పాకిస్తాన్ లో హిందూ దేవాలయాల విధ్వంసం అందరికీ తెలిసిందే. ఇక పాకిస్తాన్ ఆర్మీకి హిందూ ఆలయాలు కనపడితే ధ్వంసం చేసేంత వరకు వారు ఆగరు. అలాంటి పాక్ ఆర్మీ ఒక్క ఆలయం పేరు చెబితే మాత్రం వణికిపోతుంది. అదే హింగ్లాత్ మాత ఆలయం. ఆ ఆలయం దగ్గరకు వెళ్లడానికి కూడా ఏ సైనికుడూ సాహసం చేయడు. గతంలో చాలామంది ఆ ప్రయత్నం చేసి ప్రాణాలు వదిలారు. అందుకే ఆ ఆలయం అంటే పాక్ సైనికులకు భయం. పాక్ ఆర్మీని వణికిస్తున్న హింగ్లాజ్ మాత ఆలయ విశేషాలు ఇప్పుడు చూద్దాం.
శక్తీపీఠం హింగ్లాజ్ ఆలయం..
పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో లారీ తహసీల్ లో హింగ్లాజ్ మాత ఆలయం ఉంది. మారుమూల పర్వత ప్రాంతంలో ఇరుకైన లోయలో ఈ గుడి ఉంటుంది. కరాచీకి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయం అరేబియా సముద్రానికి సమీపంలో ఉంటుంది. ఈ ప్రాంతం హింగోల్ నేషనల్ పార్క్ పరిధిలోకి వస్తుంది, ఆలయం పక్కనే హింగోల్ నది ప్రవహిస్తుంటుంది. హింగ్లాజ్ మాతని సతీదేవి ప్రతిరూపంగా భావిస్తారు. సతీదేవి అంటే పార్వతీ దేవి. ఆమె శరీర భాగాలు పడిన ప్రాంతాలను శక్తిపీఠాలుగా మనం ఆరాధిస్తుంటాం. అలాంటి 51 శక్తి పీఠాల్లో హింగ్లాజ్ ఆలయం కూడా ఒకటి. అయితే ఈ ఆలయం వైపు వెళ్లాలంటే పాకిస్తాన్ ఆర్మీ భయపడుతుంది. ఈ ప్రాంతాన్ని వారు 51 జోన్ గా పిలుస్తారు. సైనికుల నుంచి హింగ్లాజ్ మాత తన ఆలయాన్ని రక్షించుకుంటుందని స్థానికులు చెబుతుంటారు.
పాక్ ఆర్మీ హెచ్చరిక..
ఒకసారి ఆ ప్రాంతంలో గస్తీ కాస్తున్న పాక్ ఆర్మీ యూనిట్ ఆలయ సమీపానికి వెళ్లింది. వారి వాహనాల లైట్లు చెడిపోయాయి, అనుకోకుండా ఇసుక తుఫాను వచ్చి ఒక సైనికుడు కుప్పకూలిపోయాడు. తనకు తెలియకుండానే మంత్రాలు జపించడం మొదలు పెట్టాడు. ఆ తర్వాత పాక్ ఆర్మీ ఒక హెచ్చరిక జారీ చేసింది. ఆదేశాలు ఉంటే మాత్రమే ఆ ప్రాంతంలోకి వెళ్లాలని, లేకపోతే దూరంగా ఉండాలని హెచ్చరించింది. ఆ తర్వాత ఏ సైనికుడు కూడా హింగ్లాజ్ మాత ఆలయం సమీపంలోకి కూడా వెళ్లలేదు.
విష జ్వరంతో అధికారి దుర్మరణం..
మరో ఉదాహరణ ఇక్కడ పాక్ ఆర్మీ అధికారుల్ని మరింత భయాందోళనలకు గురిచేసింది. పాకిస్తాన్ ఆర్మీ అధికారి ఒకరు అక్కడికి వచ్చే యాత్రికులను ఎగతాళి చేసేవాడు, అంతే కాదు, మందిరాన్ని చూస్తూ వెటకారంగా నవ్వాడు. ఆ తర్వాత వారం రోజులకే అతడు విష జ్వరంతో మరణించాడు. ఆ ఘటన తర్వాత ఆలయ పూజారి సైనికులను హెచ్చరించాడు. అమ్మవారి భక్తుల్ని ఇబ్బంది పెడితే ఆమె చూస్తూ ఊరుకోదని చెప్పారు. ఆ తర్వాత సైనికులెవరూ ఆ ఆలయం వైపు చూడలేదు, అక్కడికి వెళ్లే భక్తుల్ని చూసి నవ్వలేదు.
Also Read: సంచుల నిండా డబ్బులు.. రూ.కోటి ఉన్నా ఒక్క బ్రెడ్ ముక్క కూడా కొనలేని దుస్థితి
ఆయుధాలకంటే బలమైన ఆలయం..
హింగ్లాజ్ యాత్రకోసం భారీగా భక్తులు వస్తుంటారు. ముస్లింలు కూడా ఈ ఆలయానికి రావడం విశేషం. స్థానిక ముస్లింలు ఈ ఆలయాన్ని “నాని ఆలయం” అని పిలుస్తారు. వారు హింగ్లాజ్ మాతను బీబీ నానీగా పిలుచుకుంటారు. ఆలయానికి రక్షణ కల్పిస్తారు. ఇక ఈ ఆలయానికి వచ్చే భక్తులకు పాక్ సైన్యం కూడా కొన్ని సందర్భాల్లో రక్షణగా ఉంటుంది. అయితే సైన్యం ఆలయ సరిహద్దుల్లోకి మాత్రం వెళ్లదు, తుపాకులు కూడా ఆవైపు తీసుకెళ్లదు. ఆ ఆలయం వారి ఆయుధాలకంటే బలమైనదనే నమ్మకం వారిలో ఉంది. పాకిస్తాన్ లో చాలా ఆలయాలు ధ్వంసమైనా హింగ్లాజ్ మాత ఆలయం మాత్రం అప్పట్నుంచి ఇప్పటి వరకు ఎవరి ఆక్రమణలకు గురికాలేదు. ఆలయాన్ని టచ్ చేయాలని చూసినవారంతా విచిత్ర పరిస్థితుల్లో చనిపోయారు. అప్పట్నుంచి హింగ్లాజ్ మాత అంటే పాక్ సైనికులకు భయం.