BigTV English

OG Movie: రికార్డులు ఓకే.. రేట్లు పెంచితేనే కష్టం

OG Movie: రికార్డులు ఓకే.. రేట్లు పెంచితేనే కష్టం
Advertisement

OG Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం OG. కుర్ర డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 25 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏ ముహుర్తనా ఈ సినిమాను మొదలుపెట్టారో కానీ, అప్పటి నుంచి OG పై అభిమానులు అంచనాలను పెంచుకుంటూ వస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే సుజీత్ కూడా ఎక్కడా తగ్గనివ్వకుండా సినిమాపై హైప్ ని ఇంకా ఇంకా పెంచుతూ వస్తున్నాడు.


ఇక OG రిలిజ్ కు రెడీ అవుతోంది.  సినిమా రిలీజ్ అవ్వకముందే రికార్డులు అందుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా బిజినెస్ లెక్కలు చూస్తే ఇండస్ట్రీ షేక్ అవుతోంది. రికార్డ్ స్థాయిలో థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోయాయి. మేమంటే మేము అని పోటీ పడి మరీ రైట్స్ ను కొనుగోలు చేశారు. అందుతున్న సమాచారం ప్రకారం.. రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి రూ. 150 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది.

ఆంధ్ర హక్కులను రూ.80 కోట్లు, సీడెడ్ రైట్స్ ను రూ.23 కోట్లకు, నైజాం థియేట్రికల్ హక్కులు రూ.50 కోట్లుగా ఉన్నాయని సమాచారం. అయితే డిప్యూటీ సీఎం సినిమా అంటే.. టికెట్ రేట్ల గురించి ఒకరిని అడగాల్సిన పని లేదు. కచ్చితంగా ప్రతి స్టార్ హీరో సినిమాకు టికెట్ రేట్లను పెంచుకొనే అవకాశం ప్రభుత్వమే ఇచ్చింది. ఇక పవన్ సినిమాకు అయితే ఆ రేట్స్ ను విపరీతంగా పెంచుతున్నారు అనే వార్తలు వస్తున్నాయి. సీడెడ్, ఆంధ్రలో అయితే రేట్లు కచ్చితంగా పెంచుతారని అంటున్నారు. కానీ, నైజాం గురించి క్లారిటీ లేదు. నైజాంలో టికెట్ రేట్లు తగ్గితే.. ఈ అమౌంట్ లో కొంత తగ్గే అవకాశం ఉంది.


అయితే ఇక్కడే పెద్ద సమస్య.. ఎన్ని రికార్డులు కొట్టినా.. టికెట్ రేట్లు పెంచితే మాత్రం కష్టమే అని చెప్పుకొస్తున్నారు. ఎంత పవన్ సినిమా అయినా కానీ,  అంత రేటు పెట్టి టికెట్ కొని అయితే ప్రేక్షకులు చూడరు. ఇక ఫ్యాన్స్ మాత్రం మొదటిరోజు ఎంత అయినా చూస్తారు. కానీ, రెండో రోజు నుంచి పరిస్థితి ఏంటి.. ? క్రేజ్ ను బట్టి కాకుండా ప్రేక్షకుల గురించి ఆలోచించి టికెట్ రేట్స్ తగ్గిస్తే.. సినిమా పాజిటివ్ టాక్ వస్తే మంచి కలక్షన్స్ అందుకుంటుందని చెప్పుకొస్తున్నారు.  పవన్ సినిమా .. క్రేజ్ అలానే ఉంటుంది.. అంతే పెడతాం అంటే మాత్రం  కలక్షన్స్ ఏమో కానీ, థియేటర్స్ కు వచ్చేవాళ్లు కూడా కష్టమే అని కొందరు పెదవి విరుస్తున్నారు. మరిఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Related News

Bandla Ganesh: నా జీవితాన్ని మలుపు తిప్పిన డైరెక్టర్, హరీష్ శంకర్ రియాక్షన్ గమనించారా?

Spirit : ప్రభాస్ స్పెషల్ వీడియో రెడీ చేసిన సందీప్ రెడ్డి వంగ, మరో యానిమల్?

Hungry cheetah Song: ఓజి సినిమా నుంచి హంగ్రీ చీటా ఫుల్ సాంగ్ రిలీజ్!

K- RAMP: నా సినిమాకు మైనస్ రేటింగ్ ఇచ్చినా పర్లేదు, బాహుబలి K-Ramp ఒకేలా చూడాలి

Rashmika Mandanna: మొదటిసారి నిశ్చితార్థం పై స్పందించిన రష్మిక.. భలే సమాధానం ఇచ్చిందిగా!

Baahubali Re Release: 8 ఏళ్ల క్రితమే బాహుబలి రీ రిలీజ్‌ ప్లాన్.. జక్కన్నకు ఐడియా ఇచ్చింది ఇతనే

Ustad Bhagat Singh : 12 సంవత్సరాల నుంచి ఉన్న కసి బయటపడుతుంది, నిర్మాత ఉస్తాద్ అప్డేట్స్

Bandla Ganesh: బండ్లన్న ఇంట్లో నైట్ పార్టీ… మెగాస్టార్‌తో సహా ఇండస్ట్రీ అంతా అక్కడే

Big Stories

×