E-Paper
Advertisement

విజయ్‌కు త్రిష.. మరో లక్ష్మీ పార్వతి అవుతుందా? తమిళనాట హాట్ టాపిక్!

విజయ్‌కు త్రిష.. మరో లక్ష్మీ పార్వతి అవుతుందా? తమిళనాట హాట్ టాపిక్!
Advertisement

Vijay Politics:సినిమాలు.. రాజకీయాలు.. ఈ రెండింటిని వేరు చేసి చూడలేము. ఎంజీఆర్, ఎన్టీఆర్ కాలం నుంచి పవన్, విజయ్ వరకు సినీ తారలంతా పాలిటిక్స్‌ను పూసుకున్నవారే. ఇక వీరిలో సీఎంలయ్యి రాష్ట్రాలను ఏలిన వారు కూడా ఉన్నారు. అయితే వీరిలో ఎన్టీఆర్ రాజకీయ ప్రయాణం కాస్త విభిన్నం, విచిత్రం కూడా.

పార్టీ పెట్టిన అతి కొద్ది కాలంలోనే అధికారం దక్కించుకున్న ఎన్టీఆర్.. మొదట్లో కుటుంబ పరంగా ఎలాంటి ఆటుపోట్లు, ఇబ్బందులు లేకుండా సాఫీగానే పార్టీని, ప్రభుత్వాన్ని జోడెద్దుల్లా నడిపాడు. కానీ ఎప్పుడైతే ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి రెండో భార్యగా ఎంట్రీ ఇచ్చారో.. అప్పటి నుంచే ఎన్టీఆర్ రాజకీయ పతనం ఆరంభమైందని చెప్పాలి.

Advertisement

ఇంటా.. బయటా.. ఎక్కడ లేని విమర్శలు ఎదుర్కొన్నారు ఎన్టీఆర్. ఇక లక్ష్మీ పార్వతి ఆధిపత్యం సహించలేకే చంద్రబాబు కుటుంబ సభ్యుల సహాయం, సహకారంతో పార్టీని, ప్రభుత్వాన్ని చేజిక్కించుకున్నారనే వాదన అప్పట్లో బలంగా వినిపించింది.

విజయ్ రాజకీయ ప్రయాణంలోనూ త్రిష పాత్ర?

ఇక ప్రస్తుతం విజయ్ రాజకీయ ప్రయాణంలోనూ త్రిష అచ్చం లక్ష్మీ పార్వతి పాత్ర పోషిస్తుందా అంటూ చెవులు కొరుక్కుంటున్నారు. కారణం.. విజయ్‌కు సన్నిహితంగా ఉంటున్న ఆమె కూడా ఇప్పుడు టీవీకేలోకి అఫీషియల్‌గా ఎంట్రీ ఇస్తుందన్న వార్తలు రావడమే.

Advertisement

పైగా దీనికి బలం చేకూరుస్తూ మధురైలో ‘త్రిష నర్పణి మండ్రం’ పేరుతో పోస్టర్లు విచ్చలవిడిగా వెలిశాయట కూడా. ఇందులో ‘అక్క త్రిష’ అంటూ త్రిషను ఉద్దేశిస్తూ పలకడం ఇప్పుడు అటు సినీ, ఇటు రాజకీయ వర్గాల్లో హాట్ న్యూస్ అయిపోయింది.

ఆ పోస్టర్లు ఎవరు అంటించారు?

మరి వీటిని త్రిష అభిమానులు అతికించారా? లేక టీవీకే అభిమానులు అతికించారా? అన్న దానిపై క్లారిటీ రావాలి.

ఇక మరోవైపు విజయ్ భార్య సంగీత విడాకుల కేసులో వెనక్కి తగ్గడంతో.. త్రిష ముందుచూపుతోనే తన అనుచరులతో ఇలా పోస్టర్లు అంటించి జోరు పెంచిందా అంటూ సోషల్ మీడియాలో మాత్రం అప్పుడే పొలిటికల్ మీమ్స్ మొదలైపోయాయి.

సీనియర్ ఎన్టీఆర్‌కు లక్ష్మీ పార్వతి లాగే.. త్రిష కూడా ఇప్పుడు పార్టీలోకి చేరి విజయ్ సన్నిహితులను బయటికి పంపిస్తుందా అన్న అనుమానాలు కొంతమంది పార్టీ క్యాడర్‌లోనూ, ఇటు సీనియర్స్‌లోనూ రేకెత్తుతున్నాయట.

త్రిషకు నిజంగానే రాజకీయాలపై ఆసక్తి ఉందా?

అయితే అసలు త్రిషకు రాజకీయాలపై నిజంగా ఆసక్తి ఎంత? విజయ్ పార్టీలో చేరే ఆలోచన ఉందా? అన్నదానిపై మాత్రం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన అయితే లేదు.

అయితే ఒకవేళ త్రిష నిజంగానే టీవీకేలోకి వస్తే మాత్రం రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిణామమే అవుతుంది. ఎందుకంటే విజయ్‌కు ఇప్పటికే సినీ అభిమానుల బలమైన బేస్ ఉంది. త్రిషకు కూడా తమిళ ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది.

ముఖ్యంగా మహిళల్లో, ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఆమెకు ఉన్న గుర్తింపు పార్టీకి ఉపయోగపడుతుందనే రాజకీయ లెక్కలు కూడా ఉండొచ్చు.

స్టార్ క్యాంపెయినర్‌గా త్రిష?

అదే జరిగితే విజయ్‌కు త్రిష ‘స్టార్ క్యాంపెయినర్’గా ఉంటారా? పార్టీ మహిళా విభాగానికి నాయకత్వం వహిస్తారా? లేక ఏదైనా కీలకమైన రాజకీయ బాధ్యత తీసుకుంటారా? అనేది చూడాల్సి ఉంటుంది.అందుకే తమదైన స్టైల్లో పంచ్‌లు పేలుస్తున్నారు నెటిజన్లు.

‘అప్పట్లో ఎన్టీఆర్‌కు లక్ష్మీ పార్వతి.. ఇప్పుడు విజయ్‌కు త్రిష.. తమిళ పాలిటిక్స్‌లో కూడా సెంటిమెంట్ మారలేదా?’ అంటూ సెటైర్లు వేస్తున్నారు.కానీ రాజకీయాల్లో రూమర్లు రావడం సహజం. ఏది ఏమైనా.. త్రిష అధికారికంగా టీవీకేలో చేరే వరకు ఈ చర్చకు ఎండ్ కార్డు పడేలా లేదు.

చూడాలి.. ముందు ముందు ఏం జరుగుతుందో!

also read :ఈ ఐదుగురిలో టాలీవుడ్ నంబర్ వన్ ఎవరు?

Tags

Related News

విభిన్న గెటప్స్ లో శర్వానంద్.. ‘జార్జ్ క్రిష్’ నుండి ఫస్ట్ బూస్టర్ రిలీజ్!

ది ప్యారడైజ్ దెబ్బ.. టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ లో ఇప్పుడైనా మార్పు వస్తుందా?

మా ఇంటి వాచ్‌మెన్ ఫోన్‌లో నా ఇంటిమేట్ సీన్స్.. నరకం చూశా – రాధిక ఆప్టే

డింపుల్ హయతి నెలకు అంత సంపాదిస్తుందా..? సినిమాల కన్నా ఎక్కువే..

ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత..

అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. ఇది అస్సలు ఊహించలేదు మావా..

నాని కెరీర్‌లోనే బిగ్ రిలీజ్.. ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ లెక్కలు ఇవే!

అబ్బబ్బా.. ఖుషీ కపూర్ ఏంటి ఈ లుక్! ఫ్యాన్స్‌కి ఫుల్ ట్రీట్

Big Stories

Advertisement
×