Vithika Sheru Varalakshmi Vratham:వితికా షేరు..’భీమిలి కబడ్డీ జట్టు,ప్రేమ ఇష్క్ కాదల్ వంటి సినిమాలలో నటించిన ఈ భామ వరుణ్ సందేశ్ తో పడ్డానండి ప్రేమలోమరి అనే సినిమాలో హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే.ఇక ఈ జోడీనే 2016 ఆగస్ట్ 19న పెళ్లి చేసుకొని ఒక్కటయింది కూడా.
ఇక ఆ తర్వాత సినిమాలు తగ్గించేసిన వితిక సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తూ అభిమానులని అలరిస్తుంటుంది.ఈక్రమంలోనే తన ఇన్స్టాలో షేర్ చేసిన “వరలక్ష్మీ వ్రతం DIY అమ్మవారి అలంకరణ” వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. “Devotion doesn’t have to be expensive” అనే క్యాప్షన్‌తో ఆమె చేసిన ఈ ప్రయత్నం నెటిజన్లను ఫిదా చేస్తుంది.
సాధారణంగా పండుగలు వచ్చాయంటే మార్కెట్లో దొరికే ఖరీదైన డెకరేషన్ వస్తువులు కొనుగోలు చేయడానికి వేలకు వేలు ఖర్చు చేస్తుంటారు. కానీ వితికా షేరు మాత్రం రూపాయి అదనపు ఖర్చు లేకుండా, కేవలం మన ఇంట్లో నిత్యం అందుబాటులో ఉండే వస్తువులతోనే అమ్మవారికి అందమైన దివ్య రూపాన్ని తీసుకొచ్చింది.
మన ఇళ్ళలో ఉండే పాత చెక్క పీటలు, కలశం చెంబులు, వాడుకలో లేని పట్టు శారీలు మరియు ఇంటి చుట్టూ ఉండే సహజమైన పూలతోనే ఆమె ఈ అలంకరణ పూర్తి చేసింది. ప్లాస్టిక్ స్టాండ్ లేదా చిన్న పీటను చీరతో కవర్ చేసి, అమ్మవారి రూపాన్ని తయారు చేసిన తీరు ఆమె క్రియేటివిటీకి నిదర్శనమనే చెప్పాలి.ఇక ఆడంబరాల కంటే భక్తి శ్రద్ధలు,మనసారా చేసుకునే పూజ ముఖ్యమని ఈ DIY ట్రిక్స్ ద్వారా నిరూపించింది వితిక.
ఏది ఏమైనా యూట్యూబ్‌లో వందల కొద్దీ వ్రతం వీడియోలు ఉన్నప్పటికీ, వితికా షేరు అందించిన ఈ కంటెంట్ ప్రతీ మిడిల్ క్లాస్ హోమ్‌మేకర్‌కి ఒక పర్‌ఫెక్ట్ గైడ్‌లా నిలుస్తుందనడం లో సందేహం లేదు.తక్కువ బడ్జెట్‌లో, ఎలాంటి హడావుడి లేకుండా ఇంటిని పండుగ కలగా మార్చుకోవాలనుకునేవారు తప్పకుండా చూడాల్సిన బెస్ట్ డివోషనల్ DIY వీడియో ఇదని చెప్పక తప్పదు.