Prashanth Neel:ప్రశాంత్ నీల్ (Prashanth Neel).. ఒకప్పుడు అసలు ఈయన పేరు కూడా ఎవరికి తెలిసేది కాదు. అలాంటిది కేజీఎఫ్ చాప్టర్ 1,2 రెండు సిరీస్ లతో ఈయన పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. అలా ఈ దర్శకుడితో సినిమాలు చేయడానికి ఇప్పుడున్న యువ హీరోలు తెగ ఆరాటపడుతున్నారు. అయితే అలాంటి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఎన్టీఆర్ (NTR)తో సినిమా చేయడానికి రెడీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఎన్టీఆర్ వార్-2(War-2) సినిమా ముగించుకొని ప్రశాంత్ నీల్ సినిమా సెట్లో పాల్గొన్నారు. అలా ఈ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయింది. అయితే జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న ఎన్టీఆర్ 31 (NTR 31)సినిమా కోసం ప్రశాంత్ నీల్ భారీ డిమాండ్లను నిర్మాతల ముందుంచినట్టు తెలుస్తోంది. తన డిమాండ్లకు ఒప్పుకోవాల్సిందే అన్నట్టుగా కండీషన్లు కూడా పెడుతున్నారట. మరి ఇంతకీ ప్రశాంత్ నీల్ డిమాండ్ లు ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం..
చిత్ర బృందానికి డైరెక్టర్ భారీ డిమాండ్స్..
ఎన్టీఆర్ హీరోగా, ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఎన్టీఆర్ 31 అనే వర్కింగ్ టైటిల్ తో ప్రస్తుతం సినిమా షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమాకి డ్రాగన్ (Dragon) అనే టైటిల్ పెట్టాలని మేకర్స్ ఆలోచన చేస్తున్నారు. అయితే ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ (NTR Arts Banner), మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అంతేకాదు ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. కాబట్టి ప్రశాంత్ నీల్ తనకి రెమ్యూనరేషన్ గా సినిమా హిట్ అయ్యాక వచ్చే లాభాల్లో 50% ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట.అలా అని సినిమాకి పూర్తిగా రెమ్యూనరేషన్ తీసుకోకుండా కేవలం సినిమాకి వచ్చే లాభాల మీదే ఆశ పడుతున్నారంటే పొరపాటు పడ్డట్లే.
డిమాండ్స్ ఒప్పుకుంటే.. నిర్మాతలకు మిగిలేదేంటి ?
ఎందుకంటే తనకు రెమ్యూనరేషన్ తో పాటు సినిమా లాభాల్లో 50% ఇవ్వాలని కొత్త డిమాండ్ చేస్తున్నారట. ప్రశాంత్ నీల్ పెట్టిన కండిషన్స్ తో నిర్మాతలు కూడా షాక్ అవుతున్నట్టు తెలుస్తోంది. సినిమా హిట్ అయ్యాక వచ్చే లాభాల్లో 50% ప్రశాంత్ నీల్ కి పోతే.. 25% ఎన్టీఆర్ ఆర్ట్స్ కి,మరో 25% మైత్రి మూవీ మేకర్స్(Mytri Movie Makers) తీసుకుంటారనే ప్రచారం కోలీవుడ్ సినీ వర్గాల్లో వినిపిస్తోంది.మరోవైపు ఎన్టీఆర్ ఈ సినిమా కోసం హైయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నారట. ఏకంగా రూ.100 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. అలా ఎటు చూసినా కూడా సినిమాకి బడ్జెట్ విషయంలో ఇబ్బందులు తలెత్తేలా కనిపిస్తున్నాయంటూ ఈ విషయం తెలిసిన చాలామంది నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. ఇక ఎన్టీఆర్ 31 మూవీ వచ్చే ఏడాది అనగా 2026 సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కాబోతున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే..
ప్రశాంత్ నీల్ సినిమాలు..
ఇక ప్రశాంత్ నీల్ సినిమాల విషయానికి వస్తే..ఆయన కే జి ఎఫ్(KGF) 1,2 సినిమాలతో పాటు సలార్ (Salaar) సినిమా ద్వారా ఇండస్ట్రీలో దిగ్గజ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం తెరకెక్కిస్తున్న ఎన్టీఆర్ 31 సినిమా కూడా భారీ అంచనాలతో రాబోతోంది. మరి ఈ సినిమా కోసం ప్రశాంత్ నీల్ పెట్టిన కండిషన్లకి నిర్మాతలు ఒప్పుకుంటారా..? లాభాల్లో 50% దర్శకుడికి ఇస్తారా? అనేది ముందు ముందు తెలుస్తుంది.
also read:OTTs Banned:షాకింగ్.. 25 ఓటీటీలపై ప్రభుత్వం బ్యాన్.. మొత్తం జాబితా ఇదే!