Bhimeshwara Temple: సిరిసిల్ల జిల్లా రాజన్న ఆలయంలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. హిందువుల పవిత్రతను దెబ్బతీసిన ఘట్టం ఇటీవల బయటపడింది. వేములవాడలోని ప్రసిద్ధ శ్రీ రాజరాజేశ్వరి స్వామి ఆలయం అనుబంధ భీమేశ్వర ఆలయంలో కొందరు అన్యమతస్తులు ప్రవేశించారు. ఆలయంలో చెప్పులతో తిరుగుతూ హిందూ మనోభావాలను అవమానించారు. ఈ ఘటన స్థానిక భక్తులకే కాకుండా, హిందూ వర్గాలందరికీ తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. చెప్పులను బయట విడిచి రావాలిని భక్తులు తెలిపినా పట్టించుకోకుండా ఆలయంలో తిరగడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: September 2025 Eclipses: సెప్టెంబర్‌లో రెండు గ్రహణాలు.. భారతదేశంలో ఎక్కడ కనపడతాయి?
చెప్పులతో ఆలయ ప్రవేశం.. విశ్వహిందు పరిషత్ ఆగ్రహం
విశ్వహిందు పరిషత్, బీజేపీ జిల్లా నాయకులు, స్థానిక భక్తులు ఈ చర్యను తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆలయంలో అభివృద్ధి పనుల్లో ఈరోజు కొందరు అన్యమతస్తులు పాల్గొన్నారు. చెప్పులు వేసుకుని పనులు చేస్తున్నారు. అయితే అక్కడే వున్న కొందరు స్థానిక భక్తులు వారిని ఎవరు తీసుకువచ్చారని ప్రశ్నించారు. పనుల నిమిత్తం వచ్చామని తెలుపగా.. అది సరే ఆలయంలో వచ్చే ముందు చెప్పులు బయట విడిచి రావాలని తెలియదా? అని ప్రశ్నించారు. భక్తుల అభ్యంతరాలను పట్టించుకోకుండా, పవిత్రమైన దేవాలయంలో చెప్పులతో తిరుగుతూ, స్థానిక సంప్రదాయాలను అవమానించారు. భక్తులు వారిని వెంటనే బయటకు పంపాలని కోరినా, వినలేదు ఈ ఘటన హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీసింది. ఈ సంఘటన పై విశ్వహిందు పరిషత్ అధికారుల, బీజేపీ నేతల సమీక్ష కూడా జరిగింది. దేవాలయ పరిసర ప్రాంతంలో భక్తులందరూ సాంఘిక నియమాలను పాటిస్తూ, భద్రత కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు.
చర్యలు తీసుకోవాలి
రాజన్న సిరిసిల్ల జిల్లా భీమేశ్వర ఆలయంలో చోటుచేసుకున్న ఈ ఘర్షణ, భక్తుల భావోద్వేగాలను అరికట్టలేకపోతోంది. స్థానిక ప్రజలు, భక్తులు, సామాజిక కార్యకర్తలు భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా, దేవాలయాల్లో భక్తుల పవిత్రతకు గౌరవం కల్పించాలని కోరుతున్నారు. భక్తుల ఆవేదన, సమాజం చూపిస్తున్న ఆగ్రహం, దేవాలయ సంరక్షణలో స్థానిక అధికారులు తీసుకుంటున్న చర్యలతో ఈ ఘటన, సిరిసిల్ల జిల్లా రాజన్న ప్రాంతంలో హిందూ సంప్రదాయాలపై ఒక ప్రతికూల దృష్టిని చూపుతుంది.