Vijayawada: విజయవాడలో ఇండియా బ్లాక్ పార్టీల ఛలో రాజ్‌భవన్ కార్యక్రామానికి పిలుపు ఇచ్చింది. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఇండీ కూటమి నేతలు బయటకు రాకుండా హౌస్ అరెస్టులు చేస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీనిపై సీఎం చంద్రబాబుకు ఎక్స్ వేదికగా పలు ప్రశ్నలు సంధించారు.
శనివారం విజయవాడలో ఇండియా బ్లాక్ పార్టీలు ఛలో రాజ్‌భవన్ కార్యక్రామానికి పిలుపు ఇచ్చాయి. శనివారం ఉదయం ఉదయం 10 గంటలకు లెనిన్ సెంటర్ నుంచి రాజ్‌భవన్ వరకు మార్చ్ నిర్వస్తామని ప్రకటించింది. పోలీసులు చలో రాజ్ భవన్‌కు అనుమతి లేదని అంటున్నారు. ఇతర ప్రాంతాల నుండి వామపక్ష, కాంగ్రెస్ నేతలు రాజ్ భవన్ వద్దకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో రాజ్‌భవన్ వద్ద ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.
నగరంలో ఎలాంటి ఉద్రిక్తలు చోటు చేసుకోకుండా ఉదయం 6 గంటల నుంచి విజయవాడలో కాంగ్రెస్ పార్టీ ఆఫీసు వద్ద భారీగా పోలీసుల మోహరించారు. ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా చేరుకున్నారు. ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల నివాసం వద్ద పోలీసులు చేరుకున్నారు. ఈ విషయం తెలియగానే వైఎస్ షర్మిల రియాక్ట్ అయ్యారు. గుడ్ మార్నింగ్ సీఎం చంద్రబాబు అంటూ పలు ప్రశ్నలు సంధించారు.
విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం, నగరంలోని పలు కూడళ్ల వద్ద, నా నివాసం బయట భారీగా పోలీసు బలగాలను మోహరించినట్లు నాకు సమాచారం వచ్చినట్టు తెలిపారు. ఇంత భారీగా పోలీసుల మోహరింపు ఎందుకంటూ నిలదీశారు. ప్రజాస్వామ్యంలో పోలీసు బలంతో కాదు.. ప్రజా బలంతో రాజకీయాలు అంటూ వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాన్ని చూసి ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు లేవనెత్తారు.
ALSO READ: టీడీపీ చేరిన నెల రోజులకే మజ్జి శ్రీనుకు బిగ్ టాస్క్.. స్థానిక సంస్థల ఎన్నికల్లో నిరూపించుకుంటే
మీరు నిద్రలేని రాత్రి గడపాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇదంతా బీజేపీకి సేవ చేయడానికేనా? దయచేసి ప్రశాంతంగా ఉండాలన్నారు. మేము ప్రజాస్వామ్యాన్ని నమ్ముతామని, భయపెట్టే పద్ధతులను కాదన్నారు. ప్రజల శక్తిని నమ్ముతాము, పోలీసుల శక్తిని కాదని రాసుకొచ్చారు. ప్రతిపక్షం పట్ల ప్రభుత్వం ఎక్కువ భయపడుతోందని, ప్రస్తుత పరిస్థితి అలా ఉందన్నారు. ముఖ్యమంత్రి గారూ.. అసలు నిద్రలేక ఆందోళన చెందుతోంది ఎవరని ప్రశ్నించారు.