Lionel Messi’s father Jorge passes away: అర్జెంటీనా ఫుట్ బాల్ స్టార్ లియోనెల్ మెస్సి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. లియోనెల్ మెస్సి తండ్రి జార్జ్ ( Jorge) మృతి చెందారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో మెస్సి తండ్రి జార్జ్ బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్యం విషమించింది. దీంతో ఆసుపత్రిలోనే కాసేపటికి తుది శ్వాస విడిచారు మెస్సి తండ్రి జార్జ్. ఈ విషయాన్ని స్వయంగా మెస్సి ( Lionel Messi) టీమ్ మేట్ నికో పాజ్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. దీంతో లియోనల్ మెస్సి అభిమానులు ఎమోషనల్ అవుతున్నారు. ఏడాది మెస్సికి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయని ఎమోషనల్ అవుతున్నారు. అలాగే మెస్సి తండ్రి జార్జ్ ఆత్మకు శాంతి చేకూరాలని పోస్టులు పెడుతున్నారు అభిమానులు.
ఫిఫా వరల్డ్ కప్ 2026 లో అర్జెంటిన ఫుట్ బాల్ స్టార్ లియోనెల్ మెస్సి హత్యకు కుట్ర జరిగినట్లు ఓ నివేదిక బయటకు వచ్చింది. లియోనెల్ మెస్సి, అర్జెంటీనా జట్టు లక్ష్యంగా బాంబు బెదిరింపులు, ఆటగాళ్లను వెంబడించడం, ఆన్లైన్ వేధింపులు లాంటి సంఘటనలు కూడా జరిగినట్లు స్పెయిన్ కు సంబంధించిన ఓ పత్రిక షాకింగ్ నిజాన్ని బయటపెట్టింది. లియోనెల్ మెస్సిని లక్ష్యంగా చేసుకొని ఓ వ్యక్తి చంపేస్తానని కూడా వార్నింగ్ ఇచ్చాడని ఈ నివేదికలో వెల్లడించింది. ఈ సంఘటనకు సంబంధించిన న్యూస్ ఉదయం నుంచి సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇంతలోనే లియోనెల్ మెస్సి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి జార్జ్ కాసేపటి క్రితమే అనారోగ్యంతో రోసారియోలో మృతి చెందారు.
Ishant Sharma On MS Dhoni : ధోని మాములోడు కాదు భయ్యా…కోహ్లీని, నన్ను బండబూతులు తిట్టాడు
లియోనెల్ మెస్సి విజయం వెనక ఆయన తండ్రి జార్జ్ ఉన్న మాట వాస్తవమే. తన కొడుకు మెస్సి అత్యున్నత స్థానానికి చేరుకునేందుకు… తన వంతు అన్ని పనులు చేశారు. అందరి తండ్రుల లాగా కాకుండా.. కొడుకును ఉన్నత స్థాయికి తీసుకువెళ్లేందుకు, రేయింబవళ్లు పనిచేశారు. మెస్సి చిన్నతనంలో గ్రోత్ హార్మోన్ లోపం అనే తీవ్రమైన ఆరోగ్య సమస్యతో బాధపడ్డారు. ఈ క్రమంలో అర్జెంటీనాలోని స్థానిక క్లబ్బులు ఈ ఖరీదైన వైద్య ఖర్చులను భరించడానికి నిరాకరించాయి. అయినప్పటికీ ఆయన తండ్రి జార్జ్ వెనకడుగు వేయలేదు. తన పదమూడేళ్ల కొడుకు మెస్సిని అర్జెంటీనా నుంచి స్పెయిన్ వలస తీసుకువెళ్లాడు. అక్కడ ఎఫ్సీ బార్సిలోనా క్లబ్ తో ఒప్పందం కుదుర్చుకొని… మెస్సి వైద్య ఖర్చులను ఆ క్లబ్ భరించేలా కృషి చేశాడు. ఇలా కీలక సమయంలో జార్జ్ తీసుకున్న నిర్ణయం… మెస్సిని ఈ రేంజ్ కు తీసుకువెళ్లింది. ఇక తాజాగా తన తండ్రి జార్జ్ మృతి నేపథ్యంలో మెస్సి కన్నీరు మున్నీరు అవుతున్నారు.