OTT Movie : అమెరికన్ హారర్ సినిమాలు యూనిక్ సైకలాజికల్ డెప్త్, విజువల్ స్టోరీటెల్లింగ్‌తో ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాయి. సైకలాజికల్ అండ్ హారర్ జానర్ల కాంబినేషన్ లో ఓటీటీలో ఓ మంచి సినిమా కావాలనుకునే వారికి ఈ మూవీ బెస్ట్ ఆప్షన్. మరి ఓ మారుమూల గ్రామంలో భయంకరమైన రిచువల్స్ నేపథ్యంలో డైరెక్టర్ ఆరీ ఆస్టర్ రూపొందించిన ఈ మాస్టర్‌పీస్ హర్రర్ మూవీ పేరేంటి? ఏ ఓటీటీలో ఉందో తెలుసుకుందాం పదండి.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్
ఈ హర్రర్ మూవీ పేరు ‘Midsommar’. 2019లో రిలీజ్ అయిన ఈ 148-నిమిషాల ఫిల్మ్ ఆరీ ఆస్టర్ దర్శకత్వంలో, A24 నిర్మాణంలో తెరకెక్కింది. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video), హులు, MUBI ఓటీటీలలో అందుబాటులో ఉంది. ఇందులో ఫ్లోరెన్స్ పగ్ (డానీ), జాక్ రేనర్ (క్రిస్టియన్), విలియం జాక్సన్ హార్పర్ (జోష్), విల్ పౌల్టర్ (మార్క్), విల్హెల్మ్ బ్లామ్‌గ్రెన్ (పెల్లె) నటించారు. 2019లో ఇదొక కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. అయితే సినిమాలో గ్రాఫిక్ వయోలెన్స్, డిస్టర్బింగ్ రిచువల్స్, ఎమోషనల్ ట్రామాతో పాటు పెద్దలకు మాత్రమే అనేలా కొన్ని సీన్లు ఉంటాయి. కాబట్టి సెన్సిటివ్ ఆడియన్స్ జాగ్రత్తగా చూడాలి. చిన్న పిల్లలతో కలిసి చూడకూడదని గుర్తు పెట్టుకోండి.
కథలోకి వెళ్తే…
డానీ ఆర్డర్ (ఫ్లోరెన్స్ పగ్) అనే యువతి కథతో మొదలవుతుంది. డానీ తన సోదరి టెర్రీ, తల్లిదండ్రులను ఒక ట్రాజిక్ సూసైడ్-మర్డర్‌లో కోల్పోతుంది. దీనివల్ల ఆమె తీవ్రమైన ట్రామాతో బాధపడుతుంది. ఆమె బాయ్‌ఫ్రెండ్ క్రిస్టియన్ (జాక్ రేనర్) అన్‌సపోర్టివ్. అతను డిస్టాంట్ ఆంత్రోపాలజీ స్టూడెంట్. ఆమెను స్వీడన్ ట్రిప్‌కు తీసుకెళ్లమని అతని స్నేహితులు ఒత్తిడి చేస్తారు. క్రిస్టియన్, అతని స్నేహితులు జోష్ (విలియం జాక్సన్ హార్పర్), మార్క్ (విల్ పౌల్టర్), స్వీడిష్ స్టూడెంట్ పెల్లె (విల్హెల్మ్ బ్లామ్‌గ్రెన్)తో కలిసి స్వీడన్‌లోని హార్గా అనే మారుమూల గ్రామంలో జరిగే మిడ్‌సమ్మర్ ఫెస్టివల్‌కు వెళ్తారు.
ఇది 90 సంవత్సరాలకు ఒకసారి జరిగే 9-రోజుల వేడుక. హార్గా కమ్యూన్ మొదట అందమైన, సన్‌లిట్ పైస్టరల్ పారడైజ్‌లా కనిపిస్తుంది. ఫ్లవర్ క్రౌన్స్, వైట్ డ్రెస్సెస్, కమ్యూనల్ హార్మొనీతో అందంగా ఉంటుంది. అయితే, వేడుకలు ప్రారంభమైనప్పుడు హార్గా రిచువల్స్ డిస్టర్బింగ్‌గా మారతాయి. మొదటి రిచువల్‌లో ఒక వృద్ధ జంట తమ 72వ సంవత్సరంలో సాంప్రదాయకంగా స్వీయ-త్యాగం (సూసైడ్) చేసుకుంటుంది. ఒక కొండపై నుండి దూకి వీళ్ళకు షాక్ ఇస్తారు. ఇక్కడి నుంచి కథ ఊహించని మలుపులు తిరుగుతుంది. అసలు ఆ ఊర్లో ఏం జరుగుతోంది. ఈ గ్యాంగ్ ఆ భయంకరమైన విలేజ్ నుంచి ఎలా బయటపడ్డారు? ఎందుకు 9 మందికి సజీవంగా తగలబెట్టారు? అనేది మూవీని చూసి తెలుసుకోవాల్సిందే.