E-Paper
Advertisement

హాస్పిటల్ పాలైన అవికా గోర్..ఏం చేసిందో తెలిస్తే షాక్!

హాస్పిటల్ పాలైన అవికా గోర్..ఏం చేసిందో తెలిస్తే షాక్!
Advertisement

Avika Gor: ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలలో సినిమాపై ఇష్టం మాత్రమే కాదు సినిమా పట్ల వారు చూపిస్తున్న నిబద్ధత అందరిని ఆశ్చర్యంలో ముంచేస్తోంది. మరీ ముఖ్యంగా నిర్మాతలకు నష్టం రాకుండా.. గాయాల పాలైనా, హాస్పిటల్లో చికిత్స తీసుకున్నా సరే ఏమాత్రం విశ్రాంతి లేకుండా సినిమా షూటింగ్లో పాల్గొంటూ ప్రమోషన్లకు హాజరవుతూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ క్రమంలోనే ‘చిన్నారి పెళ్లికూతురు’ అలియాస్ అవికా గోర్(Avika gor) కూడా హాస్పిటల్ పాలయినప్పటికీ నిర్మాతలకు నష్టం రాకూడదనే తపనతో ఆమె చేసిన పని అందరిని నోరెళ్లపెట్టేలా చేసింది. పైగా ఈ విషయాన్ని ఆమె భర్త మిలింద్ చాంద్వానీ (Milind Chandwani ) సోషల్ మీడియా వేదికగా పంచుకున్న పోస్ట్.. ఆమెపై ప్రశంసలు కురిపించేలా చేస్తోంది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

హాస్పిటల్ పాలైన అవికా గోర్..

హిందీలో బాలికా వధూ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చి తెలుగులో ‘చిన్నారి పెళ్లికూతురు’ పేరిట డబ్బింగ్ అయి.. విపరీతమైన ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది అవికా గోర్ . ఇందులో తన ముద్దు ముద్దు మాటలతో అందరి దృష్టిని ఆకట్టుకుంది. అలాంటి ఈమె ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి అక్కడ నుంచి వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది.ఇంతకాలం తెలుగులో సినిమాలు చేసిన ఈమె ఇప్పుడు హిందీలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది. ఇదిలా ఉండగా.. గత ఐదు రోజులుగా 104 డిగ్రీల జ్వరంతో బాధపడుతున్న ఆమె ఇటీవల ముంబై లోని ఒక ప్రైవేటు హాస్పిటల్లో చేరింది. అయితే ఆమెను పరీక్షించిన వైద్యులు డెంగ్యూ తో బాధపడుతున్నట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు తాజాగా ఆమె భర్త మిలింద్ శుక్రవారం రాత్రి సోషల్ మీడియాలో పంచుకున్న వీడియో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

అవికా నిబద్ధతకు ప్రశంసలు..

Advertisement

జ్వరం తగ్గకపోవడంతో అవికాను హాస్పిటల్ లో చేర్చాము గత ఐదు రోజులుగా 104 డిగ్రీల జ్వరంతో బాధపడుతున్నప్పటికీ తాను ఒప్పుకున్న షూటింగ్ బాధ్యతలను పూర్తి చేసి , ఆ తర్వాత ఒక యాడ్ షూట్ కోసం ఆమె ఢిల్లీకి కూడా ప్రయాణించారు. ఈ క్రమంలో నీరసం ,జ్వరం మరింత తీవ్రమవడంతో డెంగ్యూ పరీక్షలు చేయించుకోగా.. అక్కడ పాజిటివ్ తేలింది. దీంతో ప్రస్తుతం ఆమెను హాస్పిటల్ లో చేర్పించి చికిత్స అందిస్తున్నాము అంటూ ఆమె భర్త తెలిపారు. ఇక ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆమెకు పని పట్ల ఉన్న నిబద్ధతను చూసి అందరూ ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇతరుల సమయం, డబ్బు వృధా కాకూడదనే ఆలోచనతో అవికా సినిమా షూటింగ్లో పాల్గొన్నట్లు ఆమె భర్త స్పష్టం చేశారు.

also read: http://హాస్పిటల్ పాలైన అవికా గోర్..ఏం చేసిందో తెలిస్తే షాక్!

అవికా గోర్ సినిమాలు..

Advertisement

ప్రస్తుతం అవికా గోర్ బుఖార్ అనే హిందీ మ్యూజిక్ ఆల్బమ్ లో నటించింది. మిలింద్ షేర్ చేసిన వీడియోలో బెడ్ పైన ఉన్న ఆమె నవ్వుతూ విక్టరీ సింబల్ ని చూపించింది. తెల్ల రక్త కణాలు భారీగా తగ్గడంతో.. ఆందోళనతో పాటు డెంగ్యూ చాలా దారుణంగా ఉంది అంటూ తెలిపింది. మొత్తానికైతే అవికా గోర్ కి సినిమా పట్ల ఉన్న నిబద్ధతను ఈ వీడియో మరోసారి నిరూపించింది అని చెప్పవచ్చు.

Related News

ప్రమోషన్స్‌కి డబ్బులు తగలేయడం దండగే.. నాగ వంశీ షాకింగ్ కామెంట్స్!

ఈ ఐదుగురిలో టాలీవుడ్ నంబర్ వన్ ఎవరు?

రామాయణ మూవీను ఫస్ట్ చూసేది ఎవరో తెలుసా?

‘ఇరుముడి’ ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్.. ప్రత్యేకించి అక్కడే!

ఖడ్గం మూవీ బ్యూటీతో బ్రేకప్.. మరో హీరోయిన్ తో టాలీవుడ్ హీరో డేటింగ్!

‘కొరియన్ కనకరాజు ‘ బాక్సాఫీస్ ఊచకోత.. అక్కడ అదరగొట్టేస్తున్నాడుగా..!

రణ్‌బీర్‌కు ముందు రాముడిగా ఫిక్స్ అయిన హీరోలు ఎవరంటే..!

Big Stories

Advertisement
×