Naga Vamsi: నాగ వంశీ.. ప్రస్తుతం ఈయనకున్న సోషల్ మీడియా ఫాలోయింగ్ మరెవరికీ లేదంటే లేదంటే ఆశ్చర్యం లేదు. నిర్మాతగా కన్నా కాంట్రవర్సీకి కేరాఫ్ అన్నట్టుగానే మైండ్‌లో ఫిక్స్ అయిపోయారు ఇప్పటి మూవీ లవర్స్. అయితే అసలు ప్రీ రిలీజ్‌లో ఎందుకలా మాట్లాడుతారు? ప్రమోషన్స్ విషయంలో తన అభిప్రాయం ఏంటి? నంబర్స్ ఫేక్ అని తెలిసినా సినిమా పోస్టర్స్‌పై కలెక్షన్స్ ఎందుకు అవే వేస్తారు? వంటి అంశాలపై తనదైన శైలిలో ఇదిగో ఇలా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు నాగ వంశీ.
నాగ వంశీ మాట్లాడుతూ.. సినిమా తీసిన నిర్మాతకు తన సినిమా మీద ప్రేమ ఉండటం కామన్. తాను పెట్టిన డబ్బులు, పడిన కష్టం, చేసిన రిస్క్ అన్నీ తెలుసు కాబట్టి.. ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌లో అంత కాన్ఫిడెంట్‌గా మాట్లాడతానని, పైగా “కాకి పిల్ల కాకికి ముద్దు” అని అసలు విషయం చెప్పుకొచ్చారు నాగ వంశీ.
అంతేకాదు.. తాను మాట్లాడే విధానాన్ని బట్టి సినిమా హిట్టా, ఫ్లాపా అని జనాలు ముందే గెస్ చేసేస్తున్నారని కూడా అన్నారు.
ఇక్కడ నాగ వంశీ మరో విషయం కూడా క్లియర్‌గా చెప్పారు. సినిమా ఫ్లాప్ అయితే దాన్ని హిట్ అని చెప్పే అలవాటు తనకు లేదని అన్నారు. సినిమా బాగుంటుందన్న నమ్మకం ఉన్నప్పుడే గట్టిగా మాట్లాడతానని చెప్పడం చూస్తే.. ఆయన కాన్ఫిడెన్స్ ఏ రేంజ్‌లో ఉందో అర్థమవుతుంది.
ఇక నాగ వంశీ పోస్టర్స్‌పై వేసే నంబర్స్‌పై పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చాడు. ఆ పోస్టర్లపై వేసే నంబర్స్‌కి, అసలు వచ్చే కలెక్షన్స్‌కి ఏమాత్రం సంబంధం ఉండదని, అది కేవలం ఫ్యాన్స్‌ని సంతృప్తి పరచడానికే అని, ఆ విషయం వాళ్లకి కూడా తెలుసని అసలు విషయం చెప్పుకొచ్చాడు.
ఇక కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేసే ప్రమోషన్స్ ఉత్త దండగ అని, వాటి వల్ల సినిమాకి ఒక టికెట్ కూడా తెగదని, కేవలం సినిమా బాగుంటే మౌత్ టాక్‌తోనే జనాలు థియేటర్లకు వస్తున్నారని స్పష్టం చేశాడు.ఇక దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్‌గా ‘చెన్నై లవ్ స్టోరీ’, ‘మా ఇంటి బంగారం’, ‘లెనిన్’ సినిమాల్ని కోట్ చేశాడు నాగ వంశీ.
నిజానికి అది నిజం కూడా. ఒక ప్రేక్షకుడు “బాగుంది”అంటే పది మందికి చెబుతాడు. కానీ “బాగోలేదు.. వెళ్లొద్దు” అంటే కూడా అదే పది మందికి చెబుతాడు. ఒక్కసారి నెగెటివ్ టాక్ బయటకు వచ్చిందంటే దాన్ని ఆపడం అంత ఈజీ కాదు. దాన్నే కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు నాగ వంశీ.
నిజానికి ఎవరు చేసిన సినిమా వాళ్లకి బాగానే ఉంటుంది. హీరోకి తన సినిమా కెరీర్ బెస్ట్ అనిపిస్తుంది. హీరోయిన్ అయితే ఇలాంటి క్యారెక్టర్ ఇంతకు ముందు ఎప్పుడూ చేయలేదు అనిపిస్తుంది. దర్శకుడికి తన కథ మీద ఫుల్ నమ్మకం ఉంటుంది.ఇవన్నీ ఉండటం తప్పేం కాదు కూడా. సినిమా చూసేంతవరకు అందరూ తమ సినిమాను ఆకాశానికి ఎత్తేయొచ్చు.
also read :ఈ ఐదుగురిలో టాలీవుడ్ నంబర్ వన్ ఎవరు?
కానీ థియేటర్‌లో బొమ్మ పడిన తర్వాతే అసలు విషయం బయటికి వస్తుంది. ఏ మాత్రం తేడా కొట్టినా సినిమా మేకర్స్ కాస్తా సోషల్ మీడియాలో మీమర్స్‌కి మంచి స్టఫ్ అయిపోతారు. అలా చింటూ కూడా ఎన్నోసార్లు టార్గెట్ అయ్యాడు కూడా!