Payal Rajput: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పేరు సొంతం చేసుకున్న పాయల్ రాజ్ పుత్ (Payal Rajput) ఇంట ఇప్పుడు తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆమె తండ్రి కన్నుమూశారు. ఈ విషయాన్ని పాయల్ స్వయంగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఆలస్యంగా అభిమానులతో పంచుకుంది. గత కొంతకాలంగా క్యాన్సర్ తో పోరాడుతున్న ఆయన 67 సంవత్సరాల వయసులో జూలై 28న మరణించారు. తన తండ్రి అన్నవాహిక క్యాన్సర్ బారిన పడ్డారు అని, ఇదే ఏడాదిలో ఆమె అభిమానులతో పంచుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తన తండ్రి మరణించడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతున్నారు.
పాయల్ తండ్రి మృతి..
ఇక తన తండ్రి ఆరోగ్యంగా తిరిగి రావడానికి.. తన తండ్రిని కాపాడుకోవడానికి తాను చేయాల్సినవన్ని చేశానని, కానీ తన నాన్నను కాపాడే పోరాటంలో విజయం సాధించలేకపోయాను అంటూ పాయల్ ఒక ఎమోషనల్ పోస్ట్ పంచుకుంది. ఇక పాయల్ రాజ్ పుత్ ఈ విషాద సంఘటన నుంచి త్వరగా కోలుకోవాలని, అటు అభిమానులు ఇటు నెటిజన్స్ మెసేజ్లు పెడుతున్నారు. అంతేకాదు ప్రముఖ నిర్మాత ఎస్కేయన్ , హీరోయిన్ లక్ష్మీరాయ్ వంటి వారు కూడా సానుభూతి తెలుపుతూ పోస్ట్ పెడుతూ ఉండడం గమనార్హం. మొత్తానికైతే పాయల్ రాజ్ పుత్ తన తండ్రిని కోల్పోవడంపై అభిమానులు సైతం కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇక పాయల్ రాజ్ పుత్ తండ్రి విషయానికి వస్తే.. 1957 మే 10న జన్మించారు. ఆయన పేరు విమల్ కుమార్ రాజ్ పుత్.
పాయల్ రాజ్ పుత్ సినిమాలు..
పాయల్ రాజ్ పుత్ విషయానికి వస్తే.. అజయ్ భూపతి దర్శకత్వంలో ‘ ఆర్ఎక్స్ 100’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. మొదటి సినిమాతోనే ప్రేక్షకులను అలరించిన ఈమె.. ఆ తర్వాత పలు చిత్రాలలో చేసింది. ఇక ‘మంగళవారం’ చిత్రంతో మరొకసారి అభిమానులను సైతం భయపెట్టేసింది అని చెప్పవచ్చు. ఈ చిత్రానికి కూడా అజయ్ భూపతి (Ajay Bhupathi) దర్శకత్వం వహించడం గమనార్హం. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న పాయల్ అటు సోషల్ మీడియాలో కూడా నిత్యం యాక్టివ్ గా ఉంటూ వరుస గ్లామర్ ఫోటోలతో అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.
పాయల్ తండ్రి మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నసెలబ్రిటీలు ..
ఎప్పుడు తన అందంతో అభిమానులను ఆకట్టుకునే ఈమె.. ఇప్పుడు సడన్గా విషాదంలో మునిగిపోవడంతో అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. త్వరగా ఈ బాధ నుండి బయటపడాలి అంటూ సపోర్ట్ చేస్తున్నారు.అటు పలువురు సెలబ్రిటీలు కూడా పాయల్ తండ్రి మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
ALSO READ:Film industry: ఇండస్ట్రీలో మరో విషాదం.. బీచ్ లో కుప్పకూలి నటుడు మృతి!