BigTV English

Jr.NTR: ఎమ్మెల్యే ఆడియో లీక్ చేసింది నేనే.. ఇప్పుడు ప్రాణ హాని – ఎన్టీఆర్ ఫ్యాన్

Jr.NTR: ఎమ్మెల్యే ఆడియో లీక్ చేసింది నేనే.. ఇప్పుడు ప్రాణ హాని – ఎన్టీఆర్ ఫ్యాన్

Jr.NTR:టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ (Jr .NTR)పై అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ (Daggubati Prasad) చేసిన వ్యాఖ్యలు రోజురోజుకు మరింత ముదురుతున్నాయి. నిన్న హైదరాబాదులో ఎన్టీఆర్ అభిమానులు ప్రెస్ మీట్ పెట్టి మరీ ఎమ్మెల్యే బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి అని డిమాండ్ చేశారు. అయితే ఇప్పుడు ఈ వివాదం మరో మలుపు తీసుకుంది.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ నేత అయిన గుత్త ధనుంజయ నాయుడి (Guttha Dhanunjay Naidu)కి ఎమ్మెల్యే నుండి బెదిరింపు కాల్స్ వస్తున్నాయట.. స్వయంగా ఆయన బిగ్ టీవీతో ఎక్స్ క్లూజివ్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.


ఎన్టీఆర్ అభిమానికి ఎమ్మెల్యే నుండి బెదిరింపు కాల్స్..?

ధనుంజయ నాయుడు మాట్లాడుతూ.. “ఎమ్మెల్యే దగ్గుపాటి  ప్రసాద్ నాతో మాట్లాడిన ఆడియోను నేనే లీక్ చేశాను. ఆ ఆడియో లీక్ చేయమని నాకు ఎవరూ డబ్బులు ఇవ్వలేదు. అలాగే ఆడియో ని లీక్ చేయకూడదని దగ్గుపాటి ప్రసాద్ కూడా డబ్బులు ఇవ్వలేదు. ఎవరి దగ్గర నేను డబ్బులు తీసుకోలేదు. నేను ఎన్టీఆర్ అభిమానిని. కానీ ఇప్పుడు దగ్గుపాటి ప్రసాద్ వర్గీయులు నా ఫ్యామిలీని బెదిరిస్తున్నారు. ఎన్టీఆర్ పై ఆయన మాట్లాడిన ఆడియో కాల్ ఫేక్ అని, నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలని అంటున్నారు. అటు నా భార్యకి, అన్నకి ఫోన్లు చేసి బెదిరించడమే కాకుండా చంపేస్తామని బెదిరిస్తున్నారు. నాకు ఎమ్మెల్యే దగ్గుపాటితో ప్రాణ హాని ఉంది. పార్టీ కోసం పనిచేసి జైలుకు వెళ్లిన వాడిని నేను.. 24 కేసులు గత ప్రభుత్వం నాపై పెట్టింది. ఎన్టీఆర్ తల్లి పట్ల ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము.


ఎమ్మెల్యే నుండి నాకు ప్రాణహాని ఉంది – ధనుంజయ నాయుడు

అనంతపురంలో ఎన్టీఆర్ కి ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. ఎన్టీఆర్ తల్లి అనే కాదు.. ఎవరి తల్లినైనా ఇలా మాట్లాడడం తప్పు కదా.. పార్టీ అధిష్టానం ఎమ్మెల్యే ప్రసాద్ పై చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణ చెప్పకపోతే కార్యాచరణ సిద్ధం చేస్తాము. నాకు ఎమ్మెల్యే నుండి రక్షణ కావాలి. అధిష్ఠానం పిలుపునిస్తే వెళ్లడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను” అంటూ ధనుంజయ నాయుడు తెలిపారు. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మొత్తానికి అయితే ఎన్టీఆర్ అభిమానిపై ఎమ్మెల్యే బెదిరింపు ఫోన్ కాల్స్ సంచలనంగా మారాయి.

అసలేం జరిగిందంటే..?

ఎన్టీఆర్ బాలీవుడ్ రంగ ప్రవేశం చేస్తూ చేసిన చిత్రం వార్ 2 (War 2) . ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాదులో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్.. తెలుగు ఫాన్స్ నేత గుత్తా ధనుంజయ నాయుడుకి మధ్య జరిగిన సంభాషణ వెలుగులోకి వచ్చింది. అనుమతులతో సినిమా ఆడిస్తున్నారా? లేదా? అని అతడిని ఎమ్మెల్యే ప్రశ్నించారు. అందులో భాగంగానే ప్రసాద్ మాట్లాడుతూ.. “నేను అనంతపురం ఎమ్మెల్యేను.. సినిమా ఆడదు అంటూ చేసిన వ్యాఖ్యలు నెట్టింట ఒక్కసారిగా ట్రెండింగ్ లోకి వచ్చాయి. అంతేకాదు ఎన్టీఆర్ పై బూతులు తిడుతూ రెచ్చిపోయారు”.

అది ఫేక్ వీడియో – ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్..

తర్వాత దగ్గుపాటి ప్రసాద్.. ఆ ఆడియో కాల్స్ నావి కాదు.. రాజకీయ కుట్రలో భాగంగా ఇలా ప్రచారం చేస్తున్నారు. నేను మొదటి నుండి నందమూరి కుటుంబానికి అభిమానిని.. నా ప్రమేయం లేకున్నప్పటికీ ఇందులో నా పేరు ప్రస్తావించారు. కాబట్టే క్షమాపణలు చెబుతున్నాను. నేను నారా, నందమూరి కుటుంబాలకు ఎప్పటికీ విధేయుడిని అంటూ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఒక వీడియో రిలీజ్ చేశారు.

ఎమ్మెల్యేను పార్టీ నుంచి బహిష్కరించాలి – ఎన్టీఆర్ ఫ్యాన్స్

ఎమ్మెల్యే నాలుగు గోడల మధ్య క్షమాపణలు చెబితే సరిపోదని తమకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఎన్టీఆర్ తల్లిపై ఇలాంటి మాటలు మాట్లాడిన దగ్గుపాటి ప్రసాద్‌ను టీడీపీ నుంచి బహిష్కరించాలని ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.

ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ పై సీఎం ఫైర్..

ప్రస్తుతం ఈ విషయం గత నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) సీరియస్ అయ్యారట. సీఎం చంద్రబాబుతో భేటీ అయిన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్.. జూనియర్ ఎన్టీఆర్ పై తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చేందుకు ప్రయత్నం చేశారట.

“మీ వ్యాఖ్యలు, తీరు ఏమాత్రం సరికాదు” అంటూ సీఎం ఫైర్ అయినట్లు తెలుస్తోంది.. ఇక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లాను కలిసి వివరణ ఇవ్వాలి అని, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కి ఆదేశాలు జారీ చేశారట. మరొకవైపు అనంతపురం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి నియోజకవర్గంలోని తాజా పరిణామాలను పల్లా శ్రీనివాసురావును కలిసి వివరించగా రేపు లేదా ఎల్లుండి పల్లా శ్రీనివాసురావును ఎమ్మెల్యే దగ్గుపాటి కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ALSO READ:Chiranjeevi : చిరు బర్త్‌డే ట్రీట్… యంగ్ డైరెక్టర్‌తో మరో సినిమా.. రేపే అనౌన్స్‌మెంట్

Related News

Andhra King Taluka: రిలీజ్ డేట్ ఫిక్స్, హే రామ్ ఒక్క హిట్ ప్లీజ్

Chiranjeevi: చిరంజీవి గొప్ప మనసు.. ఆ హీరో అప్పులు తీర్చేసిన మెగాస్టార్‌..

Prabhas: మహాభారతంలోని పాత్రతో ప్రభాస్ మూవీ… డార్లింగ్‌కు సరిగ్గా సెట్!

Chiranjeevi : చిరు బర్త్‌డే ట్రీట్… యంగ్ డైరెక్టర్‌తో మరో సినిమా.. రేపే అనౌన్స్‌మెంట్

Akhanda 2 Postponed: ఆ రూమర్సే నిజమయ్యాయి… అఖండ 2 వాయిదా, కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే!

Big Stories

×