Piracy crackdown: సినిమా ఇండస్ట్రీలో నిత్యం ఎన్నో కొత్త సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తుంటాయి అయితే ఒక సినిమాని విడుదల చేయాలి అంటే దర్శక నిర్మాతలు ఇతర నటీనటులు ఎంతలా కష్టపడతారో అందరికీ తెలిసిందే. మూడు గంటల పాటు తెరపై మనల్ని సందడి చేయటం వెనుక సంవత్సరాల కష్టం ఉంటుంది. ఇలా ఎంతో కష్టపడి సినిమా చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తే కొంతమంది మాత్రం అభివృద్ధి చెందిన టెక్నాలజీని ఉపయోగించుకొని సినిమాని లీక్(Movie Leak) చేస్తూ నిర్మాతలకు పెద్ద ఎత్తున నష్టాలను తీసుకువస్తున్నారు. ఇలా ఈ పైరసీలకు(Piracy) అడ్డుకట్ట వేయటం కోసం ఇండస్ట్రీ ఎంతో కృషి చేసినప్పటికీ ఎక్కడో చోట సినిమాలు మాత్రం లీక్ అవుతూ ఉన్నాయి.
సెల్ ఫోన్ లో రికార్డ్..
ఇలా కొత్త సినిమా థియేటర్లోకి వచ్చిందే ఆలస్యం హెచ్డి ప్రింట్ తో సహా ఆన్లైన్లో అందుబాటులోకి వస్తుంది. ఇలా సినిమాని ఇంట్లోనే కూర్చొని చూసే అవకాశం రావడంతో థియేటర్లకు వెళ్లే వారి సంఖ్య కూడా పూర్తిగా తగ్గిపోతుంది. తద్వారా నిర్మాతలకు కోట్లలో నష్టాలు వస్తున్నాయి. తాజాగా ఇలాంటి చర్యలకు పాల్పడే వ్యక్తిని సైబర్ క్రైమ్ పోలీసులు (Cyber crime police)అరెస్టు చేశారు. సినిమా పైరసీ కేసులో భాగంగా ఆంధ్రప్రదేశ్ కి చెందిన కిరణ్ (Kiran)అనే యువకుడిని సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిరణ్ గత ఆరు నెలలుగా సుమారు 65 పైగా సినిమాలను లీక్ చేసినట్టు సమాచారం.
ఇండస్ట్రీకి కోట్లలో నష్టాలు…
కిరణ్ సినిమా విడుదలైన రోజే థియేటర్ కు వెళ్లి తన ఫోన్లోనే సినిమా మొత్తం రికార్డు చేసి పలు సైట్లకు అమ్ముతూ భారీగా సొమ్ము చేసుకున్నారని పోలీసులు గుర్తించారు. ఈయన ఒక్క సినిమాని పైరసీ ద్వారా లీక్ చేస్తూ దాదాపు లక్ష రూపాయల వరకు సంపాదిస్తున్నారని తెలుస్తుంది. కిరణ్ ఇలా సినిమాలను లీక్ చేయడం వల్ల గత ఆరు నెలలలో తెలుగు, తమిళ సినిమా ఇండస్ట్రీలకు సుమారుగా రూ.3700 కోట్ల రూపాయల నష్టం జరిగినట్టు పోలీసులు గుర్తించారు. కిరణ్ ఇలా పైరసీలకు పాల్పడుతూ ఎక్కడ దొరకకుండా జాగ్రత్తలు పడినప్పటికీ ఇటీవల శ్రీ విష్ణు(Sri Vishnu) హీరోగా నటించిన సింగిల్ మూవీ(Single Movie) టైంలో దొరికిపోయారు.
కొత్త సినిమాలను పైరసీ చేస్తున్న యువకుడు అరెస్ట్
భారీ బడ్జెట్తో విడుదలైన సినిమాలని మొదటి రోజే పైరసీ చేస్తున్న కిరణ్కుమార్
ఏపీకి చెందిన కిరణ్కుమార్ ని అరెస్ట్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు
ఇప్పటి వరకు 65 సినిమాలను పైరసీ చేసినట్లు గుర్తింపు pic.twitter.com/W8bQ2FLDqG
— BIG TV Breaking News (@bigtvtelugu) July 3, 2025
ఇలా పైరసీలకు కిరణ్ పాల్పడుతున్నారని పోలీసులు పక్కా ఆధారాలతో సహా ఇతనిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం సైబర్ క్రైమ్ పోలీసుల అదుపులో ఉన్న ఈయనని పోలీసులు విచారణ చేస్తూ తన నుంచి పూర్తి సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. కిరణ్ మాత్రమే ఇలా చేస్తున్నారా? లేక దీని వెనుక ఇంకెవరి హస్తం ఉంది? ఏంటి అనే విషయాలు గురించి విచారణ చేస్తున్నారు. ఇలా సినిమాలను పైరసీ చేస్తూ అడ్డంగా దొరికిపోవడంతో ఈయనపై కఠినమైన చర్యలు తీసుకోవాలి అంటూ సినీ ప్రేమికులు డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో పాన్ ఇండియా సినిమాలను కూడా మొదటి రోజే పైరసీ చేయడమే కాకుండా ఏకంగా ఆర్టీసీ బస్సులలో కూడా ప్రసారం చేసిన సంఘటనలు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.
Also Read: Ramya Pasupuleti: కాబోయే భర్తలో ఈక్వాలిటీస్ ఉండాలి..నటి బంపర్ ఆఫర్ ..మీలో ఉన్నాయా?