E-Paper
Advertisement

కూతురు కోసం హంతకుడిని నిర్దోషిగా… ఓటీటీని దద్దరిల్లేలా చేసిన కోర్ట్‌రూమ్ థ్రిల్లర్ తెలుగులో

కూతురు కోసం హంతకుడిని నిర్దోషిగా… ఓటీటీని దద్దరిల్లేలా చేసిన కోర్ట్‌రూమ్ థ్రిల్లర్ తెలుగులో
Advertisement

Courtroom Drama on OTT: కోర్టులో న్యాయం కోసం పోరాడే ఓ నిజాయితీ గల లాయర్… తాను అసహ్యించుకునే ఓ క్రూరమైన హంతకుడినే నిర్దోషిగా బయటకు తీసుకురావాల్సిన పరిస్థితి వస్తే ? అందులోనూ ఆ పని చేయకపోతే తన కూతురి ప్రాణాలకే ప్రమాదం ఉంటే? న్యాయం, వృత్తి ధర్మం, కుటుంబం మధ్య జరిగే ఈ సంఘర్షణ చుట్టూ తెరకెక్కిన లీగల్ క్రైమ్ థ్రిల్లర్ ‘ఇక్కా’ (Ikka). సన్నీ డియోల్, అక్షయ్ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో తెలుగులోనే స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ మూవీని ఎక్కడ చూడవచ్చు ? స్టోరీ ఏంటి ? అనే విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

అర్జున్ మెహ్రా కోర్టులో అపజయం ఎరుగని ప్రముఖ డిఫెన్స్ లాయర్. చట్టం విషయంలో ఎలాంటి రాజీకి వెళ్లకుండా, నిజాయితీగా కేసులను వాదిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటాడు. డబ్బు కోసం నేరస్థులను కాపాడే లాయర్లలా కాకుండా నిజాయితీగా ఉంటాడు. అందుకే కోర్టులో అతడి వాదనలకు ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది.

Advertisement

అలాంటి అర్జున్ దగ్గరకు శౌర్యమాన్ గౌర్ కేసు వస్తుంది. ఓ యువతిని దారుణంగా హత్య చేసిన ఆరోపణలు శౌర్యమాన్‌పై ఉంటాయి. అతడు పలుకుబడి, డబ్బు ఉన్న వ్యక్తి కావడంతో కేసు మొదటి నుంచే సంచలనంగా మారుతుంది. నిందితుడి గురించి తెలిసిన అర్జున్ మాత్రం అతడి తరఫున వాదించడానికి అస్సలు ఇష్టపడడు. తప్పు చేసిన వ్యక్తిని చట్టంలోని లొసుగులను ఉపయోగించి బయటకు తీసుకురావడం తన సిద్ధాంతాలకు విరుద్ధమని భావిస్తాడు.

కానీ శౌర్యమాన్ కుటుంబం అర్జున్ బలహీనతను గుర్తిస్తుంది. అతడి కూతురిని టార్గెట్ చేసి, ఆమెను చంపేస్తామని బెదిరిస్తారు. శౌర్యమాన్‌ను కోర్టులో ఎలాగైనా నిర్దోషిగా బయటకు తీసుకురావాలని షరతు పెడతారు. తన కూతురి ప్రాణాలను కాపాడుకోవడం కోసం అర్జున్ చివరకు తాను అసహ్యించుకునే వ్యక్తి తరఫునే కోర్టులో వాదించాల్సి వస్తుంది.

Advertisement

ఇక్కడి నుంచి కథ మరింత ఆసక్తికరంగా మారుతుంది. నిందితుడి తరఫున వాదిస్తున్నప్పటికీ అర్జున్ మనసులో మాత్రం తన కూతురిని కాపాడుకోవాలనే ఆలోచనే ఉంటుంది. కోర్టులో ప్రత్యర్థి వాదనలను ఎలా ఎదుర్కోవాలి? సాక్ష్యాలను ఎలా ప్రశ్నించాలి? చట్టంలోని లొసుగులను ఎలా ఉపయోగించాలి? అనే విషయంలో అతడు తన అనుభవాన్ని మొత్తం ఉపయోగిస్తాడు.

అయితే శౌర్యమాన్‌ను కాపాడే క్రమంలో అర్జున్ నిజంగా తన వృత్తి ధర్మాన్ని పూర్తిగా పక్కన పెట్టేశాడా? లేక కోర్టులో జరుగుతున్న మొత్తం వ్యవహారానికి వెనుక మరో ప్లాన్ ఉందా? తన కూతురిని ప్రమాదంలోకి నెట్టిన వ్యక్తుల అసలు ఉద్దేశం ఏమిటి? చివరికి అర్జున్ తన కూతురిని కాపాడుకుంటూనే న్యాయాన్ని ఎలా నిలబెట్టాడు? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

ఎందుకు చూడాలి?

‘ఇక్కా’కు ప్రధాన ఆకర్షణ సన్నీ డియోల్, అక్షయ్ ఖన్నాల మధ్య జరిగే మైండ్ గేమ్. సన్నీ డియోల్ పవర్‌ఫుల్ లాయర్ పాత్రలో గంభీరమైన నటనతో ఆకట్టుకున్నారు. కోర్ట్‌రూమ్ సన్నివేశాల్లో ఆయన డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ ఆకట్టుకుంటాయి. మరోవైపు అక్షయ్ ఖన్నా శౌర్యమాన్‌గా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించారు. డబ్బు, పలుకుబడితో చట్టాన్ని కూడా తనకు అనుకూలంగా మార్చుకోవచ్చని భావించే వ్యక్తిగా ఆయన నటన కథలో టెన్షన్ పెంచుతుంది. ఈ ఇద్దరి మధ్య జరిగే వాదనలు ఆసక్తికరంగా ఉంటాయి. ముఖ్యంగా ఒక తండ్రి తన కూతురి కోసం ఎంతటి నైతిక సంఘర్షణను ఎదుర్కోవాల్సి వస్తుందనే అంశం ప్రేక్షకులను కథతో కనెక్ట్ చేస్తుంది. ‘ఇక్కా’ ప్రస్తుతం Netflixలో ఒరిజినల్ హిందీతో పాటు తెలుగు ఆడియోలోనూ అందుబాటులో ఉంది. చివరికి తన కూతురిని కాపాడుకోవడానికి అర్జున్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? న్యాయాన్ని గెలిపించాడా.. లేక పరిస్థితులకు తలొగ్గాడా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ‘ఇక్కా’ను ఓటీటీలో చూడాల్సిందే.

Read Also: తరతరాలుగా వెంటాడే శాపం… ఆ ఇంటి తలుపు తెరిచిన క్షణం నుంచే అసలు హారర్

Tags

Related News

6 కోట్ల బడ్జెట్‌తో తీస్తే 19 కోట్లు కొల్లగొట్టింది.. ఇప్పుడు ఓటీటీలోకి ఈ హారర్ కామెడీ

ఫస్ట్ నైట్‌ రోజే ఊహించని ట్విస్ట్… భార్యను తాకితే కరెంట్ షాక్ కొట్టే వింత ప్రేమకథ

అప్పు తీర్చేందుకు శవాన్ని కిడ్నాప్ చేశారు… కట్ చేస్తే మెంటల్ మాస్ ట్విస్ట్

16 వేల అడుగుల ఎత్తులో అసాధ్యమైన మిషన్… ప్రాణాలను పణంగా పెట్టిన భారత వాయుసేన వీరుల కథ

అమ్మాయి ఆత్మహత్య వెనుక అంతర్జాతీయ కుట్ర… తెలుగులోనే ఉంది ఈ పాపులర్ క్రైమ్ థ్రిల్లర్

తవ్వకాల్లో దొరికిన అస్థిపంజరాలు… తెలుగులోనే స్ట్రీమింగ్ అవుతున్న తమిళ మిస్టరీ థ్రిల్లర్

భర్త మీద అలిగి నదికిపోతే… 15 నిమిషాలే… కానీ గుండెల్లో దడ పుట్టించే హారర్ షార్ట్ ఫిల్మ్

Big Stories

Advertisement
×