Siraj – Javagal Srinath: లండన్ లోని లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన మూడవ టెస్టులో ఇంగ్లాండ్ జట్టు అద్భుతమైన విజయం సాధించింది. అదే సమయంలో గెలవాల్సిన మ్యాచ్ ని భారత జట్టు చేజేతులా కోల్పోయింది. ఈ మ్యాచ్ లో చివరి వరకు పోరాడిన భారత్.. కేవలం 22 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయింది. ఈ విజయంతో 2 – 1 తేడాతో ముందంజలోకి వెళ్ళింది ఇంగ్లాండ్.
Also Read: Team India: ఏంట్రా ధోని, కోహ్లీ, రోహిత్ శర్మ.. మహిళల అవతారం ఎత్తారు ఏంటి
ఇక ఇరుజట్ల మధ్య మరో రెండు టెస్ట్ మ్యాచ్ లు మిగిలి ఉన్నాయి. మూడవ టెస్ట్ మ్యాచ్ ప్రారంభం నుండి నువ్వా – నేనా అన్నట్లు సాగింది. ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధంతో ఒక్కసారిగా మ్యాచ్ పై తీవ్ర ఆసక్తి నెలకొంది. భావోద్వేగాలను అదుపు చేసుకోలేకపోయిన ఆటగాళ్లు.. ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకున్నారు. నాలుగవ రోజు ఇంగ్లాండ్ జట్టు రెండవ ఇన్నింగ్స్ లో 192 పరుగులకు ఆల్ అవుట్ అయ్యింది.
దీంతో భారత్ ఈ మ్యాచ్ లో గెలుపొందాలంటే 193 పరుగులు చేయాల్సి వచ్చింది. ఇక ఐదవ రోజు చివరి సెషన్ లో 170 పరుగులకు టీమిండియా ఆల్ అవుట్ అయింది. చివరివరకు గెలుపు కోసం పోరాడిన భారత్.. 22 పరుగుల దూరంలో ఆగిపోయింది. ఓవైపు వికెట్లు పడుతున్నా.. మరోవైపు టీమ్ ఇండియా విజయం కోసం ఆల్రౌండర్ రవీంద్ర జడేజా చివరి వరకు పోరాడాడు. జడేజా 61 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. కానీ అతనికి తోడుగా మిగతా ప్లేయర్ల నుండి మద్దతు లభించలేదు. చివర్లో రవీంద్ర జడేజాకి నితీష్ కుమార్ రెడ్డి, బుమ్రా సహకారం అందించారు. కానీ ఇంగ్లాండ్ బౌలర్లు పట్టు వదల్లేదు.
నిరాశకు గురైన సిరాజ్:
ఇక భారత జట్టు మరో 22 పరుగులు చేస్తే విజయం సాధిస్తుందనే సమయంలో.. మహమ్మద్ సిరాజ్ 30 బంతుల్లో నాలుగు పరుగులు చేసి షోయబ్ బషీర్ చేతిలో పెవిలియన్ చేరాడు. దీంతో భారత జట్టు ఓటమిపాలైంది. అయితే మహమ్మద్ సిరాజ్ బంతిని డిఫెన్స్ చేసినా.. ఆశించిన ఫలితం రాలేదు. బంతి నెమ్మదిగా వికెట్లను తాకి బెయిల్స్ ని కింద పడేసింది. దీంతో సిరాజ్ అవుట్ అయ్యాడు. ఈ క్రమంలో కోట్లాదిమంది భారతీయులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అటు మొహమ్మద్ సిరాజ్ కూడా గ్రౌండ్ లోనే ఏడ్చాడు. అయితే ఇంగ్లాండ్ స్పిన్నర్ వేసిన బంతి సిరాజ్ ఊహించిన దాని కంటే ఎక్కువ బౌన్స్ అయిందని నిపుణులు చెబుతున్నారు. ఇక సిరాజ్ గ్రౌండ్ లో తీవ్రంగా బాధపడుతున్న సమయంలో.. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జో రూట్ అతడి దగ్గరకు వచ్చి కౌగిలించుకొని ఓదార్చాడు.
1999 హిస్టరీ రిపీట్:
అయితే ఈ మూడవ టెస్టులో మొహమ్మద్ సిరాజ్ అవుట్ అయిన తీరు.. గతంలో భారత జట్టుకు ఎదురైన ఘటనలను గుర్తుచేస్తోంది. ముఖ్యంగా 1999లో ఈడెన్ గార్డెన్స్ లో భారత్ – పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన టెస్ట్ లో జవాగల్ శ్రీనాథ్ అవుట్ అయినా సందర్భం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అప్పుడు కూడా స్పిన్నర్ సైక్లైన్ ముస్తాక్ వేసిన బంతికి శ్రీనాథ్ బౌల్డ్ కావడంతో భారత జట్టు 12 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ రెండు ఘటనల్లోనూ భారత అభిమానుల హృదయాలు నిరాశకు గురయ్యాయి. ఇక ఈ ఐదు టెస్టుల సెరీస్ లో భారత్.. ఈ సిరీస్ ని గెలుచుకోవాలంటే మిగిలిన రెండు టెస్టులలో కూడా గెలవాల్సి ఉంది. నాలుగోవ టెస్టు మ్యాచ్ జూలై 23న మాంచెస్టర్ లో ప్రారంభం కానుంది.
This last wicket of siraj reminded me of this dismissal of javagal srinath against Saqlain Mushtaq in 1999 chennai test pic.twitter.com/WPA5r0tgSr
— KohliSensual (@Kohlisensual05) July 14, 2025