హైదరాబాద్‌లో యూరియా కొరతపై బీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసనలు చేపట్టారు. యూరియా సమస్యపై పెద్ద ఎత్తున నిరసన గళం విప్పింది బీఆర్ఎస్. అసెంబ్లీ లాబీల్లోనూ దీనిపై చిట్ చాట్ నిర్వహించారు గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు. అసెంబ్లీ వాయిదా అనంతరం గన్ పార్క్ వద్దకు వెళ్లి నిరసన తెలిపారు. యూరియా కావాలంటూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నినాదాలు చేశారు. అక్కడి నుంచి వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం అందించారు. అనంతరం ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ ధర్నాకు దిగారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. ఈ క్రమంలోనే హరీష్ రావు, కేటీఆర్, జగదీష్ రెడ్డితో సహా పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
తెలంగాణలో గత నెల రోజులుగా యూరియా కొరత తీవ్రంగా ఉంది. రైతులు ఎరువుల కోసం లైన్లలో నిలబడి, ఇబ్బందులు పడుతున్నారు. బీఆర్ఎస్ నేతలు ఈ సమస్యకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని బాధ్యులని చేస్తూ విమర్శలు చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ఇలాంటి కొరత ఎప్పుడూ లేదని, ఇప్పుడు కృత్రిమ కొరత సృష్టించారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది.
బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, కేటీఆర్, జగదీష్ రెడ్డి వంటి మాజీ మంత్రులు ఈ సమస్యపై చాలాసార్లు మాట్లాడారు. అంతేకాకుండా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలను కూడా విమర్శించారు.
Also Read: జమ్ము కశ్మీర్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. 11మంది మృతి, పలువురికి గాయలు..
ఈ రోజు ఉదయం గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఖాళీ యూరియా సంచులతో నిరసన చేపట్టారు. కేటీఆర్, హరీష్ రావు, పాడి కౌశిక్ రెడ్డి, సంజయ్, సుధీర్ రెడ్డి, గంగుల, వివేకానంద గౌడ్, దేశపతి శ్రీనివాస్, తక్కల్లపల్లి రవీందర్రావు, తాత మధు, సిరికొండ మధుసూదనాచారి తదితరులు పాల్గొన్నారు.
ఈ నిరసనలో “గణపతి బప్పా మోరియా, కావాలయ్య యూరియా” అంటూ నినాదాలు చేశారు. ఈ నిరసనలో కేటీఆర్ మాట్లాడుతూ “కేసీఆర్ పాలనలో 10 ఏళ్లు యూరియా కొరత లేదు. ఇప్పుడు ఎందుకు వచ్చింది? అని ప్రశ్నించారు.
కేటీఆర్, హారిష్ రావ్, పలవురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అరెస్ట్..
అయితే నిరసన తర్వాత, బీఆర్ఎస్ నేతలు వ్యవసాయ కమిషనర్ కార్యాలయం వద్ద ధర్నా చేయాలని ప్రయత్నించారు. అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అంతేకాకుండా పోలీసులతో వాగ్వాదాలుయ కూడా జరిగాయి. దీంతో కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి వంటి మాజీ మంత్రులు సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన తర్వాత, వారిని తెలంగాణ భవన్‌కు తరలించారు.
మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి అరెస్ట్..
యూరియా కొరతపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆందోళన
పోలీసులతో బీఆర్ఎస్ నేతల వాగ్వాదం
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అరెస్టు చేసిన తెలంగాణ భవన్ కు తరలించిన పోలీసులు pic.twitter.com/OA01vuA9WU
— BIG TV Breaking News (@bigtvtelugu) August 30, 2025