BigTV English

Actor Prakash : ఛీ ఛీ నా బాత్రూంలో అలా చేశారు… కన్నడ నిర్మాతలపై ‘సాహో’ నటుడు తీవ్ర ఆరోపణలు..

Actor Prakash : ఛీ ఛీ నా బాత్రూంలో అలా చేశారు… కన్నడ నిర్మాతలపై ‘సాహో’ నటుడు తీవ్ర ఆరోపణలు..

Actor Prakash : కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన నటీనటులు ఆ ఇండస్ట్రీ పై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవల చాలా మంది ఆ ఇండస్ట్రీ వల్ల నష్టపోయమని, మంచి గుర్తింపు రాలేదని ఇంటర్వ్యూ లలో బయట పెడుతున్నారు. ఇప్పుడు మరో నటుడు కన్నడ ఇండస్ట్రీ పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఆయన ఎవరో కాదు. ప్రముఖ నటుడు ప్రకాష్ బెలవాడి.. ఈయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో భాగంగా కన్నడ నిర్మాతల పై ఆరోపణలు చేశారు.. ఆ ఇంటర్వ్యూలో ఆయన ఏమన్నారో చూద్దాం..


కన్నడ నిర్మాతల పై నటుడు ఆరోపణలు..

కన్నడ నటుడు ప్రకాష్ థియేటర్ టీచర్ అయిన ప్రకాష్.. నటుడిగానూ సత్తా చాటారు. ‘సాహో’ సినిమాలో షిండే అనే కీలక పాత్రతో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. హిందీలో ఆయన అనేక చిత్రాల్లో నటించి మెప్పించారు. అలాంటి నటుడు తన సొంత ఫిలిం ఇండస్ట్రీ మీద ఇప్పుడు ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారింది. ఆయన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కన్నడ ఇండస్ట్రీ వెనుకబడిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన కన్నడలో ఓ పెద్ద బ్యానర్లో నటించిన సినిమా షూటింగ్ సందర్బంగా ఎదురైన చేదు అనుభవాన్ని ప్రకాష్ బెలవాడి గుర్తు చేసుకున్నారు.. అది నేను ఎప్పటికి మర్చిపోలేను అని అన్నారు. ఆ సినిమాకి రెమ్యూనరేషన్ ని అడిగినంత ఇస్తామని ఒప్పుకున్నారు. అయితే నాలుగు ఇన్స్టాల్మెంట్లలో ఇస్తామని అన్నారు. అయితే మూడు చెల్లించారు కానీ నాలుగోది పెండింగ్ పెట్టారని అన్నారు.


Also Read:ఇదేం ట్విస్ట్ విష్ణు అన్నా.. ఓటీటీలోకి వస్తుందా? రాదా..?

కారవాన్లో అలా చేసి ఇబ్బంది పెట్టారు..

డబ్బులు మాత్రమే కాదు నన్ను బాగా ఇబ్బంది పెట్టారు. చివరి రోజు చిత్రీకరణ సందర్భంగా తన కారవాన్లోకి వచ్చిన ప్రొడక్షన్ హౌస్ వ్యక్తులు కొందరు టాయిలెట్లో కి వెళ్లి నీళ్లు మొత్తం ఖాళీ చేశారు. అంతేకాదు కారవాన్లో మొత్తం నీటిని పోసేశారు. నాకు ఎక్కడ ఉండలేక బయట ఎండలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ సంస్థ పేరు తాను చెప్పలేనని.. ఎందుకంటే వాళ్లంటే తనకు భయమని ప్రకాష్ బెలవాడి తెలిపారు. మళ్లీ ఆ బ్యానర్ లో సినిమా చేయమంటే, రోజుకు పది లక్షలు ఇస్తానన్నా తాను నటించనని ప్రకాష్ తెలిపాడు.. ఇదొక్కటే కాదు ఇలా అన్ని నిర్మాణ సంస్థల్లో అలానే జరుగుతుంది. దాదాపు కన్నడ ఇండస్ట్రీ పరిస్థితి అలానే ఉంది.నటించనని ప్రకాష్ తెలిపాడు. ఈ బ్యానర్ అనే కాదని.. మొత్తంగా కన్నడ ఇండస్ట్రీలో పరిస్థితి బాగా లేదని.. వాళ్లకు ఆర్టిస్టులు, టెక్నీషియన్లను గౌరవించడం తెలియదని ప్రకాష్ తెలిపారు.. వేరే ఇండస్ట్రీ లో మాత్రం నటులను గౌరవిస్తున్నారు అంటూ ఆయన ఇంటర్వ్యూ లో అన్నారు. ప్రస్తుతం ఆయన ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై కన్నడ ఇండస్ట్రీ ఎలా స్పందిస్తారో చూడాలి..

Related News

Mahavathar Narasimha : ఈ వీకెండ్ కూడా యానిమేషన్ మూవీదే హవా.. అక్కడ కూలిపోయిన ‘కూలీ’..

Mass Jathara : మాస్ జాతర టీం కు లీగల్ నోటీసులు, నిర్మాత వంశీకి దెబ్బ మీద దెబ్బ

Sreeleela: శ్రీలీలా హీరోయిన్ అవ్వడం వెనక ఎన్టీఆర్, బిగ్గెస్ట్ ట్విస్ట్ రివీల్ చేసిన శ్రీలీలా మదర్

Nithiin: పాపం నితిన్… హిట్ కోసం మళ్ళీ ఆ దర్శకుడును నమ్ముకుంటున్నాడు

Nara Rohit: పొలిటికల్ ఎంట్రీపై హీరో క్లారిటీ.. ఆ అపోహలకు చెక్!

Priyanka Chopra: బాలీవుడ్ పై గ్లోబల్ బ్యూటీ అసహనం.. ఆ మార్పు రావాలంటూ?

Big Stories

×