E-Paper
Advertisement

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?
Advertisement

Nano Banana AI: ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ ఇటీవల తమ Google Earth ప్లాట్‌ఫారమ్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన ఏఐ ఇమేజ్ జనరేషన్ ఫీచర్‌ను ప్రారంభించిన ఒక్క రోజులోనే తొలగించింది. Nano Banana 2 మోడల్‌తో పనిచేసే ఈ సాధనాన్ని వినియోగదారులు ఆయా ప్రాంతాల పాత రూపురేఖలను అంచనా వేయడానికి లేదా వృత్తిపరమైన విజువలైజేషన్ల కోసం ఉపయోగించుకోవచ్చని గూగుల్ భావించింది. అయితే యూజర్లు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే చిత్రాలను సృష్టించడం ప్రారంభించడంతో గూగుల్ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.

తప్పుదోవ పట్టించే చిత్రాల కలకలం..

ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన కొద్ది గంటల్లోనే కొందరు వినియోగదారులు నిజమైన ఉపగ్రహ చిత్రాలలా కనిపించేలా తప్పుడు విజువల్స్‌ను రూపొందించారు. నగరాలపై అణుదాడులు జరిగినట్లు, గూగుల్ కార్యాలయాల ఎదుట భారీ నిరసనలు జరుగుతున్నట్లు కల్పిత దృశ్యాలను తయారు చేసి సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇవి ఏఐ ద్వారా సృష్టించినవే అయినప్పటికీ.. అసలైన ప్రాంతాల పేర్లతో ముడిపడి ఉండటంతో ప్రజలను గందరగోళానికి గురిచేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమైంది.

Advertisement

Also Read: స్క్రీన్‌తో వస్తున్న Apple HomePod.. వాయిస్ కంట్రోల్‌కి గుడ్‌బై చెప్పాల్సిందేనా?

సంస్థకి తప్పని ఆందోళన:

ఈ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు గూగుల్ ముందే కొన్ని జాగ్రత్తలు తీసుకుంది. ప్రతి ఏఐ చిత్రానికి SynthID డిజిటల్ వాటర్‌మార్క్‌ను జత చేసింది. ప్రమాదకరమైన కంటెంట్‌ను నిరోధించే వ్యవస్థను కూడా ఏర్పాటు చేసింది. అయినప్పటికీ.. యూజర్లు ఆ పరిమితులను దాటుకుని తప్పుడు చిత్రాలను క్రియేట్ చేయడంతో, మరింత బలమైన భద్రతా ప్రమాణాలు అవసరమని గుర్తించి గూగుల్ ఈ టూల్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది.

నెటిజన్ల నుంచి వ్యతిరేకత:

Advertisement

ఈ ఏఐ చిత్రాలు సాధారణ Google Earth యూజర్లకు కనిపించవని గూగుల్ స్పష్టం చేసినప్పటికీ, సోషల్ మీడియాలో నిరసనలు తగ్గలేదు. భౌగోళిక నిఖార్సైన సమాచారానికి వేదికైన గూగుల్ ఎర్త్ వంటి సేవలలో ఏఐ పేరుతో తప్పుడు చిత్రాలకు చోటు ఇవ్వడం సరికాదని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ప్రతిచోటా ఏఐని రుద్దే ప్రయత్నం చేయడం కంటే, ఉన్న సేవల విశ్వసనీయతను కాపాడటం ముఖ్యమని పలువురు ప్రముఖులు కామెంట్ చేశారు.

విశ్వసనీయతకే గూగుల్ ప్రాధాన్యం:

Google Earth ప్రధాన బలం ఖచ్చితమైన సమాచారం, ఉపగ్రహ ఛాయాచిత్రాలు. కొత్త సాంకేతికతల కంటే వినియోగదారుల నమ్మకమే ముఖ్యమని గ్రహించిన కంపెనీ ఈ ఫీచర్‌ను ఉపసంహరించుకుంది. మరింత కఠినమైన భద్రతా ఫీచర్లను అభివృద్ధి చేసిన తర్వాత మాత్రమే దీనిని మళ్లీ అందుబాటులోకి తీసుకురావడంపై ఆలోచిస్తామని, ప్రస్తుతానికైతే ఎలాంటి గడువు విధించలేదని గూగుల్ వెల్లడించింది.

Also Read: 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీ.. HMD నుంచి 3 పవర్‌ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్!

Related News

బోస్ కొత్త ఇయర్‌బ‌డ్స్‌లో బిగ్ అప్‌గ్రేడ్.. మెరుగైన సౌండ్ నుంచి సినిమా మోడ్ వరకు

ఐఫోన్ డ్యుయో బదులు.. ఇవన్నీ కొనేయొచ్చు.. ఒక్కసారి ఈ లెక్క చూడండి!

లూనా బ్యాండ్ vs ఫిట్‌బిట్ ఎయిర్.. హెల్త్ ట్రాకింగ్‌లో దేని పనితీరు ఎలా ఉంటుందంటే?

PhonePe లేదా Google Payలో తప్పు నంబర్‌కు డబ్బు పంపారా? ఇలా చేస్తే తిరిగి పొందొచ్చు!

బడ్జెట్ ధరలో ఊహించని ఫీచర్లు..రూ.499లకే క్రేటోస్ పాప్ ఇయర్‌బడ్స్!

ఊరమాస్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారంటీ..కోడాక్ 43 ఇంచ్ స్మార్ట్ టీవీ అదిరిపోయే ఫీచర్లు ఇవే!

పాకెట్ సైజులో పవర్ బ్యాంక్..నాయిస్ నుంచి అదిరిపోయే మోడల్!

లాంగ్ రోడ్ ట్రిప్‌లో పెట్రోల్ ఖర్చులు తగ్గించాలనుకుంటే.. ఈ 5 గాడ్జెట్లు వెంట పెట్టుకోండి!

Big Stories

Advertisement
×