RGV Dues: ఆర్జీవి ..ఈ పేరు కాంట్రవర్సీ కి కేరాఫ్.అయితే గత కొంత కాలంగా ట్వీట్లతో వైరల్ అవుతున్న వర్మ తాజాగా సినిమాకి సంబందించిన విషయంలో వైరల్ అయ్యాడు.అది కూడా 9 ఏళ్లుగా 1.11 కోట్ల బాకీలను కట్టలేదంటూ.విషయంలోకి వెళ్తే ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయానాయక్ జీవితం ఆధారంగా పోలీస్ కంపెనీ అనే సినిమాని తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాలో హర్షవర్ధన్ రాణే హీరోగా నటిస్తున్నాడు.ఇక ఈ సినిమా ముంబైలోని వర్సోవా పరిసరాల్లో ఘనంగా ప్రారంభం అయింది కూడా.
ఈ క్రమంలో ఈ వారం సెట్‌లో షూటింగ్ జరుగుతుండగా ‘ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్’ (FWICE) ప్రతినిధులు సెట్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆర్జీవీ నుండి సినీ కార్మికులకు రావలసిన పాత బాకీలు చెల్లించాల్సిందే అంటూ కెమెరామెన్లు, లైటింగ్ డిపార్ట్‌మెంట్, ఫైటర్లు, స్పాట్ బాయ్స్ మరియు సౌండ్ విభాగం పనిచేయడానికి వీల్లేదని వర్కర్స్ అందరినీ బయటకు పంపించేశారు.
అలా దాదాపు ఐదు గంటల పాటు షూటింగ్ పూర్తిగా నిలిచిపోవడంతో వేరే దారి లేక రామ్ గోపాల్ వర్మ టీమ్ వెంటనే రంగంలోకి దిగి రూ. 1.11 కోట్లను FWICE ఖాతాలో ట్రాన్స్‌ఫర్ చేయడంతో తిరిగి సినిమా షూటింగ్ మళ్ళీ మొదలైందని తెలుస్తుంది.
ఇక ఈ పాత బాకీల విషయానికి వస్తే అమితాబ్ బచ్చన్ కాంబినేషన్‌లో ఆర్జీవీ తీసిన ‘సర్కార్ 3’ (2017) మరియు అక్కినేని నాగార్జున కాంబోలో వచ్చిన ‘ఆఫీసర్’ (2018) చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా డిజాస్టర్ అయిన సంగతి తెల్సిందే.
దాంతో ఆ సినిమాలకు పనిచేసిన టెక్నీషియన్లు, డైలీ వేజ్ వర్కర్ల జీతాలు అప్పటి నుండి ఇవ్వకుండా పెండింగ్ లో పెట్టేశారట.అయితే 2019లోనే ఆర్జీవీ “మాకు కొంత టైమ్ ఇవ్వండి, మార్చి 4 నాటికి అన్ని బాకీలు తీర్చేస్తాం” అని లేఖ రాసినా, ఆ తర్వాత నుంచి ఆ విషయాన్ని పట్టించుకోలేదని తెలుస్తుంది .
also read :కమిట్‌మెంట్ లేకుండా అవకాశాలు రావా..? ‘భాగ్య రేఖ’ఐశ్వర్య ఏం చెప్పిందంటే!
ఎట్టకేలకి వర్మ చాలా రోజుల తర్వాత ముంబై గడ్డ పై షూటింగ్ మొదలెట్టడంతో ఈసారి ఎట్టి పరిస్థితులలో వదిలేదేలేదని రంగం లోకి దిగింది ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్’ (FWICE).మొత్తానికి వర్మని ఇలా దొరకబుచ్చుకుని తమకి రావాల్సిన డబ్బులని ఇలా వసూలు చేశారన్న మాట.
ఏది ఏమైనా ఎవరికైనా దక్కాల్సిన డబ్బు ఎప్పటికైనా దక్కుతుందని ఈ సంఘటనతో మరోసారి ప్రూవ్ అయింది.