Naga Vamsi : ప్రస్తుత కాలంలో ఆడియన్స్ సినిమా చూడటం చాలా ఈజీ ప్రాసెస్ అయిపోయింది. ఒకప్పుడు సినిమా చూడాలంటే లైన్లో నిల్చని టికెట్ల కోసం పడిగాపులు కాసేవాళ్ళు. ఇప్పుడు ఇంట్లో కూర్చుని బుక్ మై షో ఓపెన్ చేసి టికెట్ బుక్ చేసుకోవచ్చు. అలానే సినిమాకు సంబంధించిన టాక్ కూడా సోషల్ మీడియాలో వెంటనే వైరల్ అయిపోతుంది.
ప్రస్తుతం ఒక సినిమాకి సంబంధించి రివ్యూ ని కొన్ని రోజులు ఆపాలి అని కొంతమంది నిర్మాతలు ప్రయత్నాలు చేశారు. కానీ అది జరగని పని. అయితే ఇండస్ట్రీలో కొంతమంది నిర్మాతలు రివ్యూలు డబ్బులు ఇచ్చి మరి రాయిస్తారు అనే సంగతి తెలిసిందే. వాటన్నిటి పైన నిర్మాత నాగ వంశీ రీసెంట్గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.
ఆడియన్స్ కు నాగ వంశీ రిక్వెస్ట్
ఎర్లీ మార్నింగ్ రివ్యూస్, ట్విట్టర్ రివ్యూస్ మాస్ హిస్టీరియాను మేము క్రియేట్ చేస్తున్నాము. మాకు నచ్చిన వాళ్ళు, మా మాట వినేవాళ్లు పాజిటివ్ రివ్యూ ఇస్తారు. మేమంటే పడని వాళ్ళు నెగిటివ్ రివ్యూ ఇస్తారు. ఇదంతా మేము క్రియేట్ చేసిన ఒక మాస్ హిస్టీరియా. ఏది జెన్యూన్ కాదు. మీరు దయచేసి అర్థం చేసుకోండి అని ఆడియన్స్ను రిక్వెస్ట్ చేస్తున్నాను.
డబ్బులతో బుక్ మై షో లైకులు
బుక్ మై షో లో రేటింగ్స్ చూస్తుంటారు. బుక్ మై షో లో రేటింగ్స్ కానీ లైక్స్ కానీ అవి కూడా మేము డబ్బులు ఇచ్చి చేయించుకుంటున్నాం. ఒక పిఆర్ఓ వచ్చి మనిద్దరి సినిమాలు ఒకేసారి రిలీజ్ అవుతున్నాయి. కానీ ఆ సినిమాకి ఎక్కువ లైక్స్ ఉన్నాయి, మనకు తక్కువ లైక్స్ అని చెప్పినప్పుడు, ఎంతవుతుంది అని కనుక్కొని డబ్బులు ఇస్తాం. ఇవన్నీ ప్రొడ్యూసర్ కి జరుగుతున్న డామేజ్ అని తెలుసుకుని, గిల్డ్ లో ఒక నిర్ణయం తీసుకున్నాం.
ఇంకా బుక్ మై షో లో ప్రమోషన్స్ చేయకూడదు అని ఫిక్స్ అయిపోయాం. మన సినిమాను అక్కడ పెట్టి మన సినిమా టికెట్లు అమ్మితే ఆ వెబ్సైట్ రన్ అవుతుంది. టికెట్ మీద ఆల్రెడీ కమిషన్ తీసుకుంటున్నాడు. అది కాకుండా ఈ దోపిడీ కూడా, ఇవన్నీ వద్దు అని గిల్డ్ నిర్ణయం తీసుకొని 2, 3 మంత్స్ నుంచి మొత్తం ఆపేసాం. ఇక నాగ వంశీ నిర్మించిన కింగ్డమ్ సినిమా జులై 31న రిలీజ్ కి సిద్ధమవుతోంది. విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ఈ సినిమాతో స్ట్రాంగ్ కం బ్యాక్ ఇస్తాడు అని చాలామంది అంచనా వేస్తున్నారు.
Also Read: Naga Vamsi : మనం ఎవడమండి హిట్స్ ఇవ్వడానికి ? మన చేతుల్లో ఏమైనా ఉంటదా ?