E-Paper
Advertisement

ఇవేం డ్రామాలు ప్రకాశ్ రాజ్? అసలు నిజం చెప్పేసిన ఈసీ, కారణం ఇదేనట!

ఇవేం డ్రామాలు ప్రకాశ్ రాజ్? అసలు నిజం చెప్పేసిన ఈసీ, కారణం ఇదేనట!
Advertisement

Prakash Raj:“నా ఓటు పోయింది బాబోయ్” అంటూ ప్రకాశ్ రాజ్ తెగ హడావిడి చేశారు. అసలు తాను పుట్టి పెరిగిన ఊర్లోనే తన ఓటు లేకపోవడం ఏంటంటూ ప్రశ్నించారు. అయితే తాజాగా ప్రకాశ్ రాజ్ ఓటు ఎలా మిస్ అయ్యిందో ఎన్నికల అధికారులు క్లారిటీ ఇచ్చారు.

ఓటు కనిపించకపోవడంతో ప్రకాశ్ రాజ్ ఫైర్

విషయంలోకి వెళ్తే.. తన ఓటు బెంగళూరులోని నియోజకవర్గంలో ఉండేదని, కానీ ఇప్పుడు ఓటర్ల జాబితాలో తన పేరు కనిపించడం లేదని ప్రకాశ్ రాజ్ సోషల్ మీడియా ద్వారా ఫైర్ అయ్యారు.

Advertisement

అసలు తాను పుట్టి పెరిగిన ప్రాంతంలోనే తన ఓటు తొలగించడం ఏంటని ప్రశ్నించారు. అంతేకాదు.. ఇది చాలా పెద్ద జోక్ అంటూ సెటైర్ కూడా వేశారు. తన ఓటు ఒక్కటే కాదని.. భారీ సంఖ్యలో ఓటర్ల పేర్లు కూడా లిస్ట్ నుంచి కనిపించకుండా పోయాయని ఆయన ఆరోపించారు.

“నా ఓటు తొలగించారు.. పోరాడతా!”

అలా అని ఈ విషయం ఇక్కడితో ఆగలేదండోయ్.. “నా ఓటును తొలగించారు. ఖచ్చితంగా దీనిపై పోరాడతా” అంటూ ప్రకాశ్ రాజ్ మాట్లాడటంతో ఈ అంశం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.

ప్రకాశ్ రాజ్‌కు ఈసీ గట్టి కౌంటర్

Advertisement

అయితే ఎన్నికల అధికారులు మాత్రం ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఆయన ఓటును ఎవరో కూర్చొని ఏకపక్షంగా తొలగించలేదని స్పష్టం చేశారు.ఓటర్ల జాబితా సవరణలో భాగంగా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసినప్పుడు.. ప్రకాశ్ రాజ్ తన పాత చిరునామాలో చాలా కాలంగా ఉండటం లేదని గుర్తించారట.

నాలుగేళ్ల క్రితమే అడ్రస్ మారిందట!

దాదాపు నాలుగేళ్ల క్రితమే ప్రకాశ్ రాజ్ ఆ చిరునామా నుంచి మరో ప్రాంతానికి వెళ్లిపోయినట్టు అధికారులు చెబుతున్నారు.

అధికారులు అడ్రస్ గురించి పరిశీలన చేసిన సమయంలో తాను ప్రస్తుతం వేరే చోట ఉంటున్న విషయాన్ని ప్రకాశ్ రాజ్ కూడా అంగీకరించారని ఎన్నికల శాఖ తెలిపింది. దీంతో పాత చిరునామాలో ఉన్న ఓటును అలాగే కొనసాగించడం సాధ్యం కాదని అధికారులు చెబుతున్నారు.

“ఓటు తీసేయలేదు.. పాత అడ్రస్ నుంచి తొలగించాం”

అంటే.. “ఓటు తీసేశారు” అని ప్రకాశ్ రాజ్ చెబుతుంటే.. “మీరు అక్కడ ఉండటం లేదు కాబట్టే పాత చిరునామా నుంచి పేరు తొలగించాం” అనేది ఈసీ వెర్షన్.అంటే ఓటు హక్కే తీసేశామని కాదు.. పాత అడ్రస్‌లో ఉన్న ఓటు ఎంట్రీని తొలగించామని అధికారులు చెబుతున్నారన్నమాట.

కొత్త అడ్రస్‌లో ఓటు నమోదు చేసుకోవచ్చు

ప్రస్తుతం వేరే చిరునామాలో ఉంటున్నట్లయితే అక్కడ ఓటు నమోదు చేసుకోవచ్చని కూడా ఈసీ క్లారిటీ ఇచ్చింది.ఇందుకోసం ఫారమ్-6 ద్వారా కొత్త చిరునామాలో ఓటును నమోదు చేసుకునే అవకాశం ఉందని తెలిపింది. దీంతో సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రకాశ్ రాజ్‌కు మార్గం కూడా ఉందని అధికారులు చెబుతున్నారు.

“ఇవేం డ్రామాలు?”.. నెటిజన్ల ట్రోలింగ్

మొత్తానికి ప్రకాశ్ రాజ్ అక్కడ ఉండకపోవడం వల్లే ఈసీ పాత చిరునామా నుంచి ఓటును తొలగించిందన్న క్లారిటీ రావడంతో నెటిజన్లు చెడుగుడు ఆడేస్తున్నారు.“అసలు తప్పు నీ దగ్గర పెట్టుకొని ఇవేం డ్రామాలు ప్రకాశ్?” అంటూ నెట్టింట్లో ఏకి పారేస్తున్నారు.

ప్రకాశ్ రాజ్ వర్సెస్ ఈసీ

ఏది ఏమైనా బెంగళూరులో ప్రకాశ్ రాజ్ ఓటు కనిపించకుండా పోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.తన ఓటును ఎలాంటి కారణం లేకుండా ఓటర్ల లిస్ట్ నుంచి తీసేశారంటూ ప్రకాశ్ రాజ్ మండిపడగా.. ఎన్నికల కమిషన్ మాత్రం అసలు విషయం వేరే ఉందంటూ క్లారిటీ ఇచ్చింది.

also read:నాగవంశీ ఓవర్ కాన్ఫిడెన్స్.. ఇంత హైప్ అవసరమా బాబోయ్!

దీంతో ప్రకాశ్ రాజ్ వర్సెస్ ఈసీ అన్నట్టుగా తయారైపోయింది. చూడాలి మరి ముందు ముందు ఈ వ్యవహారం ఎటు వైపు దారితీస్తుందో!

Tags

Related News

చిన్న సినిమాలను తొక్కిపెడితే ఊరుకోం: హీరో షిరాజ్ మెహదీ ఆగ్రహం..

గంగా హాస్పిటల్ డాక్టర్స్ కు రామ్ చరణ్ కృతజ్ఞతలు..!

150 ఏళ్ల నాటి నిజ జీవిత కథ..రణబాలి ఫస్ట్ సిరీస్ డాక్యుమెంటరీ రిలీజ్!

వ్యక్తిత్వాన్ని కోల్పోకూడదు..బలవంతపు ప్రేమ అక్కర్లేదు.. రాశి ఖన్నా

పెళ్లి పై ఓపెన్ అయిన అంజలి..అంత ఆత్రుత ఎందుకో అంటూ?

కంప్లైంట్ చేసింది భక్తిపై కాదు.. అల్లు శిరీష్ పోస్ట్ వైరల్!

అమ్మ ఉన్నది అన్నం పెట్టడానికి.. అడుక్కోవడానికి కాదు..మదర్ సెంటిమెంట్ తో ‘స్లమ్ డాగ్ ‘ గ్లింప్స్!

రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు.. బయటపడ్డ నమ్మలేని నిజాలు!

Big Stories

Advertisement
×