Nidhi Agarwal Car Issue : తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో ఉన్న హీరోయిన్స్ లో నిధి అగర్వాల్ ఒకరు. సవ్యసాచి సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది నిధి. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఊహించని సక్సెస్ సాధించలేదు. ఆ తర్వాత చేసిన మిస్టర్ మజ్ను సినిమా కూడా అంతంత మాత్రమే ఆడింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమా తర్వాత వరుసగా అవకాశాలు వచ్చాయి.
రీసెంట్గా నిధి అగర్వాల్ నటించిన హరిహర వీరమల్లు సినిమా ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఈ సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేదు. పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఈ సినిమా వలన పూర్తిగా నిరాశ చెందారు. ఒకవైపు పవన్ కళ్యాణ్ తోనూ మరోవైపు ప్రభాస్ తోను సినిమాలు చేస్తుంది నిధి. ఇక భీమవరంలో జరిగిన ఒక ఈవెంట్ కు ప్రభుత్వ వాహనంలో ప్రయాణం చేసినట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి. దానిపైన నిధి కూడా క్లారిటీ ఇచ్చింది.
పవన్ కుమార్ రియాక్షన్
భీమవరంలో జరిగిన ఈవెంట్ కు ప్రభుత్వవాహనంలో ప్రయాణించడం వెనుక తన ప్రమేయం ఏమీలేదని నిధి అగర్వాల్ తెలిపింది. తాజాగా ఆ ఈవెంట్ కోఆర్డినేటర్ పవన్ కుమార్ దీనిపై స్పందించాడు. “విజయవాడలో ఇర్ఫాన్ అనే వ్యక్తితో కారు అరేంజ్ చేయించాము. కారు బ్రేక్ డౌన్ కావడంతో నాగరాజు అనే వ్యక్తికి చెందిన ట్రావెల్స్ కారును ఉపయోగించాము. అయితే అది గవర్నమెంట్ కు పనిచేస్తుందని తెలియదు. ఈవిషయాన్ని రాజకీయం చేయెద్దు” అని వెల్లడించాడు.
నిధి అగర్వాల్ క్లారిటీ
ఇటీవల భీమవరంలో జరిగిన ఒక స్టోర్ లాంచ్ ఈవెంట్ కోసం నేను వచ్చినందుకు సోషల్ మీడియాలో వ్యాపించిన కొన్ని ఊహాగానాలను పరిష్కరించడానికి మరియు స్పష్టం చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. ఈ కార్యక్రమంలో, స్థానిక నిర్వాహకులు నాకు రవాణా సౌకర్యం ఏర్పాటు చేశారు, అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన వాహనం. ఈ వాహనాన్ని ఎంచుకోవడంలో లేదా అభ్యర్థించడంలో నాకు ఎటువంటి పాత్ర లేదని నేను స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను – దీనిని లాజిస్టికల్ ప్రయోజనాల కోసం మాత్రమే ఈవెంట్ నిర్వాహకులు అందించారు.
కొన్ని ఆన్‌లైన్ నివేదికలు మరియు పోస్ట్‌లు ఈ వాహనాన్ని ప్రభుత్వ అధికారులు నాకు పంపారని తప్పుగా సూచిస్తున్నాయి. ఈ వాదనలు పూర్తిగా నిరాధారమైనవని నేను పూర్తిగా స్పష్టం చేయాలనుకుంటున్నాను. ఈ సందర్భంలో నాకు అలాంటి సంబంధం లేదు మరియు వాహనం వాడకానికి ఏ ప్రభుత్వ అధికారులతో సంబంధం లేదు. నిధి క్లారిటీ ఇచ్చింది.
Also Read: Akkineni Nagarjuna : కూలీ సినిమా 100 బాషా లతో సమానం