OTTs Banned: కరోనా వచ్చిన తర్వాత ఓటీటీ ప్లాట్ఫామ్స్ కి ప్రేక్షక ఆదరణ భారీగా పెరిగిపోయింది. ముఖ్యంగా థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడలేని చాలామంది ఈ ఓటీటీల ద్వారా కుటుంబంతో కలిసి సినిమాను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. మరికొంతమంది టికెట్ ధరలు పెరిగిపోయిన నేపథ్యంలో అంత డబ్బు పెట్టి సినిమాను థియేటర్లో చూడలేక.. ఇలా ఓటీటీ లకే పరిమితమవుతున్నారు. ఈ ఓటీటీలు అన్నీ కూడా వినోదపరతమైన కంటెంట్ ను ప్రసారం చేస్తున్నాయా అంటే లేదు అని చెప్పాలి. ముఖ్యంగా యువతను పక్కదోవ పట్టించేలా.. మహిళలను అసభ్యకరంగా చూపిస్తూ ప్రసారం చేసే కంటెంట్ తో చాలామంది యువత చెడిపోతున్నారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది.
25 ఓటీటీలపై కేంద్రం నిషేధం..
అందులో భాగంగానే అసభ్యకర వీడియో కంటెంట్ ను ఎక్కువగా ప్రసారం చేస్తున్న ఓటీటీ లపై కేంద్రం ఉక్కు పాదం మోపింది. ఇప్పటికే ఎన్నో సైట్లను బ్యాన్ చేసింది. అయినా సరే వాటికి అడ్డుకట్ట అనేది పడడం లేదు. ఎక్కువగా అసభ్య కంటెంట్ ను క్రియేట్ చేస్తున్న పలు ఓటీటీ లను కేంద్రం నిషేధించగా.. ఇప్పుడు మరికొన్ని ఓటీటీలపై పై ఏకంగా చర్యలు తీసుకుంది. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఉల్లు, దేశీ ఫ్లిక్స్ పాటు ఏకంగా 25 ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై నిషేధం విధించింది. అంతేకాదు ఈ యాప్లు అన్నింటినీ తొలగించాలి అని ఇంటర్నెట్ ప్రొవైడర్లను ఆదేశించింది.
ఈ ఓటీటీలపై చట్ట ఉల్లంఘన నేరం..
ఇకపోతే సదరు ఓటీటీలు ఎక్కువగా అసభ్యకర కంటెంట్ ను ప్రచారం చేస్తున్నాయని గతంలోనే పలుమార్లు హెచ్చరించినా తీరు మార్చుకోలేదు. ముఖ్యంగా అప్పటి కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ సృజనాత్మకత ముసుగులో అసభ్య కంటెంట్ ను ప్రోత్సహించకుండా ప్లాట్ఫామ్ లను హెచ్చరించారు.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, 2016 నిషేధాన్ని ప్రారంభించడానికి ముందు మంత్రిత్వ శాఖ మీడియా, మహిళా హక్కులు, పిల్లల రక్షణ నిపుణులను కూడా సంప్రదించింది. ఈ కంటెంట్ లో ఎక్కువగా మహిళలను అవమానకరమైన రీతిలో చిత్రీకరించడంతో అప్పట్లో హెచ్చరికలు జారీ చేశారు. అయినా తీరు మార్చుకోకపోవడంతో ఇప్పుడు వాటిపై నిషేధం విధిస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. ముఖ్యంగా ఈ ఓటీటీ లు.. ఐటీ చట్టంలోని సెక్షన్ 67, 67A , భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 292, మహిళల అసభ్య ప్రాతినిధ్యం చట్టం 1986లను ఉల్లంఘించినట్లు పరిగణించబడ్డాయి..పైగా ఇంటర్నెట్ ప్రొవైడర్లు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి అని ఆదేశాలు జారీ చేసింది.
ఆదేశాలు పాటించకపోతే తగిన చర్యలు తప్పవు..
ఇదిలా ఉండగా ఈ ఏడాది ఏప్రిల్ లో ఉల్లు, ఏఎల్టీటీ తో సహా పలు ఓటీటీ లలో ప్రసారమవుతున్న అసభ్య కంటెంట్ పై సుప్రీంకోర్టులో విచారణ జరగగా.. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని అత్యున్నత న్యాయస్థానం కేంద్రాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలోని 25 ఓటీటీలను కేంద్రం నిషేధించడం జరిగింది. ఇకపై అసభ్య కంటెంట్ ను ప్రసారం చేస్తే ఊరుకునేది లేదు అని ఖచ్చితంగా తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
కేంద్రం నిషేధించిన 25 ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లు ఇవే..
ఇకపోతే కేంద్రం నిషేధించిన 25 ఓటీటీ ప్లాట్ఫార్మ్స్ విషయానికి వస్తే.. మూడ్ ఎక్స్, బిగ్ షాట్స్, ఉల్లు, ఏఎల్టీటీ, బూమెక్స్, నవరస లైట్, గులాబ్, కంగన్, బుల్, జల్వా, లుక్ ఎంటర్టైన్మెంట్, హిట్ ప్రైమ్, వావ్ ఎంటర్టైన్మెంట్, షో ఎక్స్, ఫీనియో, హల్ చల్ యాప్, ఫుగి, మోజ్ ఫ్లిక్స్, ట్రిఫ్లిక్స్, అడ్డ టీవీ, హాట్ ఎక్స్, నియాన్ ఎక్స్ విఐపి , సోల్ టాకీస్, ప్రత్యామ్నాయం, ఫెనియా తదితర అశ్లీల ఓటీటీలు ఉన్నాయి.
Also read: Nayanthara: అవకాశం ఇస్తా.. ప** లోకి రమ్మన్నారు.. ఆ బడా నిర్మాత గుట్టు విప్పిన నయనతార !