E-Paper
Advertisement

ఇచ్చిన మాట నిజం చేసిన హీరో శ్రీకాంత్.. చీఫ్ గెస్ట్ ఎవరంటే?

ఇచ్చిన మాట నిజం చేసిన హీరో శ్రీకాంత్.. చీఫ్ గెస్ట్ ఎవరంటే?
Advertisement

Hero Srikanth: ప్రముఖ టాలీవుడ్ హీరో శ్రీకాంత్ (Srikanth) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న శ్రీకాంత్ ఆ తర్వాత కొంతకాలం ఇండస్ట్రీకి దూరమై.. ఇప్పుడు మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన విషయం తెలిసిందే. సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్ పాత్రలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈయన ఇటీవల మరో సినిమాతో ఫ్యామిలీ హీరోగా మళ్లీ ప్రేక్షకులను అలరించారు. అలా ఒకవైపు వరుస సినిమాలలో నటిస్తూనే.. మరొకవైపు బుల్లితెర షోలలో కూడా సందడి చేస్తున్నారు.

మాట నిలబెట్టుకున్న హీరో శ్రీకాంత్..

ఈ క్రమంలోనే తాజాగా ఆయన ఇచ్చిన మాటను నెరవేర్చుకుంటూ తన భార్యను షోకి తీసుకొచ్చారు.. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.. తాజాగా డ్రామా జూనియర్స్ ఫైనల్ ఎపిసోడ్ ప్రోమోని నిర్వాహకులు విడుదల చేశారు. ఇందులో శ్రీకాంత్ భార్య ఊహ (ooha ) కనిపించడంతో అందరూ సంతోషంతో పాటు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రోమోలో విజేత ఎవరో ఊహ చేతుల మీదుగా ప్రకటించబోతున్నట్లు చూపించడంతో పాటూ.. విజేతను ఊహ చేతులమీదుగా ప్రకటిస్తూ.. ట్రోఫీని కూడా ఆమె చేతులుగానే ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.. ఇక తాజాగా విడుదల చేసిన ప్రోమో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఇది చూసిన నెటిజన్స్ హీరో శ్రీకాంత్ ఇచ్చిన మాట నెరవేర్చారు అంటూ కామెంట్లో చేస్తున్నారు.

లేటెస్ట్ ప్రోమో వైరల్..

Advertisement

అసలు ఏం జరిగింది అనే విషయానికొస్తే.. డ్రామా జూనియర్స్ షోలో జడ్జెస్ గా శ్రీకాంత్, రోజా, అనిల్ రావిపూడి వ్యవహరిస్తుండగా.. సుధీర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇటీవల శ్రీకాంత్ తన ఇంట్లో ఎలా ఉంటారు? అనే విషయంపై సరదాగా చిన్నారులు స్కిట్ వేశారు. ఇక ఎప్పుడు డ్రామా జూనియర్స్ స్కిట్ల గురించే మాట్లాడుతుంటాడని, ఎంట్రీ సాంగ్ వేసే తప్ప ఇంట్లోకి రావట్లేదు అని సరదాగా ఒక స్కిట్ చేశారు. ఇది చూసిన హోస్ట్ సుధీర్ సార్ నిజంగానే మీరు ఇంట్లో ఇలా ఉంటారా? అని అడగగా.. లేదు నా భార్యను ఇక్కడకు పిలిపించి మరీ దానిని ప్రూవ్ చేస్తాను అంటూ చెప్పారు . ఇక అన్నట్టుగానే ఊహ తాజా ఎపిసోడ్కి విచ్చేసారు. ఏది ఏమైనా ఈ లేటెస్ట్ ప్రోమోలో ఊహ అందరి దృష్టిని మరోసారి ఆకట్టుకున్నారు అని చెప్పవచ్చు.

also read:‘ఇరుముడి’ ట్రైలర్.. రూటు మార్చిన రవితేజ, ఇది ఎక్స్‌పెక్ట్ చేయలేదుగా!

చీఫ్ గెస్ట్ గా ఊహ..

Advertisement

విడుదల చేసిన ప్రోమో విషయానికి వస్తే.. ఫినాలే ఎపిసోడ్లో ఊహించని థీమ్ తో స్కిట్లు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తొలిసారి ఎంటర్టైన్మెంట్లో చిన్నారులతో ట్రెండ్ సెట్ చేయబోతున్నట్టు ప్రోమో ద్వారా రివీల్ చేశారు. పైగా ఊహ, శ్రీకాంత్ ఇద్దరు కలిసి స్టేజ్ పై డాన్స్ కూడా చేశారు. మొత్తానికి అయితే తాజాగా గ్రాండ్ ఫినాలే కి సంబంధించిన ఫైనల్ ఎపిసోడ్ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. ఇందులో ఊహాను చూసిన అభిమానులు సర్ప్రైజ్ అవుతున్నారు. అప్పటికీ ఇప్పటికీ ఆమెలో ఏ మార్పు రాలేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Related News

Podarillu Today Episode : చక్రికీ దిమ్మతిరిగే షాక్.. గోపికకు మైండ్ బ్లాక్.. మాధవ్ కు టెన్షన్..

Karthika Deepam 2 Serial Today Episode September 29th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని బెదిరించడంతో జ్యోత్స్నను జాబ్ లోంచి తీసేసిన కేఫ్ ఓనరు             

Illu Illalu Pillalu Today Episodes: భాగ్యంకు షాక్.. ప్రేమ మాటతో ఫ్యూజుల్ అవుట్.. ప్రేమ పెళ్లికి రెడీ..

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్.. అవని దెబ్బకు షాక్.. పల్లవి పై అనుమానం..

Gundeninda Gudigantalu : ఒడియమ్మ బంటి.. ఒకరు కాదు.. ఇద్దరు అవుట్..

Ninnu kori Serial Today Episode September 29th ‘నిన్ను కోరి’ సీరియల్‌: జీవన్ కు వార్నింగ్ ఇస్తున్న దాక్షాయణి   

Tuesday Tv Movies : మంగళవారం మూవీ లవర్స్ కు పండగే.. డోంట్ మిస్…

సిగ్గులేదా? నెగటివ్ కామెంట్స్ పై చైత్ర రాయ్ ఎమోషనల్!

Big Stories

Advertisement
×