E-Paper
Advertisement

త్రివిక్రమ్ పై పూనమ్ కౌర్ మరో సంచలన పోస్ట్..!

త్రివిక్రమ్ పై పూనమ్ కౌర్ మరో సంచలన పోస్ట్..!
Advertisement

Poonam Kaur:మోడల్ గా కెరియర్ మొదలుపెట్టి.. 2005లో మిస్ ఆంధ్ర టైటిల్ ను గెలుచుకున్న పూనమ్.. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన మాయాజాలం సినిమాతో తొలిసారి తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈమె పుట్టింది హైదరాబాద్లోనే అయినా ప్రస్తుతం ముంబైలోనే సెటిల్ అయిపోయింది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రోజుకు ఒక పోస్ట్ తో సంచలనం సృష్టిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. ఈమధ్య కాలంలో త్రివిక్రమ్ ను ఇన్ డైరెక్ట్ గా కామెంట్లు చేస్తూ పోస్టు చేస్తున్న విషయం తెలిసిందే. ఒకానొక దశలో త్రివిక్రమ్ పై డైరెక్ట్గా విమర్శలు గుప్పించినా.. ఆయన మాత్రం స్పందించకపోవడం సోషల్ మీడియాలో పలు అనుమానాలకు దారితీస్తోంది.

త్రివిక్రమ్ పై డైరెక్ట్ కామెంట్ చేసిన పూనం..

గతంలో మా అసోసియేషన్లో త్రివిక్రమ్ పై ఫిర్యాదు చేసినా.. ఎవరు పట్టించుకోలేదంటూ ఆవేదన వ్యక్తం చేసినా
.. ఈమె ఇప్పుడు మరొకసారి మా అసోసియేషన్ ను ప్రశ్నించింది.. ఈ మేరకు తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక పోస్ట్ పెట్టింది. పూనమ్ కౌర్. “త్రివిక్రమ్ శ్రీనివాస్ నా కుటుంబం బలహీనతను ఆసరాగా చేసుకొని వారిచేత ఒక ప్రకటన ఇప్పించారు. ఆ ప్రకటనకు నేను కట్టుబడి లేను. రాజకీయ నాయకులు చేసిన వాటికి మేము జవాబు దారీ కాదు.. సమస్య వచ్చినప్పుడు అక్కడనుండి పారిపోయి తిరిగి వారికి అవసరమైనప్పుడు మమ్మల్ని వాడుకోవడం ఆయన చేసిన అత్యంత దుర్మార్గమమైన పని. దీనిని మా అసోసియేషన్ ఎందుకు ప్రశ్నించడం లేదు? ఇంకా ఎవరి కోసం ఎదురుచూస్తున్నారు.. మరింత మంది అమాయకుల జీవితాలు నాశనమయ్యే వరకు మీరు వేచి చూస్తారా?” అంటూ డైరెక్ట్ గానే పూనం స్టోరీలో రాసుకుంది.

Advertisement

తన కుటుంబాన్ని వాడుకున్నాడు అంటూ సంచలన కామెంట్లు..

ఇకపోతే ఇన్ని రోజులు త్రివిక్రమ్ పేరు ప్రస్తావించకుండా ఆయనను టార్గెట్గా చేసుకుంటూ పోస్టులు పెట్టిన ఈమె ఇప్పుడు డైరెక్ట్ గా త్రివిక్రమ్ పేరును బయటకు తీస్తూ పోస్ట్ పెట్టింది . తన కుటుంబం ఎదుర్కొన్న బలహీనత పరిస్థితులను ఆయన తనకు అనుకూలంగా మార్చుకొని, ఒక ప్రకటన ఇచ్చేలా ఒత్తిడి తెచ్చారని ఆరోపిస్తోంది. మరి ఆ ప్రకటన ఏంటి ? అసలు వారి కుటుంబం లో ఏర్పడిన బలహీన పరిస్థితులు ఏంటి? అనే విషయాలు మాత్రం బయటకు చెప్పలేదు. ఇకపోతే త్రివిక్రమ్ మా అసోసియేషన్ ను ఎందుకు ప్రశ్నించడం లేదు అంటూ ప్రశ్నిస్తున్న తీరుపై మా అధ్యక్షుడు మంచు విష్ణు ఏదైనా స్పందిస్తారేమో చూడాలి.

Advertisement

also read:పెళ్లి పీటలెక్కిన కావ్య శ్రీ.. ఇదెక్కడి ట్విస్ట్!

ఆదర్శం లేని గురూజీ..

ఇకపోతే గత రెండు రోజుల క్రితం పూనం మరో ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా ఏ మాత్రం ఆదర్శం లేని 100% పబ్లిసిటీ చేసుకునే డైరెక్టర్ భారీ నుండి నిర్మాతలను, నటీనటులను ఆ దేవుడే కాపాడాలి. మూఢనమ్మకాల ట్రాపింగ్ తోనే ఇతడు తన జీవితాన్ని గడుపుతుంటాడు.. ఏకే అనేది మరో నటుడి విషయంలో అజ్ఞాతవాసి లాంటిది అంతే అంటూ కూడా ఆమె పేర్కొంది . ఏది ఏమైనా పూనం త్రివిక్రమ్ పై చేస్తున్న ఆరోపణలు సోషల్ మీడియాలో పలు అనుమానాలకు దారితీస్తున్నాయి.

Related News

ఈ ఎడిటర్ కు ప్రొడ్యూసర్ కంటే బిల్డప్ ఎక్కువ.. మంచి సినిమాలను నాశనం చేస్తున్నాడుగా?

తెలుగింటి కోడలుగా అడుగు పెట్టబోతున్న నిధి అగర్వాల్.. అబ్బాయి ఎవరంటే?

వివేక్ ఆత్రేయ రవితేజ RT 78 టైటిల్ పై బిగ్ అప్డేట్!

రామాయణ నుండి బిగ్ అప్డేట్.. కైకేయి పాత్రలో స్టార్ హీరోయిన్!

నాగచైతన్య వర్సెస్ నితిన్.. బాక్సాఫీస్ వార్ లో గెలిచేదెవరు?

‘కామ్రేడ్ కళ్యాణ్’ పై ఫైర్ అవుతున్న మెగా ఫాన్స్.. ఆ డైలాగ్స్ కారణమా?

ఢిల్లీ హై కోర్టును ఆశ్రయించిన విజయ్ దేవరకొండ… వాటిని తొలగించాలంటూ!

Big Stories

Advertisement
×