E-Paper
Advertisement

దిష్టిబొమ్మ చేసే దిక్కుమాలిన పని… కొత్త ఊరంటేనే గుండె గుభేల్మనిపించే హర్రర్ మూవీ

దిష్టిబొమ్మ చేసే దిక్కుమాలిన పని… కొత్త ఊరంటేనే గుండె గుభేల్మనిపించే హర్రర్ మూవీ
Advertisement

Horror Movie : ఓటీటీలో భయపెట్టే హాలోవీన్ హారర్ అడ్వెంచర్ ను చూడాలి అనుకుంటున్నారా ? అయితే ‘ఆర్‌.ఎల్‌. స్టైన్’స్ పంప్‌కిన్‌హెడ్’ (R.L. Stine’s Pumpkinhead) మీ కోసమే. ప్రముఖ హారర్ రచయిత ఆర్‌.ఎల్‌. స్టైన్ రాసిన ‘ది హాంటింగ్ అవర్’ సిరీస్ కథల్లో ఈ సినిమా కూడా ఒకటి. హాలోవీన్ ను ఇష్టపడే పిల్లలు, యంగ్ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా ఈ సినిమాను తీశారు. శాపాలు, సాహసాలతో అద్భుతంగా అల్లిన ఈ చిత్రాన్ని హారర్ ఫ్యాన్స్‌ డోంట్ మిస్.

కథలోకి వెళ్తే…

13 ఏళ్ల సామ్ చుట్టూ ఈ మూవీ స్టోరీ తిరుగుతుంది. అతని కుటుంబం న్యూయార్క్ నగరం నుంచి ‘రెడ్‌హావెన్’ అనే చిన్న గ్రామానికి మారుతుంది. కొత్త ఊరు, కొత్త ఇల్లు, కొత్త స్నేహితులు… సామ్‌కు ఈ మార్పు అస్సలు నచ్చదు. కానీ ఊరిలో ఒక విచిత్రమైన రూల్ ఉంటుంది. ఒక పాత పొలం దగ్గరకు ఎవరూ వెళ్లకూడదు, అక్కడి గుమ్మడికాయలు ముట్టుకోకూడదు అన్నదే ఆ రూల్. అయితే సామ్ ఆ నిబంధనను ధిక్కరించి, ఆ పొలం నుంచి ఒక వింతైన, భయంకరంగా కనిపించే పంప్‌కిన్‌ను దొంగిలిస్తాడు. ఆ తర్వాత జరిగే సంఘటనలు సామ్ జీవితాన్ని ఊహించని విధంగా మార్చేస్తాయి.

Advertisement

సామ్ పెద్దన్నయ్య ఫిన్ ఆ పంప్‌కిన్‌ను తిరిగి ఇచ్చేయడానికి ఆ పొలానికి వెళ్తాడు. కానీ అక్కడ ఉండే భయంకరమైన దిష్టిబొమ్మ లాంటి రాక్షసుడు (Pumpkinhead) అతన్ని పట్టుకుని మాయం చేస్తుంది. ఇక ఊరంతా ఫిన్ ఉనికిని మర్చిపోతుంది. సామ్ తల్లి నుంచి మొదలుకొని, ఊరి ప్రజలందరూ ఫిన్ గురించి మరచిపోతారు. కానీ సామ్ మాత్రం తన అన్నయ్యను మరచిపోడు. తన కొత్త స్నేహితురాలు బెక్కా, ఊరిలోని విచిత్రమైన వ్యక్తి రస్టీ సహాయంతో సామ్ ఆ శాపాన్ని బ్రేక్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. హాలోవీన్ రాత్రి ముగిసేలోపు ఆ రాక్షసుడిని ఎదుర్కొని, తన అన్నయ్యను ఆ పిల్లాడు ఎలా కాపాడుకున్నాడు ? అనేదే ఈ సినిమా కథాంశం.

ఈ సినిమాలో హాలోవీన్ వాతావరణం, భయంకరమైన దిష్టిబొమ్మలు, సీక్రెట్స్, అడ్వెంచర్, ఫ్యామిలీ ఎమోషన్స్ ను మేకర్స్ మనసుకు హత్తుకునే విధంగా చూపించారు. పిల్లలు నుంచి పెద్దల వరకు అందరినీ అలరించేలా తీసిన ‘ఆర్‌.ఎల్‌. స్టైన్స్ పంప్‌కిన్‌హెడ్’ ఒరిజినల్‌గా Tubi అనే ఉచిత స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లో Tubi Originalగా విడుదలైంది. ప్రస్తుతం ఇది Amazon Prime Videoలో కూడా అందుబాటులో ఉంది. 2025 అక్టోబర్ 17న విడుదలైన ఈ సినిమా తెలుగులో అందుబాటులో లేదు. భాష అడ్డు కాదనుకుంటే ఇంగ్లీష్ లోనే చూడవచ్చు. హాలోవీన్ సీజన్‌లో పిల్లలు, టీనేజర్లతో కలిసి ఈ హారర్ అడ్వెంచర్ ను చూస్తే మరింత థ్రిల్లింగ్ గా ఉంటుంది.

Advertisement

Read Also : 19 రోజుల తర్వాత తిరిగొచ్చే అన్నయ్య… కట్ చేస్తే గూస్ బంప్స్ తెప్పించే ట్విస్ట్

Related News

Friday OTT Releases : ఫ్రైడే ఓటీటీ సందడి.. ఆ రెండు మస్ట్ వాచ్..!

10 ఏళ్లలో 55 బదిలీలు… చివరికి ముఖ్యమంత్రి కుటుంబాన్ని కూడా వదలని కానిస్టేబుల్ కథ

పైలెట్ కావాల్సిన కుర్రాడు రెడ్ లైట్ ఏరియాలో ప్రేమంటూ… ఈ సిరీస్ పెద్దలకు మాత్రమే

పేదలకు నరకం… ధనవంతులకు స్వర్గం ఈ రైలు… లైఫ్ లో మరచిపోలేని థ్రిల్లిచ్చే సర్వైవల్ థ్రిల్లర్

కబడ్డీ నుంచి క్రైమ్ వరల్డ్‌లోకి… స్పోర్ట్స్ మూవీ కాదు పక్కా రా యాక్షన్ థ్రిల్లర్

కోరుకున్న వాడిని దక్కించుకోవడానికి ఇవేం మెంటల్ పనులు… ‘అబ్సెషన్’ చూసి ఆగమైనోళ్ల కోసమే ఈ థ్రిల్లర్ సిరీస్

పెళ్లి చేసుకుంటే కోటీశ్వరుల జీవితం… కానీ ఈ అమ్మాయి చేసిన పని తెలిస్తే దిమాక్ కరాబ్

తల్లి కావాలనే కోరిక… చివరికి బిడ్డ కోసం ఆమె చేసిన పని తెలిస్తే షాక్

Big Stories

Advertisement
×