E-Paper
Advertisement

ఘట్టమనేని వారసుడి సినిమాకు ఎందుకిలా జరిగింది? అజయ్ భూపతి కామెంట్స్ వైరల్

ఘట్టమనేని వారసుడి సినిమాకు ఎందుకిలా జరిగింది? అజయ్ భూపతి కామెంట్స్ వైరల్
Advertisement

Srinivasa Mangapuram Failure:అసలే ఘట్టమనేని వారసుడు.. ఆపై సూపర్ స్టార్ మహేష్ బాబు అన్న కొడుకు. అలాంటి హీరో కొడుకు టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంటర్ ఇస్తున్నాడు అంటే ఎలా ఉండాలి? బాక్సాఫీస్ బద్దలవ్వాలి. కానీ అదేమీ జరగలేదు. సూపర్ హిట్ అవడం అటుంచి.. కనీసం మొదటి రోజు మినిమం వసూళ్లని కూడా రాబట్టలేకపోయింది ‘శ్రీనివాస మంగాపురం’.

దీంతో ఈ సినిమా రిజల్ట్ కాస్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది.

Advertisement

సోషల్ మీడియాలో ఇబ్బడిముబ్బడిగా రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. మహేష్ బాబు పట్టించుకోలేదని, అజయ్ భూపతి అంతా చేశాడని, జయకృష్ణ ఇంకా సరిగ్గా చేయాల్సి ఉందని, ప్రొడక్షన్ వాల్యూస్ ఇంకా పెంచాలని.. ఇలా సినిమాపై రకరకాల రూమర్స్ తెగ సర్క్యులేట్ అవుతున్నాయి.

సినిమా ఫలితం బాధ్యత నాదే: అజయ్ భూపతి

అయితే ఈ సినిమా ఫలితంపై ఎవరిదీ కాదు.. బాధ్యత నాదే అంటూ ఓపెన్‌గా చెప్పేశాడు డైరెక్టర్ అజయ్ భూపతి.

Advertisement

ఈ సినిమా తనకు ఎంతో ప్రత్యేకమైనదని.. ఇక ఈ సినిమా వల్లే ఎన్నో అనుభూతులు, జ్ఞాపకాలు తనకు దక్కాయని చెప్పుకొచ్చాడు. అంతే కాదు.. సినిమాలో నటించిన జయకృష్ణ, రాశా అసలు కొత్తవాళ్లలా తనకి ఎప్పుడూ అనిపించలేదని, వాళ్లు వాళ్ల బెస్ట్ ఇచ్చారని ఆకాశానికి ఎత్తేశాడు.

సినిమా రిజల్ట్ పోయిందని.. దానికి బాధ్యత నాదే అని నెత్తిమీద వేసుకున్నాడు.

ఫలితం ఎలా ఉన్నా.. అజయ్ భూపతి కాన్ఫిడెన్స్ మాత్రం తగ్గలేదే!

మొత్తానికి సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన ఈ ఫలితంతో అజయ్ భూపతి మాత్రం అసలు డిసప్పాయింట్ అయినట్టు కనిపించట్లేదు. మళ్లీ త్వరలోనే మంచి సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తానని కాన్ఫిడెన్స్ చూపించడంలోనే అది కనిపిస్తుంది కూడా.

మొత్తానికి సినిమా ఫలితం ఎవరికి ప్లస్, ఎవరికి మైనస్ అన్న విషయం పక్కన పెడితే.. సినిమా అపజయాన్ని తన మీద వేసుకున్న అజయ్ భూపతి కామెంట్స్ మాత్రం ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి.

మరి ఈ సినిమా తర్వాత జయకృష్ణ ఎలాంటి కథతో వస్తాడో, అజయ్ భూపతి తర్వాత సినిమాతో ఇంకెంత స్ట్రాంగ్‌గా కమ్‌బ్యాక్ ఇస్తాడో చూడాలి.

మహేష్ బాబు ఫోకస్ పెట్టలేదా?

అయితే ఇండస్ట్రీలో వినిపిస్తున్న మరో టాక్ ఏంటంటే.. మహేష్ బాబు ఈ సినిమాపై అనుకున్నంత ఫోకస్ పెట్టలేదని, తమ కుటుంబం నుంచి ఒక వారసుడు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నాడు అంటే చేయాల్సినంత గ్రాండ్ లాంచింగ్ చేయలేదని, ఇదే సినిమాకి ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టి మహేష్ బాబు లాంచ్ చేసి ఉంటే మొదటిరోజు బాక్సాఫీస్ వసూళ్లు మరోలా ఉండేవని ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్.

గౌతమ్ విషయంలోనూ ఇలాగే చేస్తారా?

మరి నిజంగానే మహేష్ బాబు తన సొంత అబ్బాయి గౌతమ్ విషయంలోనూ ఇలాగే చూసి చూడనట్టు పోతాడా? ఏమో.. ముందు ముందు వచ్చే రోజుల్లోనే దీనిపై క్లారిటీ రావాలి!

Also read :విజయ్‌కు త్రిష.. మరో లక్ష్మీ పార్వతి అవుతుందా? తమిళనాట హాట్ టాపిక్!

Tags

Related News

విభిన్న గెటప్స్ లో శర్వానంద్.. ‘జార్జ్ క్రిష్’ నుండి ఫస్ట్ బూస్టర్ రిలీజ్!

ది ప్యారడైజ్ దెబ్బ.. టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ లో ఇప్పుడైనా మార్పు వస్తుందా?

మా ఇంటి వాచ్‌మెన్ ఫోన్‌లో నా ఇంటిమేట్ సీన్స్.. నరకం చూశా – రాధిక ఆప్టే

డింపుల్ హయతి నెలకు అంత సంపాదిస్తుందా..? సినిమాల కన్నా ఎక్కువే..

ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత..

అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. ఇది అస్సలు ఊహించలేదు మావా..

నాని కెరీర్‌లోనే బిగ్ రిలీజ్.. ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ లెక్కలు ఇవే!

అబ్బబ్బా.. ఖుషీ కపూర్ ఏంటి ఈ లుక్! ఫ్యాన్స్‌కి ఫుల్ ట్రీట్

Big Stories

Advertisement
×