BigTV English

Vallabhaneni Vamsi: రాజకీయాలకు వల్లభనేని వంశీ బ్రేక్ ?

Vallabhaneni Vamsi: రాజకీయాలకు వల్లభనేని వంశీ బ్రేక్ ?

Vallabhaneni Vamsi: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎట్టకేలకు బెయిల్‌పై బయటకొచ్చారు. మూడు నెలలకు పైగా వివిధ కేసుల్లో విజయవాడ సబ్‌జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీ రాజకీయ పయనం ఎలా ఉండబోతుందనేది హాట్‌టాపిక్‌గా మారింది. కూటమి నేతలపై ఇష్టానుసారం నోరు పారేసుకున్న ఆయన జైల్లో అవతారం మారిపోయి.. అనారోగ్య సమస్యలతో నానా పాట్లు పడ్డారు. దాంతో విడుదల తర్వాత వంశీ తాత్కాలికంగా పొలిటికల్ బ్రేక్ తీసుకుంటారని భావించారు. అయితే మరుసటి రోజే ఆయన వెళ్లి జగన్‌ను కలిసి వచ్చారు. దాంతో ఆయన ఆ పార్టీలోనే కొనసాగడం ఖాయమైందంటున్నారు. మరి ఆ మాజీ ఎమ్మెల్యే ఇదివరకటి దూకుడు ప్రదర్శిస్తారా?


వల్లభనేని వంశీ రాజకీయ భవిష్యత్తుపై చర్చ

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ జైలు నుంచి విడుదలైన తర్వాత ఆయన రాజకీయ భవిష్యత్తుపై తీవ్ర చర్చ జరుగుతోంది. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి…ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో వంశీ వైసీపీకి మద్దతు పలికారు. వైసీపీకి మద్ధతు ఇవ్వడమే కాకుండా టీడీపీని టార్గెట్ చేసుకుని చెలరేగిపోయారు. గన్నవరం ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి వరుసగా రెండు సార్లు గెలిచిన వంశీ 2024 ఎన్నికల్లో గన్నవరంలో వైసీపీ నుంచి పోటీ చేసి ఓటమి మూటగట్టుకున్నారు. ఎమ్మెల్యేగా ఓడిపోవడం…అటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆయన కొంత కాలం కనిపించకుండా పోయారు.


సత్యవర్ధణ్ హత్య కేసులో అరెస్ట్ చేసిన పోలీసులు

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడికి సంబంధించి ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీని పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి విజయవాడ తీసుకొచ్చారు. బెజవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వల్లభనేని వంశీ అక్రమాలకు సంబంధించి తర్వాత వరుసగా కేసులు నమోదయ్యాయి. ఫిబ్రవరి 13న ఆయన ఆరెస్ట్ అయిన వంశీ పై మొత్తం 11 కేసులు నమోదు కావడంతో సుమారు 140 రోజులు జైలులో ఉన్నారు. అన్ని కేసుల్లో న్యాయస్థానాలు బెయిల్‌ మంజూరు చేయడంతో వంశీ ఎట్టకేలకు జైలు నుంచి బయటకు వచ్చారు.

జైల్లో ఉన్నప్పుడు పూర్తిగా మారిపోయిన వంశీ గెటప్

జగన్‌తో అందగాడని పొడిగించుకున్న వంశీ జైల్లో ఉన్నప్పుడు అవతారం పూర్తిగా మారిపోయింది. బరువు తగ్గిపోయి, అనారోగ్య సమస్యలతో నానా పాట్లు పడ్డారు. జైలు నుంచి బయటకు వచ్చిన వంశీ రాజకీయంగా ఎలా ముందుకు వెళ్లబోతున్నారనేది ఇప్పుడు చర్చనీంయశంగా మారింది. వంశీపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వేధించిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ కేసులను న్యాయపరంగా ఎదుర్కొంటూనే… రాజకీయంగాను వంశీ అడుగులు ముందుకు వేయబోతున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు.

గన్నవరంలోనే వంశీ రాజకీయం చేస్తారంటున్న పేర్ని నాని

జైలు నుంచి వంశీ విడుదలైన సందర్భంలోను వైసీపీ నేతలు మద్దతుగా నిలిచారు. ముఖ్యంగా మాజీ మంత్రి పేర్ని నాని జైలు దగ్గర చేసిన కామెంట్స్‌ వంశీ యాక్షన్ ప్లాన్‌ ఏంటో తెలియజేస్తున్నాయని వైసీపీ క్యాడర్ అంటోంది. గన్నవరం నుంచే వంశీ రాజకీయం చేస్తారని పేర్ని నాని గట్టిగా అంటున్నారు. గన్నవరంలో తిరిగి బలపడే విధంగా వంశీ కార్యచరణను సిద్ధం చేసుకుంటారనేది వైసీపీ నేతలు అంటున్నారు.

గతంలో గన్నవరం నుంచి 2 సార్లు గెలిచిన వంశీ

జిల్లాకు చెందిన వైసీపీ నేతల మద్ధతుతో ఓవైపు కేసులను న్యాయస్థానాల్లో ఎదుర్కొంటూనే.. రాజకీయంగాను వేగంగా అడుగులు ముందుకు వేసేందుకు వంశీ యాక్షన్ ప్లాన్ చేయబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది. వంశీ విడుదలతో గన్నవరం నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపే అవకాశం ఉందనే చర్చ నడుస్తోంది. గతంలో గన్నవరం నియోజకవర్గం నుంచి వంశీ రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు ఆయన జైలు నుంచి విడుదలై తన అనుచరులతో కలిసి గన్నవరంకు వెళ్లారు. రాబోయే ఎన్నికల నాటికి తన స్థానాన్ని పటిష్టం చేసుకోవడం ఆయన ముందున్న ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.

ప్రభుత్వం పై వల్లభనేని విరుచుకుపడతారా?

ఎన్నికల కౌంటింగ్ తర్వాత వల్లభనేని వంశీ గన్నవరానికి పూర్తిగా దూరమయ్యారు. అలాంటిదిప్పుడుతనపై నమోదైన కేసులను రాజకీయ కక్ష సాధింపు చర్యలని ప్రజల వివరించడం… కేసులతో తాను ఎదుర్కొన్న ఇబ్బందులపై తన వాదన వినిపించి ప్రజల మద్ధతు కూడగట్టం వంశీకి ప్రస్తుత పరిస్థితుల్లో పెద్ద సవాలే అంటున్నారు. ఆ క్రమంలో నియోజకవర్గంలో ఆయన ఎలాంటి కార్యచరణతో ప్రజల్లోకి రాబోతున్నారనదేద ఆసక్తికరంగా మారింది. వంశీ తిరిగి క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చి వైసీపీ తరపున బలమైన పాత్ర పోషిస్తారని వైసీపీ నాయకులు గట్టిగా చెబుతున్నారు. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నందున, ప్రభుత్వాన్ని విమర్శించడానికి వంశీ ఒక బలమైన గొంతుకుగా నిలుస్తారని వైసీపీ భావిస్తోంది.

Also Read: కాంగ్రెస్ పై యాదవుల అసహనం.. తగ్గిన ప్రాధాన్యత లభిస్తుందా?

ఆ క్రమంలోజైలు నుంచి విడుదలైన మరుసటి రోజే వంశీ, తన సతీమణి పంకజశ్రీతో కలిసి వైసీపీ అధ్యక్షుడు జగన్ ను తాడేపల్లి నివాసంలో కలవడంతో ఆయన పొలిటికల్ యాక్షన్ ఎలా ఉండబోతోందో తేలిపోయిందంటున్నారు. కష్టకాలంలో తనకు, తన కుటుంబానికి అండగా నిలిచినందుకు జగన్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జగన్.. వంశీ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, ధైర్యం చెప్పారు. మొత్తంగా, వల్లభనేని వంశీ విడుదల ఆయన రాజకీయ జీవితంలో టర్నింగ్ పాయింటే అంటున్నారు. ఆయన రాబోయే రోజుల్లో ఎలా ముందుకు వెళ్తారు, తనపై ఉన్న కేసులను ఎలా ఎదుర్కొంటారు, ఆయన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చూడాలి.

Story By Apparao, Bigtv

Related News

Palakurthi Politics: ఎర్రబెల్లి యూ టర్న్.. యశస్విని రెడ్డికి షాక్ తప్పదా?

Kadapa MLA: కడప రెడ్డమ్మ కథ రివర్స్..?

BJP Vs BRS: కేసీఆర్‌కు బీజేపీ షాక్! వెనుక స్కెచ్ ఇదే!

Urea War: బ్లాక్ మార్కెట్‌కు యూరియా తరలింపు.? కేంద్రం చెప్పిందెంత..? ఇచ్చిందెంత..?

AP Politics: సామినేని అంతర్మథనం..

Satyavedu Politics: మారిన ఆదిమూలం స్వరం.. భయమా? మార్పా?

Big Stories

×