Naga Vamsi : ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న యంగ్ సెన్సేషన్ ప్రొడ్యూసర్ అంటే నాగవంశీ. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన నాగ వంశీ సినిమాలు నిర్మిస్తూ ఉంటారు. ఒక గొప్ప సినిమాను నాగ వంశీ ఎలా నిర్మిస్తారో అదే సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడానికి కూడా చాలా కష్టపడుతుంటారు. చిన్న సినిమాను కూడా ముందుండి నడిపిస్తుంటారు.
ప్రస్తుతం సితార ఎంటర్టైన్మెంట్స్ నుండి రిలీజ్ కాబోతున్న సినిమా కింగ్డమ్. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా మొదలెట్టినప్పటినుంచి మంచి నమ్మకంతో ఉన్నాడు నాగ వంశీ. విజయ్ కు మీరు హిట్ ఇస్తా అన్నారా అని అడిగితే.. నాగ వంశీ తనదైన శైలిలో సమాధానం చెప్పాడు.
మనం ఎవడమండి హిట్స్ ఇవ్వడానికి
మనం ఎవడమండి హిట్స్ ఇవ్వడానికి ? మన చేతుల్లో ఏమైనా ఉంటదా ? జనాలకు ఏ సినిమా నచ్చుతుంది, ఏ సినిమా నచ్చడం లేదు అసలు అర్థం కావట్లేదు. కొన్ని సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయి అంటే, ఏంటిది మనకి ఇలా ఉంది. ఈ సినిమా ఏంటి ఇంత పెద్ద హిట్ అయిపోయింది. మనమేమైనా ఆఫ్ ట్రాక్ ఉన్నామా.? అని నామీద నాకే డౌట్ వచ్చేసింది. ఆ సినిమా పేరు చెప్పకూడదు. డైరెక్టర్, హీరో ఫీల్ అవ్వడం కంటే ఆడియన్స్ ఎక్కువ ఫీల్ అయిపోతారు. నీకు టేస్ట్ లేదు అని నన్ను తిడతారు. ఇవన్నీ నాకు అవసరమా.? పర్సనల్ ఆడియన్ గా నాకు ఆ సినిమా అసలు ఎక్కలేదు. ఇదేంటి ఇంత బ్లాక్ బస్టర్ అయిపోయింది. జనానికి దూరంగా ఉన్నామా ఏంటి అని సడన్ గా డౌట్ వచ్చింది.
జెర్సీ తర్వాత
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన జెర్సీ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. అనిరుద్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్ గా మారాయి. ముఖ్యంగా నాని నటించిన అన్ని సినిమాలలో కంటే కూడా జెర్సీ సినిమా ప్రత్యేకము అని చెప్పాలి. జెర్సీ సినిమా తర్వాత గౌతం చేస్తున్న సినిమా కాబట్టి కింగ్డమ్ సినిమా మీద కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా రెండు పార్టులులో విడుదల కానుంది. ఈ సినిమాను మొదలు పెట్టినప్పుడే రెండు పార్ట్స్ గా తీయాలి అని అనుకున్నారు. ఇక ఈ సినిమా ఫస్ట్ పార్ట్ కి కూడా ప్రాపర్ స్టార్టింగ్ ప్రాపర్ ఎండింగ్ ఉంటుంది అని తెలిపారు.
Also Read: Upasana Konidela: గ్రాండ్ గా ఉపాసన పుట్టిన రోజు జరిపిన రామ్ చరణ్, క్లింకారా పాప