E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

Ram Charan : లండన్ లో ‘పెద్ది’ సక్సెస్ సెలబ్రేషన్స్.. రామ్ చరణ్ కు గ్రాండ్ వెల్కమ్..

Ram Charan : లండన్ లో ‘పెద్ది’ సక్సెస్ సెలబ్రేషన్స్.. రామ్ చరణ్ కు గ్రాండ్ వెల్కమ్..
Advertisement

Ram Charan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం పెద్ది.. ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈనెల నాలుగో తేదీన భారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ అయింది. మొదట మిశ్రమ టాక్ వచ్చినా కూడా ఆ తర్వాత సినిమాకు మౌత్రాకు పాజిటివ్ గానే మారింది. ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ రావడంతో కలెక్షన్స్ కూడా భారీగానే పెరిగాయి.. దాదాపు 500 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టినట్లు తెలుస్తుంది. సినిమా భారీ సక్సెస్ అయినందుకు చిత్ర యూనిట్ గ్రాండ్గా సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేసింది. లండన్ లో కూడా సినిమా సక్సెస్ అవడంతో అక్కడ ఫ్యాన్స్ని కలిసేందుకు రామ్ చరణ్ వెళ్ళాడు. రామ్ చరణ్ ని చూసిన అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. లండన్ లో ఫ్యాన్స్ తో రామ్ చరణ్ ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

రామ్ చరణ్ కు గ్రాండ్ వెల్కమ్..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బ్యూటిఫుల్ హీరోయిన్ జంటగా నటించిన తాజా చిత్రం పెద్ది. ఈ మూవీకి బుచ్చిబాబు దర్శకత్వం వహించారు. మొదటినుంచి భారీ అంచనాలను క్రియేట్ చేసుకున్న ఈ చిత్రం రిలీజ్ అయిన తర్వాత కూడా అంతే టాక్ ని సొంతం చేసుకుంది.. ఫస్ట్ టాక్ని అందుకోవడంతో పాటుగా కలెక్షన్లు కూడా భారీగా రావడంతో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేసింది. హైదరాబాదులో ఈ సినిమాకు సంబంధించిన సక్సెస్ మీట్ని గ్రాండ్గా నిర్వహించారు. అనంతరం యూకే లో, లండన్ లో పెద్ది సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. అయితే ఆ కార్యక్రమానికి రామ్ చరణ్ హాజరయ్యారు. పెద్ది హీరో అక్కడ కనిపించడంతో రామ్ చరణ్ అభిమానులు అతన్ని కలిసేందుకు ఆత్రుత కనబరిచారు. ఆయనతో సెల్ఫీలు ఆటోగ్రాఫ్లు తీసుకున్నారు.. లండన్ లో రామ్ చారాబ్ కు గ్రాండ్ వెల్కమ్ దక్కింది. ఆ ఫోటోలలో రామ్ చరణ్ సూటులో గ్లాసెస్ పెట్టుకొని స్టైల్ గా కనిపించారు.. లండన్ లో ఫ్యాన్స్ తో ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి..

Advertisement

Also Read :‘ నువ్వు లేక నేను ‘ రాధ ఏం చదివిందో తెలుసా..?

రామ్ చరణ్ సినిమా విషయానికొస్తే..

త్రిబుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ నటించిన సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ రీసెంట్గా ఈయన నటించిన పెద్ది మూవీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. స్పోర్ట్స్ నేపథ్యంలో వచ్చిన సినిమా స్టోరీ జనాలని మెప్పించింది. దాంతో కలెక్షన్స్ కూడా భారీగానే వసూల్ అయ్యాయి. రామ్ చరణ్ కెరీర్‌లోనే ఇది ఒక మైలురాయిగా నిలిచిందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.. ఈ నెలలో సమంత మా ఇంటి బంగారం సినిమా తప్ప మిగిలిన సినిమాలు అన్ని చిన్నవే కావడంతో పెద్ది హవా ఇంకా థియేటర్లలో కొనసాగుతూనే ఉంది. 500 కోట్లకు పైగా వసూలు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. త్వరలోనే ఓటీటీలోకి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.. ఇకపోతే రామ్ చరణ్ ఈ సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని ఉన్నాడని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆయన ప్రస్తుతం సుకుమార్ తో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఈ సినిమా కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుంది అని ఫాన్స్ ఇప్పటినుంచే సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి..

Related News

OG యూనివర్స్ ఎక్స్‌పాండ్.. మేకర్స్ నుండీ మరో సర్‌ప్రైజ్!

ఆంధ్రా వర్సెస్ తెలంగాణ… కాంట్రవర్సీకి తెరలేపిన ప్రియదర్శి ‘ఇడుపు కాయితం’ !

పెళ్లి, విడాకులపై త్రిష కామెంట్స్!

వెంకీ మామ ఆదర్శ కుటుంబం రిలీజ్ డేట్ లాక్.. మిస్ అవుతారేమో?

ఖుష్బూ కుమార్తె పెళ్లిలో త్రిష స్పెషల్ అట్రాక్షన్.. ఈమె ధరించిన నెక్లెస్ ధర తెలిస్తే ఫ్యూజులు ఔట్!

చిత్ర పరిశ్రమలో తీరని లోటు.. భాగ్యరాజ్ మృతిపై పవన్ కళ్యాణ్ కన్నీటి వీడ్కోలు!

వయసు 94.. కానీ విజన్ నెక్స్ట్ లెవెల్…వైరల్ అవుతున్న ‘సింగ్ గీతం’మేకింగ్ వీడియో

Big Stories

×