OG First Single : ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ లో ఓజి ఒకటి. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఇదివరకే ఈ సినిమా నుంచి విడుదలైన వీడియో కూడా మంచి అంచనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమాకి సుజిత్ దర్శకుడు కావడం విశేషం. స్వతహాగా సుజిత్ కూడా పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని.
హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ ఐ మంచి సక్సెస్ సాధించినప్పుడు చాలామంది పబ్లిక్ తో పాటు సుజిత్ కూడా పవర్ స్టార్ పవర్ స్టార్ అని అరుచుకుంటూ బయటికి వచ్చాడు. అయితే ఈ వీడియో పవన్ కళ్యాణ్ తో సుజిత్ సినిమా చేస్తున్నాడు అన్నప్పుడు బీభత్సమైన వైరల్ అయింది. పవన్ కళ్యాణ్ సినిమాను ఎంజాయ్ చేసినవాడు పవన్ కళ్యాణ్ తో ఎటువంటి సినిమా చేస్తాడు అని అందరికీ ఒక క్యూరియాసిటీ మొదలైంది.
ఫస్ట్ సింగిల్ అప్పుడే
ఓజి సినిమా నుంచి ఇప్పటికీ ఒక వీడియోతో పాటు ఆ బ్యాక్ గ్రౌండ్ సాంగ్ కూడా విడుదలైంది. ఆ సాంగ్ కి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసే ప్లాన్ లో ఉంది చిత్ర యూనిట్. ఈ పాట కూడా ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. బహుశా శింబు పాడిన పాట ఇదే కావచ్చు. అయితే ఈ పాటను ఆగస్టు మొదటి వారంలో రిలీజ్ చేసే ప్లాన్ లో ఉంది చిత్ర యూనిట్. దీని గురించి అతి త్వరలో అధికారక ప్రకటన చేయాల్సి ఉంది. మరోవైపు పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా జులై 24న రిలీజ్ కు సిద్ధంగా ఉంది. సినిమా రిలీజ్ అయిన కొన్ని రోజులకే ఓజి సినిమా నుంచి పాట విడుదల కావడం అనేది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు ఒక రకంగా గుడ్ న్యూస్ అని చెప్పాలి.
హరిహర వీరమల్లు పై అంచనాలు
హరిహర వీరమల్లు సినిమాను అనౌన్స్ చేసినప్పుడే చాలామందికి విపరీతంగా అంచనాలు ఉండేవి. ఆ సినిమాకి సంబంధించిన వీడియో కూడా అప్పట్లో వైరల్ గా మారింది. కొన్ని కారణాల వలన క్రిష్ జాగర్లమూడి ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్న తరుణంలో చాలా వార్తలు వినిపించాయి.. ఆల్మోస్ట్ సినిమా ఆగిపోయింది అని కూడా కొంతమంది మాట్లాడారు. అని నిర్మాత ఏఎం రత్నం తనయుడు జ్యోతి కృష్ణ ఎంట్రీ ఇచ్చి ఈ సినిమాను పూర్తి చేశారు. అయితే జ్యోతి కృష్ణ గురించి కూడా పవన్ కళ్యాణ్ ప్రశంసలు ఇచ్చారు. పలు సందర్భాలలో నిర్మాత రత్నం మాట్లాడుతూ ఈ సినిమాను జ్యోతి వచ్చిన తర్వాత చాలా బాగా డిజైన్ చేశాడు అంటూ చెప్పుకొచ్చారు. అలానే ఈ సినిమా మీద ఎప్పటికప్పుడు తన నమ్మకాన్ని తెలియజేస్తూ వస్తున్నారు నిర్మాత ఏం రత్నం. మరి 24న రాబోయే ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.
Also Read : Pawan Kalyan HHVM : పవన్ మూవీకి బ్యాడ్ సెంటిమెంట్… వీరమల్లుకు దెబ్బ పడటం ఖాయమేనా ?