Football Player Death: ఫుట్ బాల్ ప్రపంచంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. లివర్ పూల్ జట్టు తరపున ఆడే ప్రఖ్యాత పోర్చుగీస్ ఫుట్ బాల్ ప్లేయర్ డియాగో జోట {28} { బుధవారం} రోజు కారు ప్రమాదంలో మృతి చెందారు. స్పెయిన్ లోని జమేరాలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో అతడి సోదరుడు ఆండ్రే ఫిలెపి {26} కూడా ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే.. మార్కా నివేదిక ప్రకారం సనాబ్రియాలోని జమేరా ప్రాంతానికి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది.
Also Read: Anaya Bangar: ప్రైవేట్ పార్ట్స్ కు సర్జరీ.. అక్కడ ప్లాస్టర్ వేయించుకొని మరి…!
పోర్చుగల్ లోని ఫెనాఫిల్ కి చెందిన డియోగో జోట, తన సోదరుడు ఆండ్రీ తో కలిసి ట్రావెల్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కారు ప్రమాదానికి గురైన వెంటనే ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆ మంటల ధాటికి చుట్టుపక్కల ప్రాంతం కూడా ఎఫెక్ట్ అయినట్టు స్థానికులు చెబుతున్నారు. జులై 3 న రాత్రి A-52 హైవేలో 65వ కిలోమీటర్ వద్ద వారు ప్రయాణిస్తున్న కారకు ప్రమాదం జరిగింది.
కారులో మంటలు చెలరేగడంతో అన్నదమ్ములు ఇద్దరు అక్కడికక్కడే మరణించినట్లు అధికారులు తెలిపారు. ఈ విషాద ఘటన ఫుట్ బాల్ ప్రేమికులను షాక్ కి గురిచేసింది. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న 1-1-2 జమేరా ట్రాఫిక్ పోలీసులు, జమేరా ప్రావీన్షియల్ కౌన్సిల్ అగ్నిమాపక దళం సాసిల్ ఎమర్జెన్సీ కో-ఆర్డినేషన్ సెంటర్ కి తెలియజేసింది. ఇక అక్కడి నుండి, మోంబుయ్ హెల్త్ సెంటర్ నుండి వెంటనే మెడికల్ ఎమర్జెన్సీ యూనిట్, ప్రైమరీ కేర్ మెడికల్ స్టాఫ్ ఘటనా స్థలానికి చేరుకున్నారు.
అనంతరం స్పాట్ లోనే ఇద్దరు వ్యక్తులు మరణించినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై పోర్చుగీస్ ఫుట్ బాల్ సమాఖ్య చీఫ్ పెట్రో ప్రోయేంకా స్పందించారు. ఈరోజు ఉదయం స్పెయిన్ లో డియోగో జోటా, అతడి సోదరుడు ఆండ్రీ మరణించారని తెలియజేశారు. ఇది పోర్చుగీస్ ఫుట్ బాల్ సమైక్య, మొత్తం పోర్చుగీస్ ఫుట్ బాల్ కి తీరని నష్టం అని అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. కాగా డియోగో సోదరుడు ఆండ్రీ కూడా ఫుట్ బాల్ క్రీడాకారుడే. ఈ ఇద్దరూ ఫుట్ బాల్ ఆటగాళ్ల మరణ వార్తను తెలుసుకున్న అభిమానులు సంతాపం తెలియజేస్తున్నారు.
Also Read: Hasin jahan on Shami: ఆ అమ్మాయితో అక్రమ సంబంధం… మహమ్మద్ షమీ ఆత్మహత్యాయత్నం !
మరోవైపు డియోగో జొటాకి కొద్ది రోజుల క్రితమే వివాహం జరిగింది. తన చిరకాల స్నేహితురాలు, ప్రేయసి రూటే కార్డేసో ను ఇటీవల వివాహం చేసుకున్నాడు. వివాహం జరిగి 15 రోజులు కూడా గడవకముందే అతడు మృత్యువాత పడడం గమనార్హం. డియోగో అద్భుతమైన ఆటగాడు. అతడు జాతీయ – ఏ జట్టుకు దాదాపు 50 కి పైగా ట్రోఫీలు అందించాడు. గతేడాది లివర్ పూల్ జట్టు ఫుట్ బాల్ ప్రీమియర్ లీగ్ గెలిచిన విషయం తెలిసిందే. ఈ జట్టులో జోటా సభ్యుడే. ఇతడు పోర్చుగల్ జాతీయ జట్టు తరపున కూడా ఆడాడు. పోర్చుగల్ యూఈఎఫ్ఏ టోర్నీ గెలుపొందడంలో జోటా కీలకపాత్ర పోషించాడు.