E-Paper
Advertisement

‘దాదా’ మూడ్ లో 80’స్ లోకి వెళ్ళిన బాలయ్య.. న్యూ గెటప్ అదుర్స్ మావా!

‘దాదా’ మూడ్ లో 80’స్ లోకి వెళ్ళిన బాలయ్య.. న్యూ గెటప్ అదుర్స్ మావా!
Advertisement

Balakrishna:కాలం మారుతున్న కొద్దీ టెక్నాలజీలో ఊహించని మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ టెక్నాలజీ భవిష్యత్తును మన కళ్ళ ముందు ఉంచడమే కాకుండా. వర్తమానాన్ని కూడా మళ్లీ మనకు పరిచయం చేస్తూ.. నాటి జ్ఞాపకాలను నెమరు వేస్తోంది.. ఈ క్రమంలోనే ఆధునిక టెక్నాలజీగా పేరు పొందిన చాట్ జీపీటీ అందుబాటులోకి వచ్చిన తర్వాత నచ్చిన ఫోటోను, నచ్చిన బ్యాక్ గ్రౌండ్ తో.. నచ్చిన కాలాలతో డిజైన్ చేసుకునే వెసులుబాటు కలుగుతోంది. ఈ నేపథ్యంలోనే మొన్నటి వరకు జెన్ జీ, 90′ స్ అంటూ సోషల్ మీడియాలో తెగ రచ్చ చేసిన వారు.. ఇప్పుడు ఏకంగా 80లలోకి వెళ్లిపోయారు. కలర్ పిక్చర్ మొదలుకొని అప్పటి ట్రెండు ను మళ్లీ రీ క్రియేట్ చేస్తున్నారు.

ట్రెండ్ ను ఫాలో అవుతున్న బాలయ్య..

ఈ క్రమంలోనే గత రెండు రోజులుగా ఇంస్టాగ్రామ్ లో ఎక్కడ చూసినా 1980s ట్రెండు విస్తృతంగా నడుస్తోంది. యాప్ లో అన్నీ వింటేజ్ ఫోటోలే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సామాన్యులను మొదలుకొని సోషల్ మీడియా ఇన్ఫ్లూ యెన్సర్స్, యూట్యూబర్స్ మాత్రమే కాదు సెలబ్రిటీలు కూడా ఈ స్టైల్ లో ఫోటోలు అప్లోడ్ చేస్తూ ట్రెండ్ ను తాము కూడా ఫాలో అవుతున్నాం అంటూ నిరూపిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ జాబితాలోకి నటసింహ నందమూరి బాలకృష్ణ (Balakrishna ) కూడా వచ్చి చేరారు.

80s లోకి వెళ్లిన బాలయ్య దాదా లుక్..

Advertisement

ప్రస్తుతం ఈయన గోపీచంద్ మలినేని (Gopichand Malineni) దర్శకత్వంలో ‘దాదా’ అనే మూవీ చేస్తున్నారు. ఈ సినిమాలోని బాలయ్య ఫోటోలను 80స్ లోకి మార్చి సోషల్ మీడియాలో వైరల్ చేయగా.. అందులో బాలయ్య లుక్ అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది. సూటు బూటులో అంబాసిడర్ కారు వద్ద స్టైలిష్ గా నగర వీధుల్లో బాలయ్య ఫోటోలకు ఫోజులిస్తున్న తీరు అభిమానులను నాటి కాలంలోకి తీసుకెళ్లింది. ముఖ్యంగా నాన్న, బాబాయ్ కాలం నాటి లుక్కు వారికి మళ్ళీ పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తున్నట్లు అనిపిస్తోంది.

also read:స్టేజ్ పై గొడవపడ్డ కృష్ణ భగవాన్, యమునా?

బాలయ్య న్యూ లుక్ అదుర్స్..

Advertisement

మొత్తానికైతే దాదాలో బాలయ్యను 80స్ లోకి తీసుకెళ్లిన చాట్ జీపీటీకి బాలయ్య అభిమానులు ధన్యవాదాలు తెలుపుతున్నారు. ముఖ్యంగా బాలయ్య లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. మొత్తానికైతే ట్రెండు ని బాగా ఫాలో అవుతున్నారు అంటూ అభిమానులు చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ కాగా, బాలయ్య దాదా మూడ్ లో 80s లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

మీరు కూడా ట్రై చేయాలనుకుంటున్నారా?

ఇకపోతే 80s లుక్ లో మీరు ఉన్నట్టు, అప్పటి జ్ఞాపకాలను మళ్లీ నెమరు వేసుకోవాలనుకుంటే.. ఇలా ప్రాంప్ట్ ఇస్తే సరిపోతుంది. ప్రస్తుత ఫోటోతో పాటు.. “Transformers photo into a glamorous 1980s Indian film portrait” అని చాట్ జీపీటీ లో ప్రాంప్ట్ ఇస్తే.. నచ్చిన స్టైల్, బ్యాక్ గ్రౌండ్ మెన్షన్ చేసి ఫోటోలు క్రియేట్ చేసుకోవచ్చు. మీరు కూడా ఈ ట్రెండ్ ను ట్రై చేయాలనుకుంటే.. ఈ ప్రాంప్ట్ ఇస్తే సరిపోతుంది.

Related News

రణబాలి టీజర్ రిలీజ్..’సింగనమల బొబ్బిలి రణబాలి’గా విజయ్ దేవరకొండ

టాక్సిక్ డిజాస్టర్ టాక్.. యశ్ ఫస్ట్ రియాక్షన్ ..ఏమన్నారంటే?

ఆనంద్ దేవరకొండ ‘ఎపిక్’ స్టోరీ ఇదేనా?

సైలెంట్ గా నిశ్చితార్థం చేసుకున్న కాలభైరవ, కావ్య.. ఫొటో వైరల్!

ప్రశాంత్ నీల్ హర్రర్ మూవీని రిజెక్ట్ చేసిన CBFC? మరీ అంత డార్క?

సందీప్ రెడ్డి వంగకు విజయ్ కాస్ట్లీ గిఫ్ట్.. ఇది కదా ప్రేమంటే..

‘విశ్వంభర’ మూవీ మళ్లీ వాయిదా పడిందా..? మెగాస్టార్ ఫ్యాన్స్ షాక్..

Big Stories

Advertisement
×