్ల జాబితాలో టాప్ లో ఉంది పోకో F7. ఇందులో 7550mAh భారీ బ్యాటరీ ఉంది. మిడ్ రేంజ్ ధరగల ఫోన్లలో ఇదే అతిపెద్ద బ్యాటరీ. గేమింగ్, వీడియో స్ట్రీమింగ్, సోషల్ మీడియా వంటి భారీ వినియోగంలో కూడా ఈ ఫోన్ అద్భుతంగా పనిచేస్తుంది. 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో, ఈ ఫోన్ కేవలం ఒక గంటలో 0 నుండి 100% వరకు ఛార్జ్ అవుతుంది. ఎక్కువగా ఫోన్‌ను ఉపయోగించే వారికి లేదా బ్యాటరీ తక్కువ అనే హెచ్చరికను ద్వేషించే వారికి ఇది ఉత్తమ ఎంపిక.

2. వివో T4 & iQOO Z10 – ప్రయాణాలు చేసేవారికి ది బెస్ట్
ప్రయాణాలు ఎక్కువ చేసే వారికి లేదా ఛార్జర్ నుండి దూరంగా ఉండే వారికి వివో T4, iQOO Z10.. ఇవి రెండూ సరైన ఆప్షన్‌లు. ఈ రెండు ఫోన్‌లలో 7300mAh బ్యాటరీతో వస్తాయి. ఫోన్ ఎక్కువగా ఉపయోగించేవారికి కూడా ఒక రోజు కంటే ఎక్కువ కాలం పనిచేస్తాయి. 90W ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యంతో, ఈ ఫోన్‌లు 40 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ అవుతాయి. బ్యాటరీ సామర్థ్యాన్ని ఆదా చేసే ప్రాసెసర్‌లతో రూపొందించబడ్డాయి. ఇవి దీర్ఘకాల ఉపయోగానికి అనువైనవి.


3. iQOO నియో 10R – గేమర్స్‌కు అనువైనది
మొబైల్ గేమర్స్‌కు iQOO నియో 10R ఒక గొప్ప ఎంపిక. ఈ ఫోన్ 90fps గేమింగ్ సామర్థ్యంతో 6500mAh బ్యాటరీని కలిగి ఉంది. 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో, 25 నిమిషాల్లో 50 శాతం ఛార్జ్ అవుతుంది, ఇది గేమర్స్‌కు సమయాన్ని ఆదా చేస్తుంది. బడ్జెట్‌లో గేమింగ్ ఫోన్ కోసం చూస్తున్న వారికి ఇది అద్భుతమైన ఆప్షన్.

4. పోకో X7 ప్రో – వీడియోలు చూసేవారికి అనువైనవి
వీడియో స్ట్రీమింగ్, బ్రౌజింగ్ లేదా మ్యూజిక్ కోసం ఫోన్‌ను ఎక్కువగా ఉపయోగించే వారికి పోకో X7 ప్రో ఒక సూపర్ ఛాయిస్. ఈ ఫోన్ 6000mAh బ్యాటరీతో వస్తుంది, సాఫ్ట్‌వేర్ ఆప్టిమైజేషన్‌తో ఇది అద్భుతమైన బ్యాటరీ జీవితాన్ని అందిస్తుంది. మా టెస్ట్‌లలో, 30 నిమిషాల యూట్యూబ్ స్ట్రీమింగ్ కేవలం 3-4% బ్యాటరీని మాత్రమే వినియోగించింది. 90W ఫాస్ట్ ఛార్జింగ్‌తో, ఈ ఫోన్ 45 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది.

5. రియల్‌మీ P3 ప్రో & P3 అల్ట్రా
స్టైలిష్ డిజైన్, స్థిరమైన పనితీరు, దీర్ఘకాల బ్యాటరీ కావాలనుకునే వారికి రియల్‌మీ P3 ప్రో, P3 అల్ట్రా గొప్ప ఆప్షన్‌లు. ఈ రెండు ఫోన్‌లు 6000mAh బ్యాటరీలతో వస్తాయి. అడ్వాన్స్ సాఫ్ట్‌వేర్‌తో బ్యాటరీ ఆదా చేస్తూ పర్‌ఫామెన్స్‌ని మెరుగుపరుస్తాయి. 80W ఛార్జింగ్ సపోర్ట్‌తో, ఈ ఫోన్‌లు తక్కువ సమయంలో ఛార్జ్ అవుతాయి.

Also Read: 12GB ర్యామ్‌తో టాప్ 5 హై స్పీడ్ స్మార్ట్‌ఫోన్లు.. 2025 మిడ్ రేంజ్‌‌లో సూపర్ ఫోన్స్ ఇవే..

ఈ స్మార్ట్‌ఫోన్‌లు బ్యాటరీ లైఫ్, పనితీరు, ఫాస్ట్ ఛార్జింగ్, ఆకర్షణీయ డిజైన్‌ను ₹30,000 లోపు అందిస్తాయి. మీరు గేమర్ అయినా, ప్రయాణీకుడైనా, వీడియోలు చూసే వారైనా లేదా ఛార్జర్‌ను తీసుకెళ్లడం ఇష్టం లేని వారైనా, 2025లో ఈ ఫోన్‌లు మీకు ది బెస్ట్ ఆప్షన్‌లు.

Related News

Amazon Freedom Festival Laptops: రూ. 1 లక్ష లోపు ధరలో గేమింగ్ ల్యాప్‌టాప్స్.. బెస్ట్ డీల్స్ ఇవే

Windows 10 Support Ends: విండోస్ 10 సపోర్ట్ త్వరలోనే ముగింపు.. సెక్యూరిటీ అప్‌డేట్‌లను ఇలా పొందాలి

Whatsapp Guest Feature: అకౌంట్ లేకుండానే వాట్సాప్ మేసేజ్ పంపించవచ్చు.. ఎలాగంటే?

Samsung Truck Stolen: రూ 100 కోట్ల స్మార్ట్‌ఫోన్లు చోరీ.. 12000 శామ్‌సంగ్ డివైస్‌లు ఉన్న ట్రక్కు మాయం

TRAI App: బ్యాంక్, స్పామ్ కాల్స్‌తో తలనొప్పిగా ఉందా.. TRAI యాప్‌తో ఇలా చెయ్యండి

Poco M7 Plus: మార్కెట్లోకి మరో స్మార్ట్‌ఫోన్.. పోకో M7 ప్లస్ స్పెషల్ ఫీచర్స్ ఇవే, రిలీజ్ ఎప్పుడంటే..

Big Stories

×