E-Paper
Advertisement

ఈ కాంబినేషన్ అసలు ఊహించలేదు బాబోయ్.. ట్రైలర్ తో పూనకాలు తెప్పించిన కవిన్-నయన్!

ఈ కాంబినేషన్ అసలు ఊహించలేదు బాబోయ్.. ట్రైలర్ తో పూనకాలు తెప్పించిన కవిన్-నయన్!
Advertisement

Hi Movie: లేడీ సూపర్‌స్టార్ నయనతార,కుర్ర హీరో కవిన్ కాంబోలో సినిమా వస్తుంది అనగానే అందరిలోనూ ఒకటే క్యూరియాసిటీ! అసలు సినిమా ఎలా ఉండబోతుందా..ఈ జోడీ ఎలా స్క్రీన్ మీద కనిపించబోతుందా అని.ఇక వారందరికీ మంచి సర్ ప్రైజ్ ఇచ్చేలా వచ్చేసింది ‘హాయ్’ (Hi) మూవీ ట్రైలర్.విష్ణు ఎడవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ అవుట్ అండ్ అవుట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

నయనతారతో కవిన్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ సూపర్ 

‘హాయ్’ ట్రైలర్ చూస్తుంటేనే మూవీలో ఎంత ఫన్, ఎంత డ్రామా ఉండబోతోందో అర్థమైపోతోంది. ఒక వైపు నయనతార, మరోవైపు కవిన్ మధ్య వచ్చే సీన్లు థియేటర్లలో నవ్వుల పూవులు పూయించడం గ్యారెంటీ అని ట్రైలర్ హింట్ ఇచ్చేస్తుంది. ముఖ్యంగా నయనతారతో కవిన్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అదిరిపోయిందనే చెప్పాలి. వీరిద్దరి మధ్య వచ్చే ఫన్ డైలాగ్స్, ఎమోషనల్ అండ్ లవ్ ట్రాక్ యూత్ కి మంచి కిక్ ఇవ్వడం పక్కా.

Advertisement

ఈ సినిమాలో కేవలం లీడ్ పెయిర్ మాత్రమే కాదు.. సపోర్టింగ్ రోల్స్ గట్టిగానే ఉన్నాయి. వెటరన్ స్టార్స్ అయిన ప్రభు, రాధిక కాంబినేషన్ లో చాలా ఏళ్ళకి జోడీ కట్టడం ఇక్కడ విశేషం.ఇక వీరి టైమింగ్, కామెడీ సీన్స్ నెవర్ బిఫోర్ రేంజ్‌లో ఉండబోతున్నాయన్నది కోలీవుడ్ టాక్.

సినిమాని ప్రొడ్యూస్ చేసిన నయన తార 

ఇక ఈ ప్రాజెక్ట్‌కి ఉన్న మరో అతిపెద్ద ప్లస్ పాయింట్.. నయనతారల ‘రౌడీ పిక్చర్స్’, సెవెన్ స్క్రీన్ స్టుడియో, ఇంకా బిగ్ ప్రొడక్షన్ హౌస్ ‘జీ స్టూడియోస్’ సంయుక్తంగా నిర్మించడమే.ప్రొడక్షన్ పరంగా ఎక్కడా రాజీ పడకుండా విజువల్స్ చాలా గ్రాండ్‌గా తెరకెక్కించారని చూస్తేనే అర్థమవుతుంది.ఇక లోకేష్ కనగరాజ్ దగ్గర అసోసియేట్‌గా చేసిన విష్ణు ఎడవన్, తన ఫస్ట్ డైరెక్టోరియల్ డెబ్యూ ఈ సినిమాతో ఇవ్వడం ఇక్కడ మరో విశేషం.

Advertisement

also read :“నువ్వు ప*డుకోకుండా ఎదిగావా?”.. జాను లిరి వ్యాఖ్యలపై ఫోక్ వరలక్ష్మి ఫైర్!

ఏ స్థాయిలో మ్యాజిక్ రిపీట్ చేస్తుందో

ఇక ఈ లవ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఆగస్ట్ 28, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. కవిన్ గతంలో ‘దాదా’, ‘స్టార్’ సినిమాలతో కమర్షియల్ హిట్స్ కొట్టి మంచి ఫామ్‌లో ఉండగా, నయనతార వరుస పాన్-ఇండియా ప్రాజెక్టులతో టాప్‌లో ఉన్నారు. వీరిద్దరి క్రేజీ కాంబో బాక్సాఫీస్ దగ్గర ఏ స్థాయిలో మ్యాజిక్ రిపీట్ చేస్తుందో చూడాలి మరి.

Tags

Related News

9 ఏళ్లుగా సిబ్బందికి బకాయిలు చెల్లించని వర్మ.. షూటింగ్ నిలిపేయడంతో దిగివచ్చిన ఆర్జీవీ!

‘ఇరుముడి’ రిలీజ్.. ఈ మూవీ ఎందుకు చూడాలంటే?

విజయవాడలో స్టార్స్ సందడి: ఘనంగా ముగిసిన విబి ఎంటర్టైన్మెంట్స్ అవార్డుల వేడుక

టికెట్ రేట్ల ‘జీఓ’పై ఫైర్: తెలంగాణ సర్కార్‌కు థియేటర్ ఓనర్ల డెడ్‌లైన్!

తేదీలు, వారాల పేర్లతో వచ్చిన బ్లాక్ బాస్టర్ మూవీస్ ఇవే.. అనిల్ ప్లాన్ అదుర్స్!

నా బెడ్ రూమ్ గురించి పగటి కలలు కనొద్దు.. బాబా రామ్‌దేవ్‌పై కంగనా ఫైర్!

ఎన్టీఆర్, భూమిక మూవీల తర్వాత మాదే.. ‘మోడ్రన్ మిస్సమ్మ’ నుండి ఫస్ట్ సింగిల్!

Big Stories

Advertisement
×