E-Paper
Advertisement

రైలు క్యాన్సిల్ అయినా నో టెన్షన్.. టికెట్ డబ్బులు సింపుల్ గా ఇలా పొందవచ్చు!

రైలు క్యాన్సిల్ అయినా నో టెన్షన్.. టికెట్ డబ్బులు సింపుల్ గా ఇలా పొందవచ్చు!
Advertisement

Indian Railways Refund Rules: భారతీయ రైల్వేలో ప్రయాణించేందుకు ముందుగానే టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులకు కొన్నిసార్లు రైలు రద్దు కావడం వల్ల ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా అత్యవసర పనులపై ప్రయాణించేవారు రైలు రద్దయితే ఏం చేయాలి? టికెట్ డబ్బులు తిరిగి వస్తాయా? రీఫండ్ కోసం ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి? అనే డౌట్స్ ఉంటాయి. అయితే, రైల్వేశాఖ రైలును రద్దు చేసినప్పుడు రీఫండ్ పొందే అవకాశం ఉంటుంది. ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

రైలు రద్దయితే పూర్తి డబ్బులు తిరిగి వస్తాయా?

భారతీయ రైల్వే ఒక రైలును పూర్తిగా రద్దు చేసిన సందర్భంలో, అర్హత కలిగిన టికెట్లకు పూర్తి టికెట్ ధరను తిరిగి పొందే అవకాశం ఉంటుంది. సాధారణంగా క్యాన్సిలేషన్ ఛార్జీలు విధించరు. అయితే, టికెట్ బుకింగ్ విధానం ప్రకారం రీఫండ్ ప్రక్రియను అనుసరించాలి. కన్ఫర్మ్‌డ్ లేదంటే RAC ఇ-టికెట్లు ఉన్న ప్రయాణికులు రైల్వే శాఖే రైలును రద్దు చేసినప్పుడు సాధారణంగా ప్రత్యేకంగా టికెట్ క్యాన్సిల్ చేయాల్సిన అవసరం ఉండదు. అలాగే, TDR (Ticket Deposit Receipt) కూడా ఫైల్ చేయాల్సిన అవసరం ఉండదు. రీఫండ్ నిబంధనల ప్రకారం డబ్బులు తిరిగి చెల్లిస్తారు.

IRCTC ఇ-టికెట్లకు రీఫండ్ ఎలా వస్తుంది?

Advertisement

IRCTC వెబ్‌సైట్, యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకున్నవారికి రీఫండ్ సాధారణంగా ఆటోమేటిక్‌గా ప్రాసెస్ అవుతుంది. టికెట్ బుకింగ్ సమయంలో ఉపయోగించిన చెల్లింపు విధానంతో సంబంధిత  అకౌంట్ కు డబ్బులు తిరిగి జమ అవుతాయి. సాధారణంగా 3 నుంచి 7 వర్కింగ్ డేస్ లో రీఫండ్ అందే అవకాశం ఉన్నప్పటికీ, చెల్లింపు సంస్థ, బ్యాంకును బట్టి సమయం మారవచ్చు. రీఫండ్ అందిందో లేదో తెలుసుకోవడానికి ప్రయాణికులు IRCTC ఖాతాలోకి లాగిన్ కావాలి. అనంతరం ఇలా చూడాలి.

టికెట్ క్యాన్సిలేషన్ వివరాల కోసం: My Account → My Transactions → Ticket Cancellation History.

Advertisement

రీఫండ్ వివరాల కోసం: My Account → My Transactions → Ticket Refund History.

కౌంటర్ టికెట్లు తీసుకున్నవారు ఏం చేయాలి?

రైల్వే రిజర్వేషన్ కౌంటర్‌లో టికెట్ కొనుగోలు చేసిన ప్రయాణికులు రీఫండ్ కోసం కంప్యూటరైజ్డ్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (PRS) కౌంటర్‌ను సంప్రదించాలి. వారు టికెట్‌తో పాటు అవసరమైన వివరాలను తీసుకెళ్లి, రీఫండ్ ప్రక్రియను తెలుసుకోవాలి. చెల్లింపు విధానం, టికెట్ రకం, రైల్వే నిబంధనల ఆధారంగా ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి కౌంటర్ టికెట్ విషయంలో ఆలస్యం చేయకుండా సంబంధిత రైల్వే కౌంటర్‌ను సంప్రదించడం మంచిది.

Read Also: జస్ట్ రూ.70 వేలకే శ్రీలంక టూర్.. ఐఆర్‌సీటీసీ అదిరిపోయే ప్యాకేజీ వివరాలివే!

Tags

Related News

IRCTC సూపర్ టూర్ ప్యాకేజీ.. భాగ్యనగర అందాలతో పాటు శ్రీశైలం మల్లన్న దర్శనం కూడా!

జస్ట్ రూ.70 వేలకే శ్రీలంక టూర్.. ఐఆర్‌సీటీసీ అదిరిపోయే ప్యాకేజీ వివరాలివే!

రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. యాదాద్రిలో ఆగనున్న ప్రత్యేక రైళ్లు!

ఎయిర్‌పోర్ట్‌కు నరేంద్ర మోడీ పేరు..ఉత్తరప్రదేశ్ కేబినెట్ సంచలన నిర్ణయం!

రేపు 10 గంటలపాటు రైళ్లు బంద్, 57 మెట్రో స్టేషన్లు మూసివేత!

భయంకర పాము ఆకారంలో గుహ.. ఎక్కడుందో తెలుసా?

దసరా, దీపావళికి ఊరెళ్తున్నారా? తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రత్యేక రైళ్లు, ఎప్పటి నుంచంటే?

Big Stories

Advertisement
×