Ramya Pasupuleti: సాధారణంగా ప్రతి ఒక్క అమ్మాయి లేదా అబ్బాయి జీవితంలో తమకు ఇలాంటి లక్షణాలు ఉన్న అమ్మాయి భార్యగా రావాలని, అబ్బాయి భర్తగా రావాలని కోరుకుంటారు. ఇక ఇటీవల కాలంలో అమ్మాయిల కోరికలకు అవదు లేకుండా పోయిందని చెప్పాలి. నెలకే లక్షల్లో ప్యాకేజీ కావాలి, మంచి కుర్రాడు, అందంగా ఉండాలి అంటూ ఇలా ఎన్నో కోరికలను కలిగి ఉంటున్నారు. అయితే హీరోయిన్లు మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉంటున్నారని చెప్పాలి. హీరోయిన్లు మాత్రం తమ జీవిత భాగస్వామి ఎలా ఉండాలో చాలా సింపుల్ గా చెప్పేస్తున్నారు. తాజాగా నటీ రమ్య పసుపులేటి (Ramya Pasupuleti)సైతం తనకు కాబోయే భర్తలో ఉండాల్సిన క్వాలిటీస్ బయటపెట్టారు.
కాబోయే భర్త ఇలాగే ఉండాలి?
రమ్య పసుపులేటి ప్రస్తుతం బిగ్ బాస్ కంటెస్టెంట్ గౌతం కృష్ణతో(Gautham Krishna) కలిసి సోలో బాయ్(Solo Boy) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా జులై 4వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను వేగంగా నిర్వహిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక కూడా జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా యాంకర్ నటి రమ్య పసుపులేటిని ప్రశ్నిస్తూ మీకు రాబోయే భర్తలో (future husband)ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు రమ్య ఆసక్తికరమైన సమాధానాలు తెలియజేశారు.
సంపాదన ముఖ్యం కాదు..
కాబోయే భర్త విషయంలో నాకైతే పెద్దగా కోరికలు ఏమీ లేవని తెలిపారు. మంచి అబ్బాయి నన్ను బాగా చూసుకుంటే చాలు, అలాగే ఆరడుగుల కంటే కూడా హైట్ ఉండాలి అంటూ ఈమె తనకు కాబోయే భర్తలో ఉండాల్సిన క్వాలిటీ తెలిపారు. ఇక మీరు పెళ్లి చేసుకోబోయే అబ్బాయి ఎంత సంపాదించాలి? అంటూ కూడా ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నకు రమ్య సంపాదన నాకు ముఖ్యం కాదని, నేను కూడా సంపాదిస్తాను కాబట్టి అది సమస్య కాదు అంటూ సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ఈమె తన కాబోయే భర్తలో ఉన్న క్వాలిటీస్ గురించి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఈ లక్షణాలు మాలో ఉన్నాయి…
ఇక ఈమె వ్యాఖ్యలపై నెటిజన్స్ విభిన్న రీతిలో స్పందిస్తున్నారు. మీరు చెప్పిన క్వాలిటీస్ అన్ని కూడా నాలో ఉన్నాయి అంటూ అబ్బాయిలు కామెంట్లు చేయటం గమనార్హం. ఈ కాలంలో కూడా ఇలాంటి ఆలోచనలు కలిగిన అమ్మాయిలు ఉన్నారా? అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఇక రమ్య పసుపులేటి విషయానికి వస్తే…. 2018లో విడుదలైన హుషారు సినిమాతో తన సినీ జీవితాన్ని ప్రారంభించి ‘మైల్స్ ఆఫ్ లవ్’, ‘ఫస్ట్ ర్యాంక్ రాజు’ ‘బీఎఫ్‌ఎఫ్’ వంటి సినిమాలలోను వెబ్ సిరీస్ లలోను నటించి ప్రేక్షకులను మెప్పించారు. చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమాలో కూడా కీలకపాత్రలో కనిపించబోతున్నారు. మరి జులై 4 వ తేదీ సోలో బాయ్ అంటూ రాబోతున్న ఈ ముద్దుగుమ్మ ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది.
Also Read: Shirsih Reddy : చిరంజీవి బ్లాక్ మెయిల్ చేసి సారీ చెప్పించాడు… శిరీష్‌కు AI ఝలక్