Priyamani: ప్రముఖ సీనియర్ స్టార్ హీరోయిన్ ప్రియమణి (Priyamani ) గత కొంతకాలంగా స్టార్ స్టేటస్ కోసం ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే ఇప్పుడు థియేటర్ లోనే కాదు ఓటీటీలో కూడా సినిమాలు చేయడానికి సిద్ధమయ్యింది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె నటిస్తున్న వెబ్ సిరీస్ ‘ది గుడ్ వైఫ్’. ప్రముఖ డైరెక్టర్ రేవతి (Revathi ) ఈ వెబ్ సిరీస్ కి దర్శకత్వం వహించగా.. ఈరోజు (జూలై 4) జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఈ వెబ్ సిరీస్ అమెరికాలో వచ్చిన ‘ ది గుడ్ వైఫ్’ సిరీస్ ని ప్రియమణి కాపీ కొట్టి.. చేసిందంటూ ప్రచారం జోరుగా సాగింది. అయితే తాజాగా ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో పాల్గొన్న ప్రియమణి అంత కర్మ పట్టలేదు అంటూ రూమర్స్ కి గట్టి కౌంటర్ ఇచ్చింది.
కాపీ రూమర్స్ పై ప్రియమణి స్పందన..
ప్రియమణి మాట్లాడుతూ.. “ది గుడ్ వైఫ్ అనే వెబ్ సిరీస్ ను మన సాంప్రదాయానికి అద్దం పట్టేలా కొన్ని మార్పులు చేశాము.. భర్త సె*క్స్ కుంభకోణంలో అరెస్ట్ అయిన తర్వాత.. ఆ భార్య తన కుటుంబాన్ని ఎలా నడిపించింది. ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంది. అనే కోణంలో దీన్ని తీసాము. ముఖ్యంగా ఒక మహిళ ఎన్ని రకాల పాత్రలు పోషిస్తుందో అన్ని పాత్రలను ఇందులో చూపించాము. తల్లి, భార్య, గృహిణి ఇలా విభిన్నమైన పాత్రలో నేను నటించాను. అన్ని బాధ్యతలను నెరవేర్చుకోవడానికి ఎలాంటి కష్టాలు పడ్డానో ఇందులో చూస్తారు. అలా ఈ వెబ్ సిరీస్ కోసం ఎన్ని కష్టాలు పడ్డానో నాకు మాత్రమే తెలుసు. దీనిని మీరు ఓటీటీలో చూసినప్పుడే నా కష్టం అర్థమవుతుంది” అంటూ చెప్పుకొచ్చింది ప్రియమణి.
చాలా బాధగా ఉంది – ప్రియమణి
ఇకపోతే నా కష్టం గురించి ఆలోచించకుండా ఎవరో సృష్టించిన వార్తలను అందరూ ప్రచారం చేయడం చాలా బాధగా ఉంది. అయితే ఇలాంటి బాధ, ఫేక్ రూమర్స్ కొత్తేమీ కాదు.. గతంలో కూడా ఇలాంటి ఎన్నో రూమర్లు క్రియేట్ చేశారు. ముఖ్యంగా అసలు నిజం తెలుసుకోకుండా కాపీ కొట్టి సినిమా చేస్తోందని నన్ను అవమానించారు.. అయినా నాకు మా అమ్మ సపోర్టు ఎప్పటికీ ఉంటుంది. ఇండస్ట్రీలో చాలామంది నాకు అండగా నిలిచారు. ఈ సిరీస్ సగటు ఒంటరి మహిళ కష్టాలను చూపిస్తుంది. కచ్చితంగా అందరికీ ఈ వెబ్ సిరీస్ నచ్చుతుంది. అప్పటికైనా నాపై రూమర్స్ ఆగుతాయి. అయినా కాపీ కొట్టి సినిమా చేయాల్సినంత కర్మ నాకేం పట్టలేదు అంటూ ప్రియమణి తెలిపింది.
ప్రియమణి సినిమాలు..
అద్భుతమైన నటనతో విలక్షణ నటిగా పేరు సొంతం చేసుకున్న ప్రియమణి.. హీరోయిన్ గానే కాకుండా పాత్ర నచ్చితే క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్ర చేయడానికి కూడా వెనుకాడదు. అలా తన నటనతో భారీ పాపులారిటీ అందుకున్న ఈమె.. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా పనిచేస్తోంది. ఇప్పటివరకు నేషనల్ అవార్డుతో పాటు మూడు ఫిలింఫేర్ అవార్డులు, తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డు కూడా అందుకుంది. ఇక తెలుగులో ‘ఎవరే అతగాడు’ అనే సినిమాతో 2003లో సినీ రంగ ప్రవేశం చేసిన ఈమె.. ఇక అప్పటినుంచి వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.
ALSO READ:Harihara Veera Mallu: యూనిట్ కి భారీ షాక్.. విడుదల అడ్డుకుంటామంటూ బీసీ సంఘాలు డిమాండ్!