E-Paper
Advertisement

వర్షం పడుతుంటే ఏదైనా వేడిగా తినాలనిపిస్తుందా?.. ఈ స్నాక్స్ ట్రై చేయండి!

వర్షం పడుతుంటే ఏదైనా వేడిగా తినాలనిపిస్తుందా?.. ఈ స్నాక్స్ ట్రై చేయండి!
Advertisement

Healthy Monsoon Snacks:మామూలు రోజుల్లోనే వేడి వేడి స్నాక్స్ ఎప్పుడెప్పుడు ఆరగించాలా అంటూ నోరు లాగడం చాలా సహజం.అలాంటిది వర్షాకాలం వచ్చిందంటే ఇక వేడివేడి స్నాక్స్ ఎప్పుడు చేసుకుందామా.. ఎప్పుడు తిందామా.. అంటూ మనసు ఆరాట పడిపోతుంది.అయితే ప్రతిసారి పకోడీలు, బజ్జీలు, సమోసాలు అంటూ బాగా వేయించిన స్నాక్స్ తింటే క్యాలరీలు పెరగడంతో పాటు జీర్ణక్రియకి కూడా ఇబ్బంది వస్తుంది.

అలా కాకుండా రుచిగా ఉండటంతో పాటు ఆరోగ్యకరంగా ఉండే స్నాక్స్ ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా ఇవి తక్కువ నూనెతో పాటు ఇంట్లో ఉండే పదార్థాలతో చేసుకుంటే వర్షాకాలంలో తినడానికి ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

వెజిటబుల్స్ సూప్

Advertisement

బయట చల్లగా వాన పడుతుంటే వేడివేడిగా వెజిటేబుల్ సూప్ తాగాలని ఎవరికీ ఉండదు.మరి ఈ వెజిటేబుల్స్ సూప్‌ని కూరగాయలతో ఎలా చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.

ముందుగా ఈ సూప్‌కి కావాల్సింది క్యారెట్, బీన్స్, క్యాప్సికం, టమాటా, స్వీట్ కార్న్.

Advertisement

వీటన్నింటినీ బాగా ఉడికించి దానిలో కొద్దిగా మిరియాల పొడి, అల్లం, ఉప్పు వేసుకొని తయారు చేసుకోవచ్చు.ఇంకా వీటిలో నూనె, ఉప్పు, రెడీమేడ్ సాసులు వంటివి అతిగా వాడకుండా చేసుకుంటే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది.

శనగల సుండలు

ఈ రెసిపీ విషయానికి వస్తే బాగా ఉడికించిన శనగలకు కొద్దిగా కరివేపాకు, ఆవాలు, పచ్చిమిర్చితో తాలింపు పెట్టి తయారు చేసుకుంటే ఆ టేస్ట్ వేరు.ఇంకా ఇందులో కొత్తిమీర, ఉల్లిపాయలు, కొబ్బరి తురుము వంటివి యాడ్ చేసుకుంటే ఆ రుచి మరింత పెరిగిపోతుంది.

ఇక సాయంత్రం పూట ప్రోటీన్, ఫైబర్ అందించే స్నాక్స్‌గా వీటిని తీసుకోవడం ఆరోగ్యానికి మరింత మంచిది.

మసాలా మఖాన

ముందుగా తక్కువ నూనెతో మఖానని బాణలిలో వేయించి అందులో కొద్దిగా ఉప్పు, పసుపు, మిరియాల పొడి కలిపితే క్రిస్పీ క్రిస్పీగా ఉండే మసాలా స్నాక్స్ రెడీ.మామూలుగా మనకి టీవీ చూస్తూ ఏదైనా తినాలనిపించినప్పుడు చిప్స్, బిస్కెట్లకి బదులు ఈ మసాలా మఖాన తిన్నామంటే ఆ అనుభూతే వేరు.

పెసరపప్పు చిల్లా

పెసరపప్పుని కొన్ని గంటలు నానబెట్టి మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాక అందులో కొత్తిమీర, అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసుకొని ఒక దోశలా పోసుకోవాలి.

ఇక పెసరపప్పులో ప్రోటీన్ కూడా ఉండటం వల్ల ఇది సాయంత్రం పూట వేడివేడిగా కడుపు నిండేలా తినాలనుకునే వారికి ఈ పెసరపప్పు చిల్లా అనేది ఒక మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు.

బీట్రూట్ క్యారెట్ కట్లెట్

మామూలుగా చిన్న పిల్లలు కూరగాయలు కూడిన భోజనం చేయాలంటే తెగ మారాం చేస్తారు. దాంతో కూరగాయలు పిల్లలు తినట్లేదు అంటూ మనం టెన్షన్ పడిపోతాం.

అలా కాకుండా ఇలా బీట్రూట్, క్యారెట్‌లని కట్లెట్ రూపంలో చేసి ఇస్తే పిల్లలు చాలా ఇష్టంగా తినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.దీని విషయానికి వస్తే ముందుగా ఉడికించిన బంగాళదుంప, బీట్రూట్, క్యారెట్ లేదా ఇతర కూరగాయలన్నింటిని మెత్తగా చేసి దానికి కొద్దిగా రవ్వ లేదా ఓట్స్ పొడి యాడ్ చేసి కట్లెట్‌లా చేసుకోవాలి.

ఇక వీటిని డీప్ ఫ్రై చేయకుండా తవాపై కొద్దీ నూనెతో కాల్చుకున్నామంటే వేడి వేడి బీట్రూట్ క్యారెట్ కట్లెట్ రెడీ.

స్వీట్ పొటాటో చాట్స్

మామూలుగా మనం పొటాటో చాట్స్ అనగానే బంగాళదుంపల్ని ప్రిఫర్ చేస్తుంటాం.అలా కాకుండా చిలకడదుంపలతో కూడా ఈ చాట్‌ని ట్రై చేసుకోవచ్చు.దీనికి చేయాల్సింది ముందుగా చిలకడదుంపని బాగా ఉడికించి ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి.

తర్వాత దానికి ఉల్లిపాయ, నిమ్మరసం, కొత్తిమీర, కొద్దిగా మిరియాల పొడి, ఉప్పు కలుపుకుంటే వేడి వేడి దుంపలతో సూపర్ స్నాక్స్ రెడీ అయిపోతుంది.

బ్రెడ్ రోల్స్

బ్రెడ్ రోల్స్ అంటే పిల్లలకి ఎంత ఇష్టమో చెప్పక్కర్లేదు.అయితే వీటిని ఎప్పట్లా నూనెలో బాగా వేయించకుండా చేసుకోవచ్చు.

దీనికి కావాల్సిందల్లా బీన్స్, క్యారెట్, బాగా ఉడికిన బంగాళదుంప, కొత్తిమీర, బఠానీలు, మిరియాల పొడి, సరిపడేంత ఉప్పు.

వీటన్నింటినీ బాగా మిక్స్ చేసి బ్రెడ్‌లో పెట్టి రోల్ చేయాలి.ఆ తర్వాత కొంచెం నూనె రాసి ఎయిర్ ఫ్రయర్‌లో పెట్టామంటే వేడివేడి క్రిస్పీగా ఉండే బ్రెడ్ రోల్స్ రెడీ.

వెజిటబుల్ కార్న్ చాట్

ఒక రకంగా సాయంత్రం పూట మరీ హెవీగా కాకుండా లైట్‌గా తినాలనుకునే వారికి ఇదొక బెస్ట్ ఆప్షన్ చెప్పుకోవచ్చు.

వీటికి కావాల్సింది బాగా ఉడికించిన స్వీట్ కార్న్, క్యారెట్, కీరదోస, ఉల్లిపాయ, టమాటా, కొత్తిమీర, నిమ్మరసం, కొద్దికొంచెం మిరియాల పొడి, సరిపడేంత ఉప్పు.

వీటన్నింటినీ బాగా కలిపి నిమ్మరసం, మిరియాల పొడి దీనికి యాడ్ చేశామంటే చాలు వెజిటబుల్ కార్న్ చాట్ రెడీ.

ఓట్స్ వెజిటేబుల్ పకోడీ

సాధారణంగా పకోడీ అనగానే చాలామంది శనగపిండితో చేస్తుంటారు. అలా కాకుండా ఈసారి మీరు కాస్త డిఫరెంట్‌గా ఓట్స్, కూరగాయలతో ట్రై చేయండి.

దీనికి కావాల్సింది ఓట్స్ పొడి, ఒక కప్పు క్యారెట్ తురుము, ఉల్లిపాయ, క్యాప్సికం, కొత్తిమీర, పచ్చిమిర్చి కొద్దిగా, ఉప్పు, అల్లం, నీరు.

ముందుగా ఓట్స్ కొద్దిగా వేయించి పొడి పొడిగా చేసుకోవాలి. తర్వాత అందులో సరిపడేంత కూరగాయలు, కొత్తిమీర, అల్లం, పచ్చిమిర్చి, ఉప్పు వేసి బాగా కలపాలి.ఇక నీళ్లు పోసి పకోడీల మిశ్రమంలా తయారు చేసుకోవాలి. తర్వాత వీటిని డీప్ ఫ్రై చేయడానికి బదులు ఎయిర్ ఫ్రయర్‌లో లేదా అప్పం పాన్‌లో తక్కువ నూనె వేసి చేసుకుంటే ఓట్స్ వెజిటేబుల్ పకోడీ రెడీ.

ALSO READ:భార్యతో గొడవలు ఎందుకు వస్తాయో తెలుసా?

ఇంట్లోనే చేసుకుంటే రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం

సో బయట ఏది ఎలా చేస్తారో, ఏంటో అన్న అనుమానాలతో తినే కన్నా ఇంట్లోనే ఎంచక్కా మనకు అందుబాటులో ఉన్న వస్తువులతో ఇలా వేడివేడిగా స్నాక్స్ తయారు చేసుకున్నామంటే ప్లేట్లో ఏమాత్రం ఉంచకుండా చకచకా పొట్టలో వేయడం పక్క!

Tags

Related News

భార్యతో గొడవలు ఎందుకు వస్తాయో తెలుసా?

ముఖంపై చిరునవ్వు, మనసులో ఎన్నో రహస్యాలు.. ‘స’ అక్షరంతో పేరు ఉన్నవారి స్వభావం చాలా క్లిష్టం

ఏటిఎం నుంచి డబ్బులు డ్రా చేసి స్లిప్ అక్కడే పారేస్తున్నారా? సైబర్ మోసాల ప్రమాదం జాగ్రత్త

తల్లిదండ్రులను లవ్ మ్యారేజ్‌కు ఎలా ఒప్పించాలి? మీ కోసమే ఈ టిప్స్

పొట్ట చుట్టూ వేగంగా కొవ్వు కరగడానికి మసాలా వాటర్.. రాత్రి రోజూ తాగితే ఫ్యాట్ బర్న్

కుక్క మాంసం సూప్ తాగాలని చెప్పిన కొరియా ప్రభుత్వం.. డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

వంట చేస్తున్నప్పుడు ఈ 10 తప్పులు అస్సలు చేయకండి

Big Stories

Advertisement
×