E-Paper
Advertisement

మరో బంపర్ ఆఫర్ కొట్టేసిన భాగ్యశ్రీ!

మరో బంపర్ ఆఫర్ కొట్టేసిన భాగ్యశ్రీ!
Advertisement

Bhagya Shri Borse: ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన భాగ్యశ్రీ బోర్సే (Bhagya Shri Borse) అందంతో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ‘కింగ్డమ్’ చిత్రంలో నటించిన ఈమె.. చివరిగా ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ సినిమాలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అయితే ఏవి కూడా ఈమెకు విజయాన్ని అందించలేదు. కానీ ఇటీవల మురళీ కిషోర్ అబ్బూరు (Murali Kishore abburu) దర్శకత్వంలో అఖిల్ అక్కినేని (Akhil Akkineni)హీరోగా నటించిన ‘లెనిన్’ సినిమాలో హీరోయిన్గా నటించి.. భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. పైగా ఈ సినిమా రూ.100 కోట్ల క్లబ్ లో చేరి ఈమెకు మంచి సక్సెస్ ను అందించింది. అటు అఖిల్ కి ఇటు భాగ్యశ్రీ కి ఇద్దరికీ కూడా తొలి రూ.100 కోట్ల మూవీ ఇదే కావడం గమనార్హం.

బంపర్ ఆఫర్ కొట్టేసిన భాగ్యశ్రీ..

ఈ సినిమాలో గ్లామర్ తో పాటు నటనతో కుర్రకారు గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.. అలాంటి ఈమెకి ఒక్క సక్సెస్ తో సౌత్ ఇండస్ట్రీలో డిమాండ్ భారీగా పెరిగిపోయింది. ప్రస్తుతం తమిళంలో శివ కార్తికేయన్ (Siva Karthikeyan) తో ‘సెయాన్’ అనే సినిమా చేస్తున్న ఈమె ఖాతాలోకి ఇప్పుడు మరో బంపర్ ఆఫర్ పడినట్లు సమాచారం.. నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా , విలక్షణ డైరెక్టర్ సుజీత్ (sujeeth) కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవైటెడ్ గ్యాంగ్ స్టర్ డ్రామా ‘బ్లడీ రొమియో’ చిత్రంలో నాని సరసన హీరోయిన్గా నటించేందుకు భాగ్యశ్రీని చిత్ర బృందం సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

భాగ్యశ్రీ కూడా గ్రీన్ సిగ్నల్..

Advertisement

ముఖ్యంగా (sujeeth)రాసుకున్న విభిన్నమైన కథ, తన పాత్ర నచ్చడంతో భాగ్యశ్రీ కూడా ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మాత వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్నారు. గతంలోనే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగు ఇంకా ప్రారంభం కాలేదు . కానీ త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పట్టాలెక్కించేందుకు మేకర్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇకపోతే నాని, సుజీత్ కలయికలో వస్తున్న ఈ యాక్షన్ డ్రామా పై ఇండస్ట్రీలో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొనడంతో ఈ సినిమా అప్డేట్స్ కోసం అభిమానులు కూడా వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు.

also read; హాస్పిటల్ పాలైన అవికా గోర్..ఏం చేసిందో తెలిస్తే షాక్!

నాని సినిమాలు..

Advertisement

నాని విషయానికొస్తే.. ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ది ప్యారడైజ్ సినిమా చేస్తున్నారు. సెప్టెంబర్ 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఇటీవల ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ట్రైలర్ లోని విజువల్స్ చాలా గ్రాండ్ గా ఉన్నప్పటికీ.. డైలాగ్స్ మాత్రం అర్థం కావడం లేదు అనే విమర్శలు వస్తున్నాయి. అర్థం కాని డైలాగ్స్ తో సినిమా ఎలా సక్సెస్ అందుకుంటుంది అంటూ కూడా విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. అయితే చిత్ర బృందం ఆగస్టు 8వ తేదీన మరో వీడియోతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కనీసం ఇప్పటికైనా సినిమాలో మార్పులు చేసి డైలాగ్స్ అర్థవంతమయ్యేలా తీర్చిదిద్దాలని నెటిజన్స్ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

Related News

ప్రమోషన్స్‌కి డబ్బులు తగలేయడం దండగే.. నాగ వంశీ షాకింగ్ కామెంట్స్!

హాస్పిటల్ పాలైన అవికా గోర్..ఏం చేసిందో తెలిస్తే షాక్!

ఈ ఐదుగురిలో టాలీవుడ్ నంబర్ వన్ ఎవరు?

రామాయణ మూవీను ఫస్ట్ చూసేది ఎవరో తెలుసా?

‘ఇరుముడి’ ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్.. ప్రత్యేకించి అక్కడే!

ఖడ్గం మూవీ బ్యూటీతో బ్రేకప్.. మరో హీరోయిన్ తో టాలీవుడ్ హీరో డేటింగ్!

‘కొరియన్ కనకరాజు ‘ బాక్సాఫీస్ ఊచకోత.. అక్కడ అదరగొట్టేస్తున్నాడుగా..!

Big Stories

Advertisement
×