Fauji Release:ప్రభాస్ సినిమా వస్తుందంటే చాలు ..ఆడియన్స్ లో ఉండే ఎగ్జైట్‌మెంటే వేరు. అది ఒక పోస్టర్ కావొచ్చు.ఒక చిన్న అప్‌డేట్ కావచ్చు .ఇలా వచ్చిందో లేదో నిమిషాల్లో వైరల్ అయిపోతుంది. అదీ మన రెబలోడి రేంజ్.అదిగో అంతటి హైప్ సొంతం చేసుకున్న సినిమా ఫౌజీ.హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాపై మొదటి రోజు నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా షూటింగ్ చివరి దశలో ఉందని, 90 శాతం పూర్తైందని, డిసెంబర్‌లో ప్రీమియర్లు కూడా ఉంటాయని వరుస వార్తలు రావడంతో సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి మరోసారి డిబేట్ మొదలైంది.
ఎన్నో సార్లు పోస్ట్ పోన్ చేసుకున్న రాజాసాబ్
అయితే ఇంతకు ముందు ఉన్నంత పాజిటివ్ గా ఫ్యాన్స్ రియాక్షన్స్ ఇవ్వకపోవడమే ఇక్కడ కాస్త ఆశ్చర్యం. ఎందుకంటే ప్రస్తుతం సినిమాలు ఇలా వస్తున్నామని అనౌన్స్ చేయడం,తీరా అబ్బే రాలేమంటూ పోస్ట్ పోన్ చేయడం కామన్ అయిపొయింది.పైగా గతేడాది పొంగల్ బరిలో దిగిన రాజాసాబ్ ఎన్ని సార్లు వాయిదాల పాట పాడిందో అంత ఈజీగా మర్చిపోలేము కూడా.దీంతో “అప్‌డేట్లు బాగానే ఉన్నాయి బాస్… కానీ సినిమా మాత్రం అనుకున్న టైమ్‌కే వస్తుందా?” అంటూ మరోసారి తమ అనుమానాలని బయటపెట్టేస్తున్నారు రెబల్ ఫ్యాన్స్.
ఇప్పటి వరకు చూస్తే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రభాస్ లుక్, గెటప్, పీరియాడిక్ సెటప్ చూసి అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు. హైదరాబాద్‌లో భారీ చార్మినార్ సెట్ వేయడం, కీలక సన్నివేశాలు అక్కడే చిత్రీకరిస్తుండటం కూడా సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. మేకర్స్ నుంచి వస్తున్న ప్రతి అప్‌డేట్ చూస్తుంటే సినిమా గ్రాండ్ స్కేల్‌లో తెరకెక్కుతోందనే విషయం అర్థమవుతోంది కూడా.
పోస్టర్లు కాదు బాస్… రిలీజ్ పోస్టర్ చూపించండి
కాని గత అనుభవాలని దృష్టిలో పెట్టుకొని “షూటింగ్ 90 శాతం అయిపోయిందంట… మిగతా 10 శాతం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పండి”, “పోస్టర్లు కాదు బాస్… రిలీజ్ పోస్టర్ చూపించండి”, “టీజర్ వచ్చాక మళ్లీ రిలీజ్ డేట్ మారదుగా?” అంటూ సోషల్ మీడియాలో తెగ సెటైర్స్ వేస్తున్నారు మూవీ లవర్స్
నిజానికి హను రాఘవపూడి తన సినిమాలను చక చక చుట్టేసే దర్శకుడు కాదు.ప్రతి ఫ్రేమ్‌పై ఎంత ప్రత్యేక శ్రద్ధ పెడతాడో సీతారామం లోనే చూశాం. ఈసారి ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్‌తో సినిమా చేస్తున్న నేపథ్యంలో మరింత కేర్ తీసుకుంటున్నారనే టాక్ ఉంది. అందుకే ఆలస్యం అయినా క్వాలిటీ తగ్గకూడదనే ఉద్దేశంతోనే షూటింగ్ జరుగుతోందని ఇండస్ట్రీ లో వినిపిస్తున్న మాట.
ఇక నిర్మాతలు కూడా డిసెంబర్ లో సినిమా ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేయాలని పనులని స్పీడప్ చేసినట్టు తెలుస్తుంది.ఇక వరల్డ్ వైడ్ గా ప్రీమియర్ షోలు నిర్వహించాలనే ప్లాన్ కూడా వేస్తున్నారట.ఇలా మేకర్స్ సినిమాని రిలీజ్ చేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అభిమానులు మాత్రం “ప్రీమియర్ సంగతి తర్వాత చూద్దాం … ముందు రిలీజ్ డేట్ మాత్రం ఫిక్స్ చేయండి అంటూ కామెంట్స్ వదులుతున్నారు.
ప్రభాస్ కి మదర్ గా జయప్రద?
సినిమా క్యాస్టింగ్ విషయానికి వస్తే ప్రభాస్ సరసన కొత్త హీరోయిన్ ఇమాన్వి నటిస్తున్న సంగతి తెల్సిందే.ఇక ఈ సినిమాలో ప్రభాస్ కి మదర్ గా జయప్రద నటిస్తుందన్న టాక్ కూడా వినిపిస్తుంది.ఇక విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని దేశభక్తి, ప్రేమ, యాక్షన్, ఎమోషన్ కలిసిన కథతో తెరకెక్కిస్తున్నాడట హను రాఘవపూడి.
also read :నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !
చూడాలి.. త్వరలో త్వరలో టీజర్, ఫస్ట్ సింగిల్ కూడా రానున్నాయని ప్రచారం జరుగుతోంది. అవి విడుదలైతే సినిమా హైప్ మరింత పెరగడం ఖాయం.మొత్తానికి ‘ఫౌజీ’పై అభిమానుల్లో నమ్మకం తగ్గలేదు… అంచనాలు కూడా తగ్గలేదు. కానీ ఇప్పుడు వాళ్ల ప్రశ్న ఒక్కటే …”అన్నీ బాగానే ఉన్నాయి… ఈసారి మాత్రం చెప్పిన డేట్‌కే సినిమా థియేటర్‌లో పడుతుందా లేదా ?