Tenth Exams: తెలంగాణలో టెన్త్ పరీక్షల విధానంపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ పాత విధానంలోనే కొనసాగించాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. పరీక్షలో 20 శాతం ఇంటర్నల్ మార్కులు కొనసాగించాలని నిర్ణయించింది. ఫైనల్ ఎగ్జామ్‌లో 80 శాతం మార్కులు, ఇంటర్నల్ లో 20 శాతం మార్కుల విధానం కొనసాగించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
అయితే.. గతంలో ఇంటర్నర్ ఎగ్జామ్స్ తీసివేయాలని ప్రభుత్వం భావించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఈ ఏడాది కూడా ఇంటర్నల్స్ ఎగ్జామ్స్ ఉంటాయని స్పష్టం చేసింది. టెన్త్ క్లాస్ ఫైనల్ ఎగ్జామ్ కు సంబంధించి కొన్ని రోజుల క్రితం నిర్వహణ విధారం మార్పులు చేర్పులు చేయాలని ప్రభుత్వం భావించింది. అయతే.. ప్రభుత్వం దీనిపై మరో పునరాలోచన చేసింది.
ALSO READ: Heavy rain: హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఈ జిల్లాల్లో కుండపోత వాన
20 శాతం ఇంటర్నల్ మార్కులు అలానే ఉంటాయని.. పాత విధానాన్నే కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. గతంలోనూ ఇదే విధానం ఉన్న విషయం తెలిసిందే. ఇందులోనే మార్పులు చేయాలని ముందుగా భావించింది. తాజాగా ఓల్డ్ విధానాన్నే కొనసాగించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే ముందుగానే తెలియజేస్తే మంచిదనే అభిప్రాయాన్ని విద్యాశాఖ వ్యక్తం చేసింది. అందుకే ఎగ్జామ్ విధానంపై ఓ క్లారిటీని ఇచ్చింది.
ALSO READ: Bus accident: ఘోర ప్రమాదం.. బస్టాండ్‌లోకి దూసుకొచ్చిన బస్సు.. స్పాట్‌లోనే..?