E-Paper
Advertisement

Kannappa OTT: ఇదేం ట్విస్ట్ విష్ణు అన్నా.. ఓటీటీలోకి వస్తుందా? రాదా..?

Kannappa OTT: ఇదేం ట్విస్ట్ విష్ణు అన్నా.. ఓటీటీలోకి వస్తుందా? రాదా..?
Advertisement

Kannappa OTT: టాలీవుడ్ హీరో మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా భావించి, గత కొన్ని ఏళ్లుగా కష్టపడి తెరకెక్కించిన సినిమా కన్నప్ప.. ఈ మూవీ తాజాగా జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అయింది.. భారీ అంచనాలతో వచ్చేసిన మూవీ ప్రస్తుత్తానికి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. దీన్ని చూసిన ప్రతీ ఒక్కరు సెకండ్ హాఫ్ గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎక్కడా ఒక్క రూపాయికి కూడా అమ్ముడుపోలేదు. డిజిటల్ రైట్స్, ఆడియో రైట్స్, సాటిలైట్ రైట్స్ ని కూడా మంచు విష్ణు అమ్మలేదు. ఈ మూవీ ఓటీటీ గురించి తాజాగా ఓ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది.

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకే…

Advertisement

ఇటీవల రిలీజ్ అవుతున్న పెద్ద హీరోల సినిమాలు ముందుగా ఓటీటీ రైట్స్ ని భారీ అమ్మిన తర్వాతే థియేటర్లలోకి సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. ఒకవేళ ఓటీటీ డీల్ లాక్ అవ్వకపోతే నెలల తరబడి విడుదలకు నోచుకోవడం లేదు. అంతటి ప్రాధాన్యం ఉన్న ఓటీటీ ని మంచు విష్ణు తాను కోరిన రేట్ ని ఇవ్వలేదని ఓటీటీ డీల్ ని లాక్ చేయకుండానే విడుదల చేసాడు. ఆయన సినిమా పై కాన్ఫిడెంట్ ఉందని అందుకే ఆ ధర అడిగినట్లు గతంలో అనేక ఇంటర్వ్యూలలో బయట పెట్టాడు.. ఇకపోతే ఈ సినిమా ఓటీటీ రైట్స్ ని ఆయన అమెజాన్ ప్రైమ్ సంస్థ కే అమ్మబోతున్నట్టు గత కొద్ది రోజులుగా ఫిలిం నగర్లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ చిత్రాన్ని థియేటర్స్ లో విడుదలైన 8 వారాల తర్వాత మాత్రమే ఓటీటీ లో విడుదల చేస్తారట. నిన్న సినిమా రిలీజ్ అయ్యి మంచి టాక్ ని సొంతం చేసుకున్న కూడా ఓటిటి పార్ట్నర్ గురించి మంచు విష్ణు అనౌన్స్ చెయ్యలేదు.. దీంతో నెట్టింట గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై ఆయన ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి..

Also Read : విజ్జుకు మాట ఇచ్చిన రష్మిక… వీళ్ల ప్రేమ ఎక్కడికో వెళ్లిపోయింది భయ్యా

Advertisement

కన్నప్ప ఫస్ట్ డే కలెక్షన్స్.. 

ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో మంచు విష్ణు సరసన ప్రీతి ముకుందన్ హీరోయిన్‌గా నటించారు. మోహన్ బాబు, శరత్ కుమార్, మధు, ముఖేష్ రిషి, మోహన్‌లాల్ , ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో కీలకపాత్ర పోషించారు. అవా ఎంటర్‌టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై డాక్టర్ మంచు మోహన్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు.. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి కన్నప్ప సినిమాకు దాదాపు రూ.120 కోట్ల నిర్మాణ వ్యయం అయినట్లు సమాచారం.. ఈ మూవీని పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేశారు. దాదాపుగా రూ. 180 కోట్ల టార్గెట్ తో థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ఫస్ట్ డే కేవలం ప్రపంచవ్యాప్తంగా 13 కోట్లు వసూల్ చేసిందని టాక్.. ఈ వీకెండు కలెక్షన్స్ మరికాస్త పెరుగుతాయేమో చూడాలి…

Related News

ఆ ఒక్క రహస్యం బయటపడితే జీవితం నాశనమే… 7.7 రేటింగ్ ఉన్న గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్

హాట్ సీన్స్, లవ్ అండ్ ట్విస్టుల రచ్చ… యూత్‌కి పూనకాలు తెప్పించే బోల్డ్ డ్రామా సిరీస్

చావు అంచుల దాకా తీసుకెళ్లే ప్రమాదకర మిషన్… 1000 కోట్ల భారీ బడ్జెట్ సై-ఫై యాక్షన్ అడ్వెంచర్

కొండల మధ్య అనుమానాస్పద హత్యలు… సీట్ ఎడ్జ్ మిస్టరీ థ్రిల్లర్

19వ శతాబ్దపు ఘాటు ప్రేమ… దారుణమైన పగ… సస్పెన్స్ అండ్ ఎమోషన్‌తో నిండిన పీరియడ్ డ్రామా

9/11 దాడి వెనుక ఉన్న షాకింగ్ నిజాలు బయట పెట్టిన మైండ్ బ్లోయింగ్ సిరీస్

3500 కోట్ల కలెక్షన్లు సాధించిన విజువల్ వండర్… జియోహాట్‌స్టార్‌లో ల్యాండ్ అయిన బిగ్గెస్ట్ సై-ఫై విజువల్ వండర్

ప్రాణాలు దక్కాలంటే పరుగెత్తాల్సిందే… ట్విస్టులతో ఊపిరాడకుండా చేస్తున్న ఇంగ్లీష్ సైకలాజికల్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×