BigTV English

Pawan Kalyan : ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ వీడియో లీక్… పవన్ కటౌట్ చూస్తే పిచ్చిక్కిపోతుంది మావా..

Pawan Kalyan : ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ వీడియో లీక్… పవన్ కటౌట్ చూస్తే పిచ్చిక్కిపోతుంది మావా..

Pawan Kalyan : టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. డిప్యూటీ సీఎం గా తన బాధ్యతలను ఒక వైపు నెరవేరుస్తూ.. మరోవైపు గతంలో అనౌన్స్ చేసిన సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే రెండు సినిమాలను పూర్తి చేశారు. మూడో సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. టాలీవుడ్ మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లుక్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఫాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ మూవీ షూటింగ్ నుంచి ఓ వీడియో లీక్ అయింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అందులో పవన్ కళ్యాణ్ లుక్ పై నెట్టింట పెద్ద చర్చే జరుగుతుంది. వీడియోలో ఏముందంటే..


‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ వీడియో లీక్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరిష్ శంకర్ కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఇప్పుడు రాబోతున్న సినిమాపై అంతకుమించి అంచనాలు నెలకొన్నాయి. హైదరాబాద్‌లో ఉస్తాద్ షూటింగ్ మొదలైంది. పవన్ కూడా సెట్‌లో అడుగు పెట్టారు.. అల్యూమీనియం ఫ్యాక్టరీలో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరగనుంది. ఈ కు పవన్ 45 రోజుల డేట్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఆగస్ట్‌లోపే టాకీ పార్ట్ పూర్తి కానుంది.. డేట్స్ తక్కువగా ఉన్న నేపథ్యంలో షూటింగ్ త్వరగా పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.. ఇదిలా ఉండగా.. స్టార్ హీరోల సినిమాలకు లీకులు కొత్తేమి కాదు. తాజాగా పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షూటింగ్ వీడియో బయటకు వచ్చింది.. ఆ వీడియోలో పవన్ కళ్యాణ్ యంగ్ లుక్ లో కనిపిస్తున్నాడు. పక్కనే శ్రీలీలా కూడా కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ స్టైల్ గా గ్లాసెస్ పెట్టుకొని స్లిమ్ అండ్ ఫిట్ లుక్ లో కనిపిస్తున్నాడు.. ఈ వయసులో ఇంత హ్యాండ్సమ్ లుక్ లో ఉండడంతో ఫాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. మూవీ మరో లెవెల్ లో ఉంటుందని నెట్టింట కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరికొందరు మాత్రం సినిమా నుంచి ఇలా వీడియోలు లేక అయితే సినిమాపై ఎఫెక్ట్ పడుతుందని హరిష్ శంకర్ ఇలాంటి వాటిపై జాగ్రత్తలు తీసుకోవాలంటూ సలహాలు ఇస్తున్నారు.


Also Read:పవన్‌తో బాలయ్య వార్ ఫిక్స్… కానీ, చిన్న ట్విస్ట్ పెట్టారు

పవన్ కళ్యాణ్ సినిమాలు.. 

పవన్ కళ్యాణ్ ఒకవైపు. రాజకీయాలు మరొకవైపు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నారు. ఎన్నికల సమయంలో అనౌన్స్ చేసిన మూడు సినిమాలను ఈ ఏడాది పూర్తి చేసే పనిలో ఉన్నారు. మొదటగా జ్యోతి కృష్ణ దర్శకత్వంలో వస్తున్న హరిహర వీరమల్లు ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా కోసం ఫాన్స్ వెయిట్ చేస్తున్నారు.. అలాగే ముంబై గ్యాంగ్స్టర్ పాత్రలో నటించిన ఓజీ మూవీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి స్పెషల్. ఈ మూవీ కూడా షూటింగ్ని పూర్తిచేసుకుని సెప్టెంబర్ 25న థియేటర్లలోకి రాబోతుంది. ఇక ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కూడా త్వరలోనే షూటింగ్ పూర్తి చేసుకొని ఈ ఏడాది చివరి కల్లా థియేటర్లలోకి తీసుకురావాలని ఆలోచనలు అటు పవన్ కళ్యాణ్ ఇటు మేకర్స్ ఉన్నట్లు ఇండస్ట్రీలో టాక్.. ఏది ఏమైనా కూడా గత కొన్నేళ్లుగా పవన్ కళ్యాణ్ సినిమాలు రాకపోవడంతో ఫ్యాన్స్ ఈ సినిమాల కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మూడు సినిమాలు పవర్ ఫుల్ స్టోరీలతో రావడంతో పక్కా హిట్ అవుతాయని ఫాన్స్ అభిప్రాయపడుతున్నారు.. చూడాలి మరి ఏ సినిమా ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో..

Related News

2026 summer movies: 2026 సమ్మర్ అంతా భలే సెట్ చేసారు, బట్ చెప్పిన డేట్ కి వస్తారా

Anushka-Allu Arjun: అల్లు అర్జున్ – అనుష్క కాంబోలో మూవీ… రెండు పార్ట్స్, ఇద్దరు డైరెక్టర్స్..!

Balakrishna: అఖండ 2 రిలీజ్ పై బాలయ్య క్లారిటీ.. సోషల్ మీడియాపై మండిపాటు!

OG Movie : రిలీజ్‌కి ముందే ఓజీ విధ్వంసం… పుష్ప 2, కల్కి రికార్డులు బద్దలు

Lavanya – Raj Tarun: శేఖర్ భాషను కలుద్దామని కోరిన లావణ్య.. కట్ చేస్తే.. మరీ ఇంత దారుణమా?

Prabhas: ప్రభాస్‌కి ఏం తెలీదు… డార్లింగ్‌ను తేజ సజ్జా అలా అన్నాడేంటి ?

Big Stories

×