Ramcharan: గత రెండు రోజులుగా మెగా అభిమానులు (Mega Fans)ప్రముఖ నిర్మాత దిల్ రాజు(Dil Raju) అలాగే తన సోదరుడు శిరీష్ రెడ్డి (Shirish Reddy) పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలా మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణం లేకపోలేదు. తమ్ముడు సినిమా(Thammudu) ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా దిల్ రాజు సోదరుడు శిరీష్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొనడంతో ఆయనకు రామ్ చరణ్(Ram Charan) నటించిన గేమ్ ఛేంజర్ (Game Changer)సినిమా గురించి ప్రశ్నలు ఎదురు కావడంతో శిరీష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గేమ్ ఛేంజర్ ఫ్లాప్ అవడంతో చాలా నష్టాలు వచ్చాయని వెంటనే సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ చేయకపోతే చాలా ఇబ్బందులు పడే వాళ్ళమని తెలిపారు.
మెగా ఫాన్స్ దెబ్బకు దిగివచ్చిన శిరీష్..
ఇక్కడి వరకు బానే ఉన్నా గేమ్ ఛేంజర్ రిలీజ్ అయ్యి నష్టాలు వచ్చినప్పటికీ రామ్ చరణ్ మాట వరసకు కూడా ఫోన్ చేయలేదంటూ మాట్లాడటమే అభిమానులను ఆగ్రహానికి గురిచేస్తుంది. రామ్ చరణ్ ను పూర్తిగా వాడుకున్నది మీరు ఇప్పుడు సినిమా ఫ్లాప్ అయితే ఇలా మాట్లాడటం ఏంటి? అంటూ దిల్ రాజు అలాగే ఆయన సోదరుడిపై మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు కురిపించారు. ఇలా తమ గురించి విమర్శలు వస్తున్నా నేపథ్యంలో దిల్ రాజు స్పందించడమే కాకుండా తన తమ్ముడు ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారో కూడా తెలియజేశారు. ఇక ఈ వివాదం ముదురుతున్న నేపథ్యంలో శిరీష్ క్షమాపణలు చెబుతూ ఒక లేఖ విడుదల చేశారు.
పొరపాటున నోరు జారాను.. నా ఉద్దేశ్యం అది కాదు..
ఇలా క్షమాపణలు చెప్పినప్పటికీ మెగా అభిమానుల కోపం మాత్రం తగ్గని నేపథ్యంలో తాజాగా ఆయన మరొక వీడియోని కూడా విడుదల చేశారు. తాను రామ్ చరణ్ ని అవమానకరంగా మాట్లాడే మూర్ఖుడిని కాదు అంటూ తెలిపారు. రామ్ చరణ్ తో అలాగే మెగా కుటుంబంతో మాకు చాలా మంచి సాన్నిహిత్యం ఉంది. నేను ఉద్దేశపూర్వకంగా ఆయనను అవమానపరిచేలా మాట్లాడలేదని క్లారిటీ ఇచ్చారు. పొరపాటున మాట జారాను, అందుకు మెగా అభిమానులు అలాగే మెగా కుటుంబానికి తాను క్షమాపణలు చెబుతున్నాను అంటూ వీడియో విడుదల చేశారు. ఇలా శిరీష్ వీడియో విడుదల చేయడంతో మెగా అభిమానులు కాస్త కూల్ అయ్యారని తెలుస్తుంది.
Dear Fans,
Requesting Everyone To Please
" STOP THE PROTEST "We understand and respect the concerns being raised. However, we kindly urge everyone to Stop the protest.
A Message From Our Hero #RamCharan Garu pic.twitter.com/pEV1oJtWb3
— Team RamCharan (@AlwayzRamCharan) July 2, 2025
ఈ క్రమంలోనే రామ్ చరణ్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఒక విన్నపం చేశారు. ఇక శిరీష్ క్షమాపణలు చెప్పడంతో .. “ప్రియమైన అభిమానులందరికీ చిన్న విన్నపం.. ఇంతటితో ఈ వివాదాన్ని నిలిపివేయండి .. ఇప్పటివరకు లేవనెత్తిన ఆందోళనలను మేము అర్థం చేసుకున్నాము ఇకపై ఈ వివాదాన్ని నిలిపివేయాలని కోరుతున్నాము అంటూ సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ పోస్ట్ చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది. చరణ్ ను కించపరుస్తూ మాట్లాడలేదంటూ క్షమాపణలు చెప్పడంతో అభిమానులు కాస్త కూల్ అయ్యారని తెలుస్తోంది. ఈ వివాదం గురించి రాంచరణ్ ఎక్కడా స్పందించకపోవడం గమనార్హం. ఇక రాంచరణ్ విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన బుచ్చిబాబు డైరెక్షన్ లో పెద్ది సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.
Also Read: యాంకర్‌ను కొట్టిన ప్రియాంక ప్రియుడు శివ్.. అలా అడిగారని.. ఉగ్రరూపం!