DSC Results: ఏపీ డీఎస్సీ ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 16,437 టీచర్ పోస్టులకు గానూ ఏపీ ప్రభుత్వం పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఫలితాలను అధికారిక వెబ్ సైట్ లో పొందుపరిచారు. వెబ్ సైట్‌కి వెళ్లి ఫలితాలు చూసుకోవచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్ ఇదే..
అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలను క్షుణ్ణంగా పరిశీలించామని మెగా డీఎస్సీ కన్వీనర్ కృష్ణారెడ్డి తెలిపారు. సవరించిన తుది కీ ఆధారంగా నార్మలైజేషన్ ప్రక్రియ ద్వారా రూపొందించిన డీఎస్సీ తుది ఫలితాలను విడుదల చేశామని ఆయన అన్నారు . డీఎస్సీ ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్ ద్వారా తుది ఫలితాలు తెలుసుకోవచ్చని తెలిపారు. స్కోర్ కార్డులను పొందొచ్చని వివరించారు. టెట్ వివరాలకు సంబంధించి ఏమైనా సందేహాలు ఉన్నట్టయితే.. అఫీషియల్ వెబ్‌సైట్‌లో హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేయడం ద్వారా తమకు తామే టెట్ వివరాలు సరిచేసుకోవడానికి అవకాశం ఇచ్చామని అన్నారు.. ఈ అవకాశం రెండు రోజులు (ఆగస్టు 13 వరకు) మాత్రమే అందుబాటులో ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
ఏపీ ప్రభుత్వం 16,347 టీచర్ పోస్టుల భర్తీకి నియామకానికి మెగా డీఎస్సీ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్ భారీ దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 3,36,307 మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. ఈ ఏడాది జూన్ 6 నుంచి జులై 2 వరకు 23 రోజుల పాటు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల్లోనూ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసి రెండు సెషన్లలో ఈ పరీక్షలను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేశారు. మెగా డీఎస్సీ పరీక్షలకు మొత్తం 92.90 శాతం మంది అటెండ్ అయ్యారు.
ఫలితాలను ఇలా తెలుసుకోండి..
అభ్యర్థులు ముందుగా క్యాండిడేట్ లాగిన్ అవ్వండి. అక్కడ హాల్‌టికెట్ నంబర్, పాస్‌వర్డ్ వివరాలను అడుగుతోంది. ఆ వివరాలను ఎంటర్ చేస్తే.. ‘సర్వీసెస్’ అని డిస్ ప్లే అవుతోంది. అక్కడ ఏపీ డీఎస్సీ ఫలితాలను సెలక్ట్ చేసుకుంటే స్కోరు కార్డు కనిపిస్తోంది. అందులో అభ్యర్థులు రాసిన మొత్తం పేపర్లు, సాధించిన మార్కులు, టెట్ మార్కులు ఉంటతాయి. క్వాలిఫైడ్/నాన్ క్వాలిఫైడ్ అనే వివరాలను కూడా క్లియర్ కట్ గా పొందుపరిచారు.
ALSO READ: Tenth Exams: టెన్త్ పరీక్షలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక ఆ పద్ధతిలోనే..?
ALSO READ: Deputy Manager Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు.. లక్షల్లో వేతనాలు, అర్హతలు ఇవే