Vijay Devarakonda: ఇప్పుడైతే ట్రోల్ మెటీరియల్ కోసం ప్రస్తుతం కే ఏ పాల్ ను వాడుతున్నారు. కానీ ఒకప్పుడు ఆయన రేంజ్ వేరు. ఏ తెలుగువాడు రిసీవ్ చేయండి కేఏ పాల్ ఎచీవ్ చేశారు. తరువాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత అతను చేసే కొన్ని పనులు ట్రోల్ కంటెంట్ అయిపోయాయి. అతని సీరియస్గా మాట్లాడిన కూడా ప్రస్తుతం సీరియస్ గా తీసుకునే పరిస్థితుల్లో లేరు కొంతమంది.
గత కొంతకాలంగా బెట్టింగ్ యాప్స్ వలన ఎన్ని కుటుంబాలు నష్టపోయాయో మనకు కథనాలు వినిపిస్తూనే ఉన్నాయి. చాలామంది వాళ్ల ప్రాణాలను కోల్పోతున్నట్లు వార్తల్లో కనిపిస్తూనే ఉంది. ఇక దీనిపైన సీరియస్ యాక్షన్ తీసుకుంది గవర్నమెంట్. ఈ బెట్టింగ్ ఆప్షన్ ఎవరైతే ప్రమోట్ చేశారో వాళ్లందరిపై కూడా ఈడి చర్యలు తీసుకోవడం మొదలుపెట్టింది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ దేవరకొండ నేడు ఈడి ముందుకు హాజరయ్యాడు.
మండిపడ్డ కేఏ పాల్
ఈడి విచారణ అయిపోయిన తర్వాత, తను లీగల్ గా ఉన్న యాప్స్ ని మాత్రమే ప్రమోట్ చేశాను అన్నట్లు మాట్లాడారు విజయ్. దీనిపైన కేఏపాల్ విపరీతంగా స్పందించారు. నువ్వు డ్రీం లెవెల్ అనే ఒక యాప్ ని ప్రమోట్ చేశావు. అది బెట్టింగ్ యాప్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిస్సా వంటి ప్రాంతాలలో ఆ యాప్ ను బ్యాన్ చేశారు అనే విషయం నీకు తెలుసా. నువ్వు చాలా చిన్నపిల్లోడివి నువ్వు బయటికి వచ్చి అలా మాట్లాడటం వలన నీ ఫ్యాన్స్ కి ఏం మెసేజ్ ఇస్తున్నావ్.
బెట్టింగ్ యాప్స్ యూస్ చేసే వాళ్లకి వందకి 90% డబ్బులు రావు. నీకు మాత్రం ఖచ్చితంగా వస్తాయి. నువ్వు ఆల్రెడీ పది కోట్లు ఎంతో తీసుకొని ఉండి ఉంటావు. ఇప్పుడు తక్షణమే నువ్వు క్షమాపణలు చెప్పి తీరాలి. లేకపోతే నేను నీపై యాక్షన్ తీసుకోవడం మొదలు పెడతాను. 24 గంటల్లో నువ్వు సారీ చెప్పి, రీసెంట్ గా సురేష్ అనే ఒక వ్యక్తి తన ఆరేళ్ల కూతుర్ని విడిచిపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. నువ్వు ఆ డబ్బులను తీసుకుని వెళ్లి ఆ కుటుంబానికి అందజేయాలి.
గేమింగ్ యాప్స్ బెట్టింగ్ యాప్స్ ఒకటి కాదు అని నువ్వు మాట్లాడుతున్నావు. నీకు అసలు ఏమీ తెలియదు. ఆ రెండు ఒకటే. సుప్రీం కోర్ట్ అంటూ మాట్లాడావు. సుప్రీంకోర్టుని రెస్పెక్ట్ చేయాలి అని కూడా తెలియని స్థితిలో ఉన్నావు. అంటూ పలు రకాల వ్యాఖ్యలతో కేఏ పాల్ విజయ్ దేవరకొండ పైన మండిపడ్డారు. ఇది విజయ్ దేవరకొండ దృష్టికి చేరేవరకు మీడియా ఛానల్స్ అన్నీ టెలికాస్ట్ చేయాలి అని కేఏ పాల్ కోరారు.
Also Read: Jana Nayagan : పొంగల్ బరిలో పొలిటికల్ సినిమా, మలేషియాలో ఆడియో లాంచ్