BigTV English

Puja Banerjee: మొదటి రాత్రే కాలరాత్రి.. తొలి వివాహం పై ఊహించని కామెంట్స్ చేసిన పూజా బెనర్జీ!

Puja Banerjee: మొదటి రాత్రే కాలరాత్రి.. తొలి వివాహం పై ఊహించని కామెంట్స్ చేసిన పూజా బెనర్జీ!

Puja Banerjee: ప్రముఖ బాలీవుడ్ నటి పూజా బెనర్జీ (Puja Banerjee) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. నటనపై ఆసక్తితోనే సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఈమె.. వెండితెరపై అందం, అభినయంతో కుర్రకారును మాయ చేసింది. తన వరుస సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. ప్రేమించిన వ్యక్తి కోసం.. ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్న ఈమె.. మొదటి రాత్రే కాలరాత్రిగా మారింది అని, అలా వివాహం చేసుకోవడం తప్పు అని అప్పుడే తెలుసుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.


ఇంటి నుంచి పారిపోయి సినిమాల్లోకి ప్రవేశం..

ప్రముఖ హిందీ సీరియల్ స్టార్ ప్లస్ లో ప్రసారమైన ‘తుజ్ సంగ్ ప్రీత్ లగై సజ్నా’ లో నటించి ఆడియన్స్ మదిలో నిలిచిపోయింది పూజా బెనర్జీ (Pooja banerjee). వెండితెరపై అందం, అభినయంతో ఆకట్టుకున్న ఈమె.. జీవితంలో ఎన్నో కష్టాలను, సవాళ్లను కూడా ఎదుర్కొంది. 15 సంవత్సరాల వయసులోనే ఇంటి నుంచి పారిపోయి.. తన ప్రియుడు అరుణోయ్ చక్రవర్తిని 2004లో వివాహం చేసుకుంది. కానీ పెళ్లయిన కొద్ది రోజులకే విడాకులు తీసుకున్నారు.


మొదటి వివాహంతో తప్పు తెలుసుకున్నా – పూజా బెనర్జీ..

ఇప్పుడు ఇదే విషయంపై పూజా బెనర్జీ మాట్లాడుతూ.. “చిన్న వయసులోనే ఇంట్లో నుంచి పారిపోయి ఇష్టమైన వ్యక్తిని వివాహం చేసుకున్నాను. కానీ మొదటి రాత్రి కాలరాత్రిగా మారుతుందని అనుకోలేదు. మొదటి రోజే నేను వివాహం చేసుకున్న వ్యక్తి.. నాకు సరైన వ్యక్తి కాదు అనిపించింది. నేను పెళ్లి చేసుకునే సమయానికి నాకు 18 ఏళ్లు. ముఖ్యంగా నేను ప్రేమించి, నా తల్లిదండ్రులను విడిచిపెట్టి ఒక వ్యక్తి కోసం రావడం ఇది పూర్తిగా తప్పు అనిపించింది. పెళ్లి తర్వాత అతడు పూర్తిగా మారిపోయాడు. అయితే దానిని ఎలా ఎదుర్కోవాలో నాకు తెలియదు. అటు నా తల్లిదండ్రులను నిరాశపరిచిన నేను.. తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్లాలని అనుకోలేదు.

పెళ్లయింది కానీ భార్యాభర్తలం కాలేదు..

ఇక దాదాపు మేమిద్దరం కలిసి మూడేళ్లు ఒకే ఇంట్లోనే ఉన్నాం కానీ ఏ రోజు కూడా భార్య భర్తలుగా కొనసాగలేదు. ఇక వివాహమైన మూడు సంవత్సరాలకు అతడికి విడాకులు ఇచ్చి, బయటకు వచ్చేసాను” అంటూ మొదటి వివాహంలో తాను చేసిన తప్పును ప్రస్తావిస్తూ అసలు విషయం చెప్పుకొచ్చింది పూజా బెనర్జీ.

కునాల్ తో ప్రేమ.. పెళ్లికి ముందే బాబుకు జన్మనిచ్చిన పూజా..

ఇక తర్వాత కెరియర్ పై ఫుల్ ఫోకస్ పెట్టిన ఈమె.. మళ్లీ వెనుతిరిగి చూసుకోలేదు. ఆ తర్వాత తన తోటి నటుడు కునాల్ తో ప్రేమలో పడింది. 2017లో రహస్యంగా నిశ్చితార్థం చేసుకొని, ఆ తర్వాత ఘనంగా వివాహం చేసుకోవాలనుకున్నారు కానీ కరోనా వీరిద్దరి జీవితాన్ని మార్చేసింది. పెళ్లికి ముందే పూజా ఒక బాబుకు జన్మనిచ్చింది. అలా వ్యక్తిగతంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది పూజ బెనర్జీ. ప్రస్తుతం పూజా బెనర్జీ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

పూజా బెనర్జీ నటించిన తెలుగు చిత్రాలు..

తెలుగు చిత్రాలలో కూడా నటించింది. ‘వీడు తేడా’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈమె.. మళ్లీ తెలుగులో నటించలేదు. ఆ తర్వాత హిందీ, బెంగాలీ చిత్రాలలోనే నటిస్తూ భారీ పాపులారిటీ అందుకుంది.

ALSO READ:Suma kanakala: కొండాపూర్ లో సందడి చేసిన యాంకర్ సుమ.. జ్యువెలర్స్ స్టోర్ ఆరంభం!

Related News

Poonam Pandey: రామాయణ కీలక పాత్రలో పూనమ్ పాండే.. మండిపడుతున్న హిందూ సంఘాలు

Dhanush: అదే నా కల.. అందుకే మీ సినిమాలలో ఆ పాత్రలు చేస్తున్నారా సార్!

Allu Sneha: స్నేహ రెడ్డికి ఈ ఫోటో అంటే అంత ఇష్టమా.. అంత స్పెషల్ ఏంటబ్బా?

Pasivadi Pranam Film: చిరు పసివాడి ప్రాణం చైల్డ్ ఆర్టిస్ట్ ఆ హీరోయినేనా.. ఇప్పుడు ఎలా ఉందంటే?

Idli KottuTrailer: ఆకట్టుకుంటున్న ధనుష్ ఇడ్లీ కొట్టు ట్రైలర్.. పని ఆదాయం కోసమే కాదంటూ!

Actress Hema: మంచు లక్ష్మికి హేమ సపోర్ట్.. మధ్యలో యాంకర్ సుమను కూడా ఇరికించేసిందిగా!

Mohanlal: ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపికైన నటుడు మోహన్ లాల్.. ఖుషి అవుతున్న ఫ్యాన్స్!

OG Business: ఓజీ ముందు బిగ్ టార్గెట్… సేఫ్ అవ్వాలంటే ఎన్ని వందల కోట్లు కలెక్ట్ చేయాలంటే ?

Big Stories

×